volgograd
-
చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్ బంక్
మాస్కో: కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఆగస్టు నెలలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా రష్యాలోని ఓ పెట్రోల్ బంక్లో భారీ పేలుడు సంభవించింది.. సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వోల్గోగ్రాడ్ పెట్రోల్ స్టేషన్లో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళం అక్కడకు చేరుకుంది. మంటల ధాటికి అంతలోనే భారీ పేలుడు చోటుచేసుకోవడంతో పెట్రోల్ బంక్ నామరూపాల్లేకుండా పోయింది. పెట్రోల్ స్టేషన్కు సంబంధించిన పైప్లైన్లు కూడా పేలి పోవడంతో సుమారు 200 మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక లెబనాన్ రాజధాని బీరుట్లో జరిగిన భారీ పేలుడు ఘటనతో 160 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. (నిరసనలు: లెబనాన్ ప్రధాని రాజీనామా) -
చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్ బంక్
-
రష్యాలో మరో ఆత్మాహుతి దాడి
మాస్కో: రష్యాలో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆదివారం నాటి ఆత్మాహుతి దాడి నుంచి తేరుకోకముందే.. అదే వోల్గోగ్రాడ్ నగరంలో సోమవారం బస్సులో ఓ ఆగంతకుడు తనను తాను పేల్చేసుకున్నాడు. తాజా దాడిలో 14 మంది మృత్యువాత పడగా.. మరో 28 మంది గాయపడ్డారు. ఉదయం పూట కావడంతో ట్రాలీ బస్సు కిక్కిరిసిపోయి ఉన్న సమయంలో ఈ పేలుడు జరిగింది. దీంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సు ముందుభాగం, రూఫ్ మాత్రమే మిగిలాయంటే పేలుడు తీవ్రంత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి మృతదేహాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. డీఎన్ఏ నమునాల ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపారు. పేలుడు కోసం నాలుగు కేజీల టీఎన్టీని ఉపయోగించారని చెప్పారు. ఆదివారం నాటి బాంబు దాడిలో వినియోగించిన పేలుడు పదార్థాల వంటివే తాజా పేలుడులో కూడా ఉపయోగించినట్టు గుర్తించామన్నారు. ఆదివారం వోల్గోగ్రాడ్లోని ప్రధాన రైల్వే స్టేషన్లో ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 17 మంది మృతి చెందడం తెలిసిందే. -
వోల్గోగ్రాడ్లో 48 గంటల్లో రెండో పేలుడు
-
రష్యాలో మరో పేలుడు: 15 మంది మృతి
మాస్కో: రష్యా వోల్గోగ్రాడ్లో మరో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. ప్రైవేటు ట్రాలీ బస్సులో పేలుడు జరగడంతో వీరంతా చనిపోయారు. 48 గంటల్లో ఇది వరుసగా రెండో పేలుడు కావడంతో రష్యా అంతటా అప్రమత్తత ప్రకటించారు. ముఖ్యంగా వోల్గోగ్రాడ్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నిన్న వోల్గోగ్రాడ్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆత్మాహుతిదాడిలో 18 మంది మరణించిన విషయం తెలిసిందే. కాగా గత అక్టోబర్లో కూడా ఇదే నగరంలో ఓ మహిళ బస్సులో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆ ఘటనలో ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.