Visual Arts
-
అందుకే తన కంపెనీని అమ్మేసిన రానా..
తెలుగు నటుడు రానా దగ్గుబాటి తన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ స్పిరిట్ మీడియా సేవలను నిలిపివేసినట్లు వెల్లడించారు. ఓ సమావేశంలో రానా మాట్లాడారు. ‘2005లో నా 18వ ఏటా స్పిరిట్ మీడియా అనే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీను ప్రారంభించాను. ఐదేళ్ల పాటు అందులో పనిచేశాను. ఎప్పటికైనా ఆ స్టూడియో ద్వారా సినిమా తీయాలని భావించాను. కానీ అలా జరగలేదు. అయితే దాన్ని మొదట అత్యంత సృజనాత్మకంగా నిర్మించాలని అనుకున్నాను. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దాని నిర్వహణ ఖరీదైంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ చాలా అధునాతనమైనవి. దాంతో ఆ కంపెనీను మూసివేశాను. విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని ప్రైమ్ ఫోకస్‌కి విక్రయించాను. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా అవతరించింది. అయితే 2005లో ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా అప్పట్లో విడుదలై రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అది థియేటర్లలో విడుదల కాలేదు. నా విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని అమ్మకానికి ఉంచినపుడు నాకు బాధ అనిపించలేదు. వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోతే దాన్నుంచి తప్పుకోవడమే మార్గం’అని అన్నారు. రానా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తలైవర్ 170లో నటిస్తున్నారు. రానా విక్రయించిన స్పిరిట్ మీడియా 'కల్కి 2898 AD' సినిమా అంతర్జాతీయ మార్కెటింగ్ భాగస్వామిగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. -
ఏమోయ్.. సినిమాకెళ్తున్నా..
ఏమోయ్.. సినిమాకెళ్తున్నా.. ఆ రెండు సూట్‌కేసుల నిండా బట్టలు సర్దావా.. పేస్టు, బ్రష్షు, సబ్బులు పెట్టావా.. అవునోయ్.. నా బీపీ ట్యాబ్లెట్లు పెట్టడం మరిచిపోకు సుమీ.. అన్నీ సర్దానండీ.. సినిమా మధ్యలో తినడానికి పడుంటాయని 5 కిలోల పల్లీలు వేయించి పెట్టానండీ.. బయట తిండి మీకు పడదాయే.. అందుకే ఓ రెండు జాడీల ఊరగాయ.. కిలో చల్ల మిరప కాయలు కూడా డబ్బాలో పెట్టి.. బ్యాగులో పెట్టానండీ.. గుమ్మం దగ్గర సతీమణి హారతిచ్చి.. వీర తిలకం దిద్దగా.. కుటుంబరావు ‘ఆంబియన్స్’ సినిమాకి విజయోత్సాహంతో బయలుదేరాడు.. ఏంటిదీ అనుకుంటున్నారా.. ఓ సినిమా కెళ్లడానికి ఇంత సెటప్ ఎందుకనుకుంటున్నారా.. 2020లో రిలీజ్ అయ్యే ‘ఆంబియన్స్’ సినిమా నిడివి ఏకంగా 720 గంటలు!! రోజుల్లో చెప్పాలంటే.. 30 రోజులు.. అందుకే ఇదంతా అన్నమాట. దీన్ని తీస్తోంది స్వీడిష్ డైరెక్టర్ ఆండర్స్ వెబర్గ్. 20 ఏళ్లపాటు విజువల్ ఆర్ట్స్ రంగంలో పనిచేసిన వెబర్గ్.. 2020లో తన కెరీర్‌ను ముగించాలనుకుంటున్నాడు. అంతలోగా.. ప్రపంచమంతా గుర్తుంచుకునేలా ఏదైనా చేయాలనుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన సినిమా తీయడానికి సంకల్పించాడు. తాను కొత్త విధానంలో తీస్తున్నానని.. దీనికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘమైన సినిమా ‘మోడరన్ టైమ్స్ ఫరెవర్’ అని అది 240 గంటల నిడివి ఉందని.. ఇప్పటికే ఆంబియన్స్ చిత్రానికి సంబంధించి 400 గంటల షూటింగ్ పూర్తి చేసేశానన్నాడు. ఇంకో ట్విస్టేమిటంటే.. ఇది మూకీ సినిమానట.. అంటే డైలాగులు నిల్.. ఈ మధ్య సినిమాల్లో డైలాగుల వాడకం బాగా పెరిగిపోయిందని.. ఓ మంచి విషయాన్ని చెప్పడానికి మాటలు అవసరం లేదంటున్నాడు వెబర్గ్. మొత్తం 100 మంది నటులు ఉన్న ఈ సినిమాకు నిర్మాత కూడా అతడే. 2018లో టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నాడు. దీని నిడివి జస్ట్ 72 గంటలు! 2020లో ఒకేసారి అన్ని దేశాల్లో దీన్ని విడుదల చేస్తారట. పైగా.. ఒకే షో వేస్తారట. తర్వాత మళ్లీ దాన్ని ఎవరూ ప్రదర్శించకుండా ఉండటానికి.. ఈ సినిమా కాపీలను తగుల బెట్టే యోచనలో ఉన్నాడు వెబర్గ్.. అతడి పిచ్చి గానీ.. జనం ఆ చాన్స్ అతడికి ఇస్తారంటారా??