రష్యాలో మరో పేలుడు: 15 మంది మృతి | Bomb blast in russia : 15 died | Sakshi
Sakshi News home page

రష్యాలో మరో పేలుడు: 15 మంది మృతి

Published Mon, Dec 30 2013 11:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

Bomb blast in russia : 15 died

మాస్కో: రష్యా వోల్గోగ్రాడ్‌లో మరో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు.   ప్రైవేటు ట్రాలీ బస్సులో పేలుడు జరగడంతో వీరంతా చనిపోయారు. 48 గంటల్లో ఇది వరుసగా రెండో పేలుడు కావడంతో రష్యా అంతటా అప్రమత్తత ప్రకటించారు. ముఖ్యంగా వోల్గోగ్రాడ్‌లో తనిఖీలు ముమ్మరం చేశారు. నిన్న వోల్గోగ్రాడ్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆత్మాహుతిదాడిలో 18 మంది మరణించిన విషయం తెలిసిందే.  కాగా  గత అక్టోబర్లో కూడా ఇదే నగరంలో ఓ మహిళ బస్సులో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆ ఘటనలో ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.   
 

 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement