voter Enrollment
-
నామినేషన్ల గడువుకు 10 రోజుల ముందువరకు ఓటర్ల నమోదు
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువుకు పదిరోజుల ముందువరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా చెప్పారు. ఎన్నికలు జరగనున్న మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో ఆయన సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ ప్రతినిధులకు తుది ఓటర్ల జాబితా అందచేశారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ అర్హత ఉండి తుది జాబితాలో పేరులేని ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. నామినేష్ల దాఖలు గడువుకు పదిరోజుల ముందువరకు సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. శ్రీకాకుళం–విజయనగరం–విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులరెడ్డి, కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గోపాలరెడ్డి వెన్నపూస పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పదవీకాలం కూడా మార్చి 29తో ముగుస్తోంది. దీంతో ఈ ఐదుస్థానాలకు ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇదీ చదవండి: విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకు సీఎం అభినందనలు -
జమ్ములో వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఎన్నికల నేపథ్యంతో.. స్థానికేతరులకు సైతం ఓటు హక్కు కలిగేలా జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ప్రాంతీయ పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడంతో.. ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఏడాది కాలంగా జమ్ము రీజియన్ జిల్లాలో నివాసం ఉంటున్న వాళ్లకు.. ఎలాంటి ధ్రువీకరణ లేకున్నా నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొచ్చంటూ తహసీల్దార్లకు మంగళవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా.. ఆ నివాస ధ్రువీకరణ పత్రాలతో ప్రాంతీయేతరులు సైతం ఓటర్ జాబితాలో తమ పేరును నమోదు చేసుకునే లభిస్తుందన్నమాట. అయితే.. ఈ ఆదేశాలపై ప్రాంతీయ పార్టీలన్నీ భగ్గుమన్నాయి. ఓటర్లను దిగుమతి చేసుకునే బీజేపీ కుట్రలో ఇది భాగమంటూ మండిపడ్డాయి. గులాం నబీ ఆజాద్.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు కేంద్రంపై ‘వలసవాద విధానం’ అంటూ మండిపడ్డారు. రాజకీయ దుమారం చెలరేగడంతో.. వివాదాస్పదమైన ఈ ఉత్తర్వులను గత రాత్రి(బుధవారం) వెనక్కి తీసేసుకున్నారు అధికారులు. ఇక జమ్ము కశ్మీర్లో ఓటర్ నమోదు, సవరణల ప్రక్రియ నవంబర్ 25లోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని ప్రకటించారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు ముందు దాకా.. అక్కడ శాశ్వత నివాసితులకు మాత్రమే ఓటర్లుగా అవకాశం ఉండేది. అయితే.. ఆగష్టు 2019 తర్వాత స్థానికేతరులకు అవరోధంగా ఉన్న చట్టాలన్నీ రద్దు చేయబడ్డాయి. దీంతో నాన్ లోకల్స్‌ను సైతం ఓటర్ లిస్ట్‌లో చేర్చేందుకు అవకాశం లభించినట్లయ్యింది. ఈ ఆగష్టులో కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ మొదలుకాగా.. స్థానికేతరులకు అవకాశం లభిస్తే 20-25 లక్షల మధ్య కొత్త ఓటర్లు జత అవుతారని జమ్ము కశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంచనా వేస్తున్నారు. -
అర్హులైన వారంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి
-
ఓటరు నమోదుకు ఇంకా 48 గంటలే గడువు
-
నేటి నుంచి కాల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, చంద్రగిరి రూరల్(చిత్తూరు): సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఈసీ కోడ్‌ను అమలు చేయడంతో చంద్రగిరి నియోజకవర్గ కాల్ సెంటర్‌ను బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సబ్ కలెక్టర్ మహేష్‌కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంపై ఎటువంటి ఫిర్యాదులు, ఓటుకు సంబంధించిన సమాచారం కోసం 0877–2970959 నంబరును సంప్రదించాలని తెలిపారు. మంగళవారం ఆయన తిరుపతిలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ రాజ కీ య పార్టీ ప్రతినిధులతో ఎన్నికల నియమావళిపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రచార అనుమతుల కోసం ఎన్నికల కమిషన్ రూపొందించిన సువిధ యాప్ ద్వారా 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్బన్ ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. సి విజిల్ యాప్ ద్వారా డబ్బు, వస్తువులు పంపిణీ జరిపితే ఫొటో, వీడియోలు తీసి పెట్టిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లు 24 గంటలూ పర్యవేక్షిస్తుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ కిరణ్‌కుమార్, చంద్రగిరి ఏఈఆర్ఓ హరికుమార్, డీటీలు ఝాన్సీ, లక్ష్మినారాయణ, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మూడు రోజుల ఓటు నమోదు ఓటు హక్కు పొందని వారు మరో మూడు రోజుల్లోపు ఓటు నమోదు చేసుకోవాలని తిరుపతి నియోజకవర్గ ఎన్నికల అధికారి, తుడా కమిషనర్ విజయరామరాజు అన్నారు. మంగళవారం ఆయన తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో బ్యాంకు అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరు కూడా రూ.50 వేలకు మించి నగదును తీసుకెళ్లకూడదన్నారు. అంతకు మించి రూ.10 లక్షల వరకు అయితే ఆధారాలు తేలే వరకు ఆ నగదును ప్రభుత్వ ట్రెజరీలో జమచేసి, ఆపై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పజెబుతామన్నారు. తిరుపతి నగరంలోని అన్ని బ్యాంకు శాఖల లావాదేవీలపై రోజూవారీ స్టేట్మెంట్ ఆర్ఓలకు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో సరి చూసుకోవాలన్నారు. ఓటు లేకుంటే మరో 3రోజుల్లోపు ఓటును నమోదు చేసుకునే సౌకర్యాన్ని ఈసీ కల్పించిందన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటింగ్ జరిగేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో తిరుపతి అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు, ఈడీటీ విజయభాస్కర్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. -
ఎన్నికలు.. ఎన్నో విశేషాలు..
