విఠల్‌రావు దేశ్‌పాండేకు వైఎస్సార్సీపీ నివాళి
ఆదిలాబాద్ రిమ్స్ : మాజీ ఎమ్మెల్యే విఠల్‌రావు దేశ్‌పాండేకు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. భుక్తాపూర్ కాలనీలోని విఠల్‌రావు దేశ్‌పాండే నివాసంలో మనుమడు భార్గవ్ దేశ్‌పాండేతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు విఠల్‌రావు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఆయన మతి తీరని లోటని, ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు మెస్రం శంకర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మునేశ్వర్ గంగన్న తదితరులున్నారు.