చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్‌ బంక్‌ | Watch: 12 Injured Explosion At Volgograd Petrol Station In Russia | Sakshi
Sakshi News home page

చూస్తుండగానే పేలిపోయిన పెట్రోల్‌ బంక్‌

Published Tue, Aug 11 2020 4:07 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఆగస్టు నెలలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో జరిగిన అత్యంత భారీ పేలుడు ఘటనతో 16 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రష్యాలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వోల్గోగ్రాడ్‌ పెట్రోల్‌ స్టేషన్‌లో మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళం అక్కడకు చేరుకుంది. మంటల ధాటికి అంతలోనే భారీ పేలుడు చోటుచేసుకోవడంఓ పెట్రోల్‌ బంక్‌ నామరూపాల్లేకుండా పోయింది. పెట్రోల్‌ స్టేషన్‌కు సంబంధించిన పైప్‌లైన్లు కూడా పేలి పోవడంతో సుమారు 200 మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement