విశాఖ- హైదరాబాద్‌కు మరో విమాన సర్వీస్
విశాఖపట్నం: హైదరాబాద్-విశాఖ నగరాల మధ్య మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఓ సర్వీసు అందిస్తున్న స్పైస్‌జెట్ విమానయాన సంస్థ తాజాగా జూలై 1 నుంచి మరో సర్వీసు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ విమానం హైదరాబాద్‌లో రాత్రి 7.20 గంటలకు బయలుదేరి అదే రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుతుంది. ఇక్కడి నుంచి రాత్రి 8.40 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు అదేరాత్రి రాత్రి 10.15 గంటలకు చేరుతుందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.