VK Sasikala lawyer
-
పది రోజుల్లో చిన్నమ్మ విడుదల!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ పది రోజుల్లో జైలు నుంచి విడుదల య్యే అవకాశాలున్నట్టు ఆమె న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ ధీమా వ్యక్తం చేశారు. జరిమానా మొత్తం రూ.10 కోట్ల 10 వేలు సిద్ధం చేశామని తెలిపారు. అక్రమాస్తుల కేసులో శిక్ష ముగించుకుని జనవరిలో శశికళ జైలు నుంచి విడుదల అవుతారని ఇప్పటికే సంకేతాలు వెలుడిన విషయం తెలిసిందే. తన న్యాయవాది రాజాచెందూర్ పాండియన్‌కు శశికళ ఆదివారం ఓలేఖ కూడా రాశారు. (శశికళ వ్యూహం.. పది కోట్ల జరిమానాకు రెడీ) ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ న్యాయవాది గురువారం మీడియాతో మాట్లాడారు. పది రోజుల్లో చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిన్నమ్మ తనకు రాసిన లేఖలోని అంశాల ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నట్టు పేర్కొన్నారు. చిన్నమ్మకు కోర్టు విధించిన రూ.10 కోట్ల 10 వేలు జరిమానాను సిద్ధం చేసినట్టు తెలిపారు. కర్ణాటక జైళ్ల నిబంధనల మేరకు శిక్ష అనుభవించే వారికి నెలలో 3 రోజులు సత్ప్రవర్తన పరిధిలో ఉంటుందని, చిన్నమ్మ కు 129 రోజుల శిక్షా కాలం తగ్గుతుందన్నారు. ఇప్పటికే చిన్నమ్మ 43 నెలలు జైల్లో ఉన్నారని, మరో పది రోజు ల్లో ఆమె విడుదలయ్యేందుకు అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో కోర్టులకు దసరా సెలవులని, ఈనెల 26న కోర్టులు పునః ప్రారంభం కానున్నా యని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళ లేదా బుధవారం మంచి సమాచారం వెలువడే అవకాశం ఉందని చెప్పారు. చిన్నమ్మ జైలు నుంచి ముందు గానే విడుదల అవుతారని ఇప్పటికే తాను పేర్కొన్నానని, ఇది జరిగి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. (ఎన్నికల్లో పోటీకి శశికళ వ్యూహరచన) -
'10 కోట్ల చెల్లింపునకు సిద్ధంగా ఉండండి'
సాక్షి, చెన్నై : చట్ట ప్రకారం కర్ణాటక జైళ్ల శాఖ మంచి నిర్ణయం తీసుకుంటుందని, జరిమానా చెల్లింపునకు సిద్ధంగా ఉండాలని న్యాయవాది రాజాచెందూర్ పాండియన్‌కు చిన్నమ్మ శశికళ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. శిక్షాకాలం 2021 జనవరిలో ముగియనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆమెతో ములాఖత్ అయ్యేందుకు సన్నిహితులు, న్యాయవాదులకు కర్ణాటక అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో శశికళ తన న్యాయవాదికి రాసిన లేఖ సోమవారం వెలుగులోకి వచ్చింది. (సీఎంని పరామర్శించిన ఎంకే స్టాలిన్) లేఖలో ఏముందంటే.. భగవంతుడి దయతో తాను బాగానే ఉన్నానని చిన్నమ్మ పేర్కొన్నారు. తమిళనాడును కరోనా వణికిస్తోందని, దాని ప్రభావం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రం కరోనా నుంచి పూర్తిగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. మార్చి నుంచి తనతో ములాఖత్‌లను కర్ణాటక జైళ్ల శాఖ నిలుపుదల చేసిందని, ఎప్పుడు పునరుద్ధరిస్తుందదో తెలియదన్నారు. తన విడుదల విషయాన్ని ప్రస్తావిస్తూ జైళ్ల శాఖ త్వరలో చట్ట ప్రకారం మంచి నిర్ణయం తీసుకుంటుందని, మంచే జరుగుతుందని భావిస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లింపునకు సిద్ధంగా ఉండాలని, అలాగే కోర్టులో పిటిషన్ దాఖలు, ఇతర న్యాయపరమైన వ్యవహారాలపై ఢిల్లీలోని సీనియర్ న్యాయవాదుల్ని సంప్రదించాలని ఆదేశించారు. దినకరన్(అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత)తో కలిసి ముందుకు సాగాలని కోరారు. -
శశికళ లాయర్ పై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆస్తుల కేసులో జైలుశిక్ష పడిన ఎంకే శశికళ లొంగిపోయేందుకు మరింత గడువు కావాలని భంగపడ్డారు. సుప్రీంకోర్టులో ఆమె తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని మరింత గడువు కావాలని శశికళ తరపు లాయర్ కోరగా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే(ఇమ్మీడియట్లీ) అనే పదానికి అర్థం తెలుసా అని మండిపడింది. ఆస్తుల కేసులో శశికళకు మంగళవారం సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది. అయితే అనారోగ్య కారణాలు చూపించి మరింత గడువు కోరేందుకు ‘చిన్నమ్మ’ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జైలు శిక్షను మరికొన్ని రోజులు వాయిదా వేయించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె బుధవారం సాయంత్రం బెంగళూరులోని పరప్పణ కోర్టులో లొంగిపోయారు. మరోవైపు అన్నాడీఎంకేలో అధికార సంక్షోభం కొనసాగుతోంది.