శశికళ లాయర్ పై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆస్తుల కేసులో జైలుశిక్ష పడిన ఎంకే శశికళ లొంగిపోయేందుకు మరింత గడువు కావాలని భంగపడ్డారు. సుప్రీంకోర్టులో ఆమె తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని మరింత గడువు కావాలని శశికళ తరపు లాయర్ కోరగా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే(ఇమ్మీడియట్లీ) అనే పదానికి అర్థం తెలుసా అని మండిపడింది.
ఆస్తుల కేసులో శశికళకు మంగళవారం సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది. అయితే అనారోగ్య కారణాలు చూపించి మరింత గడువు కోరేందుకు ‘చిన్నమ్మ’ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జైలు శిక్షను మరికొన్ని రోజులు వాయిదా వేయించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె బుధవారం సాయంత్రం బెంగళూరులోని పరప్పణ కోర్టులో లొంగిపోయారు. మరోవైపు అన్నాడీఎంకేలో అధికార సంక్షోభం కొనసాగుతోంది.