అలాంటి వాళ్లు నాకు చిన్నపిల్లల్లా కనిపిస్తారు: దేవీశ్రీ ప్రసాద్
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అందరి జీవితాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని.. కానీ నా లైఫ్లో కేవలం అప్స్ మాత్రమే ఉంటాయన్నారు. నాకు ఎవరైనా చెడు చేస్తే వారు చిన్న పిల్లలుగా కనిపిస్తారని అన్నారు. దేవుడిపై భారం వేసి జీవితంలో సక్సెస్ అవుతుంటానని వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియంలో స్టేజ్ ఏర్పాటు చేశామని.. ర్యాంప్ కూడా వేశామని తెలిపారు. నా ప్రతి షో ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు జరగబోయే స్పోర్ట్స్ స్టేడియం కూడా అద్భుతంగా ఉందని దేవీశ్రీ ప్రసాద్ అన్నారు.ఇటీవల కర్ణాటక లో చేసిన షో సక్సెస్ అయిందని దేవీశ్రీ ప్రసాద్ తెలిపారు. నా మ్యూజికల్ షోకు చాలామంది అతిరథ మహారథులు చెప్పారు. రంగ స్థలం, సరిలేరు నీకెవ్వరు వంటి పలు సినిమాలు విశాఖలో చేశామని గుర్తు చేశారు. అందరు నాపై చూపించే ప్రేమనే నాకు ఎనర్జీ అని అన్నారు. పలు విదేశాల్లో తాను షోలు చేశానని డీఎస్పీ వెల్లడించారు. ఇటీవల మ్యూజికల్ నైట్కు వైజాగ్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.వైజాగ్లో అనుమతి నిరాకరణటాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వైజాగ్లో నిర్వహించబోయే మ్యూజికల్ నైట్కు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. నాలుగు సార్లు ప్రయత్నించినా విశాఖ పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఏప్రిల్ 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు డీఎస్పీ (Devi Sri Prasad) సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ లైవ్ షో కోసం ఆన్లైన్లో భారీగా టికెట్లు విక్రయించారు. కానీ భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేమని సీపీ శంఖబ్రత బాగ్చీ తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆక్వా వరల్డ్లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలోనే అనుమతులకు నిరాకరించారు.