సాక్షి, ఆలేరు : భారత ఎన్నికల సంఘం కాలక్రమేణ ఎన్నో సంస్కరణలు చేపట్టింది. ఎన్నికల సంఘం స్వంతంత్ర రాజ్యంగ వ్యవస్థ. నిర్ణయాలు స్వతంద్రంగా తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే సమయంలో సుమారు 50లక్షల మంది ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోందని ఓ అంచనా. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘చిని’లో నిర్వహించారు దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17.30కోట్లు అని నివేదికలు తెలుపుతున్నాయి 1993లో జరిగిన 13వ సాధారణ ఎన్నికల్లో మొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించారు. గతంలో ఓటు హక్కుకు కనీస వయస్సు 21 సంవత్సరాలు కాగా 61వ రాజ్యాంగ సవరణలో18 సంవత్సరాలకు కుదించారు ఎన్నికల నిర్వహణలో సమూల సంస్కరణలు ప్రవేశపెట్టిన సమర్థుడిగా పదో ఎన్నికల సంఘం కమిషనర్‌గా టీఎన్ శేషన్ గుర్తింపు పొందారు. 1952లో 55పార్టీలు ఎన్నికల్లో పాల్గొనగా 2014 నాటికి ఆ సంఖ్య 370కి చేరింది. దేశంలో ఎంపీలుగా గెలిచిన వారిలో 30శాతం మందిపై పలు కేసులు నమోదయ్యాయని బీబీసీ నివేదిక పేర్కొంది. -
ఓటుకు ఎన్నారైలు నో
న్యూఢిల్లీ: స్వదేశంలో ఓటరుగా పేరు నమోదు చేయించుకునేందుకు ఎన్నారైలు అంతగా ఆసక్తి చూపడం లేదు. 2010లో కేంద్రం చేసిన చట్ట సవరణ తర్వాత 3.12 కోట్ల మంది ప్రవాస భారతీయుల్లో ఓటరుగా నమోదు చేయించుకున్న వారు 24,507 మందే. ఇది మొత్తం ఎన్నారైలలో 0.1 శాతమే. అయితే, విదేశాల్లోని కేరళీయుల్లో 96శాతం మంది ఓటు హక్కు కోసం పేరు నమోదు చేసుకోవడం విశేషం. ఆన్లైన్లో పేరు నమోదు స్వదేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించాలన్న ఎన్నారైల విజ్ఞప్తులకు స్పందించిన కేంద్రం 2010లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి పలు సవరణలు చేసింది. దీంతో ఎన్నారైలు ఇక్కడ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఇలాంటి అర్హతలున్న ఎన్నారైలు తాము పుట్టిన ప్రాంతంలో ఓటు హక్కు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాతీయ ఓటర్ల సేవా పోర్టల్(ఎన్వీఎస్పీ) ద్వారా ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం తాము ఉంటున్న దేశం వీసా, పాస్‌పోర్టు వివరాలివ్వాలి. కేరళీయులు అత్యధికం 2012లో ఎన్నారై ఓటర్ల సంఖ్య 10,002 కాగా 2018 నాటికి 24,507కు చేరుకుంది. వీరిలో మహిళలు 1,942 మంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య 3.12 కోట్లు. 2012 లెక్కల ప్రకారం మొత్తం 10,002 మంది ఎన్నారైలు పేర్లు రిజిస్టర్ చేయించుకోగా అందులో 9,838 మంది కేరళీయులే. మొత్తం ఎన్నారై ఓటర్లలో కేరళీయుల శాతం 96గా ఉంది. వందమంది కంటే ఎక్కువగా పేర్లు నమోదు చేయించుకున్న రాష్ట్రాల్లో కేరళ తర్వాత పంజాబ్, పుదుచ్చేరి ఉన్నాయి. ఎన్నారై ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ప్రస్తుత విధానాలు అనుకూలంగా లేవు. ఎన్నారైల్లో ఓటుహక్కు వినియోగం పెరిగేందుకు ప్రాక్సీ విధానం అనుసరించడమే మేలని ఈసీ కమిటీ తేల్చింది. -
రేపటి నుంచి ప్రత్యేక ఓటరు నమోదు
– 18 ఏళ్లు నిండిన వారందరికీ అవకాశం – జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో జూలై 1 నుంచి 31వ తేదీ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,541 పోలింగ్‌కేంద్రాలకు బీఎల్ఓలను నియమించారు. వీరి దగ్గర అసవరమైన దరఖాస్తులు ఉంటాయి. జిల్లాలో 18– 21 ఏళ్ల యువత 1.98 లక్షల మంది ఉంది. ఇందులో 1.5 శాతం మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారు. మిగతా వారందరూ ఓటర్లుగా నమోదు కావాల్సి ఉంది. అన్ని రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకొని ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కోరారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 18–21 ఏళ్ల యువత, వికలాంగులు, సర్వీస్ మెన్, ప్రవాస భారతీయులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రాధానన్యం ఇస్తారు. ప్రతి నియోజకవర్గానికి డిప్యూటీ కలెక్టర్లను ఓటరు నమోదు అధికారి (ఈఆర్ఓ)గా నియమించారు. ఏ దరఖాస్తు ఎందుకు... ఫారం–6: ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఫారం–6ఎ: విదేశాల్లో నివాసం ఉంటూ విదేశీ పౌరసత్వం పొందని భారతీయ పౌరులు వారి నివాస ప్రాంతాల్లో ఓటరుగా నమోదు అయ్యేందుకు ఫారం–7: జాబితాలో ఉన్న పేరుపై అభ్యంతరం తెలుపుతూ... తొలగించాలని కోరేందుకు ఫారం–8: జాబితాలో ఉన్న వివరాలు, పేరు, చిరునామా, వయస్సు, తదితర వాటిని సవరించుకునేందకు ఫారం–8ఎ: నియోజకవర్గం పరిధిలో ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరోపోలింగ్ కేంద్రానికి మారడానికి ఓటరుగా నమోదు అయ్యేందుకు ఈ–రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంది. నేరుగా ceoandhra.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత బీఎల్ఓలకు ఇవ్వవచ్చు. జూలై 9, జూలై 23 తేదీలను ప్రత్యేక ఓటరు నమోదు దినాలుగా ప్రకటించారు. -
ఓటరు నమోదుపై అసంతృప్తి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటరు నమోదు కార్యక్రమంపై ఆయన కలెక్టర్లతో శని వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఓటరు నమోదుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూరు శాతం ఫొటోతో కూడిన ఓటరు జాబితా తో పాటు, అర్హులైన వారందరికీ ఓటు ఇవ్వాలన్న లక్ష్యాన్ని నీరుగార్చవద్దని ఆయన సూచించారు. ఓటరు నమోదు గడువు ఈ నెల 17 వరకు పొడిగించి నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రదానంగా పోలింగ్ బూత్‌ల వద్ద బీఎల్ఓల నంబర్లు సక్రమంగా అందు బాటులో ఉండడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఫోన్ నంబర్లు పని చేసినవి మాత్రమే అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. ఇం టింటి సర్వే చేసినప్పుడే డబుల్ ఎంట్రీ లు, మరణించిన వారి ఓటర్ల పేర్లను తొలగించాలని సూచిస్తున్నా సక్రమంగా జరగడం లేదన్నారు. బీఎల్ఓలు, ఎన్యుమరేషన్ అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయూలని ఆదేశించారు. ఓటరు నమోదుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలపై పూర్తి స్థారుులో అవగాహన కల్పిం చాలని సూచించారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఆయూ కేటగిరీల్లోని వయస్సు గల వారు నమోదు కావాలన్నారు. జిల్లా లో యువ ఓటర్లు నమోదు అంతంతమాత్రంగానే ఉండడంపై సీఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో అలక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. జిల్లాకు అసోం, కొల్కత్తా నుంచి ఈవీఎంలు వస్తాయని చెప్పారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. యువ ఓటర్ల నమోదు పెరిగేందు కు కళాశాలలతో పాటు అన్ని ప్రదాన కేంద్రాల్లో డ్రాప్‌బాక్స్‌లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు నియోజకవర్గానికో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించడం జరిగిందన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీలో ఇంటి నంబ ర్లు సక్రమంగా వేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ సైనీ, డీఆర్ఓ బి.హేమసుందర వెంకటరావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, ఆర్డీఓ జె.వెంకటరావుతో పాటు ఎస్డీసీలు, తహశీల్దార్లు, ఎన్నికల డీటీలు పాల్గొన్నారు. 17వరకు ఓటరు నమోదు ఓటరు నమోదు కార్యక్రమం ఈ నెల 17వరకు కొనసాగుతుందని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఈ నెల 8, 15 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు, సిబ్బంది ఓటరు నమోదు ఫారాలతో సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ఓటర్లు సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.