'బియాస్ నది బాధిత కుటుంబాలకు 5 లక్షలు చెల్లించండి'
హైదరాబాద్: బియాస్ నది దుర్ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ప్రభుత్వాన్ని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ఆకస్మికంగా నీటి ప్రవాహం పెరగడంతో జూన్ 8వ తేది ఆదివారం విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్ధులు గల్లైంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లైంతనవారిలో 17 మంది విద్యార్ధుల మృతదేహాలు లభ్యమవ్వగా, ఇంకా 7 మృతదేహాలు దొరకాల్సి ఉంది.