voters final list
-
జనవరి 15న ఓటర్ల తుది జాబితా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను జనవరి 15న ప్రచురిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కె.విజయానంద్ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన మూసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు డిసెంబర్ 15లోగా తెలియజేయాలని రాజకీయ పార్టీలను కోరారు. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో రాజకీయ పార్టీలతో శుక్రవారం ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. విజయానంద్ మాట్లాడుతూ, నూతన ఓటర్ల నమోదుకు కూడా సహకరించాలన్నారు. 1,500 మంది ఓటర్లతో కూడిన పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ.. ఈనెల 16న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,00,79,025 మంది ఓటర్లుగా నమోదైనట్లు తెలిపారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు జనవరి 5లోగా పరిష్కారం చూపుతామన్నారు. ఈ నెల 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం ముఖ్యమని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు రాష్ట్రంలో కొత్తగా 80 లక్షల మంది ఓటర్లకు ఫొటో ఐడెంటిటీ కార్డులు జారీ చేసినట్లు విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 740 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటర్ల నివాసానికి రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజనులకు కూడా అందుబాటులో ఉండేలా పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. రేషనలైజేషన్ తర్వాత రాష్ట్రంలో 45,917 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు సహకరించండి మార్చిలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కోసం ఎన్నికలు జరగనున్నాయని, ఓటర్ల నమోదుకు సహకరించాలని పార్టీలను విజయానంద్ కోరారు. ప్రస్తుతం 30 వేల మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. డిసెంబర్ 31లోగా రాష్ట్రంలో అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. -
రాష్ట్రంలో ఓటర్లు 4,00,02,782
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) తర్వాత ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ శుక్రవారం విడుదల చేశారు. దీని ప్రకారం.. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 6,57,065 పెరిగింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,45,717 నుంచి 4,00,02,782కు చేరుకుంది. కొత్తగా పెరిగిన ఓటర్లలో పురుష ఓటర్ల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పురుష ఓటర్ల సంఖ్య 1,94,62,339 నుంచి 1,97,90,730కు చేరగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,98,79,421 నుంచి 2,02,07,984కు చేరుకుంది. థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 111 పెరిగి, మొత్తం 4,068గా నమోదైంది. సవరణ తర్వాత పురుష ఓటర్ల కంటే 4,17,254 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం 13 జిల్లాల్లో శ్రీకాకుళం, అనంతపురం మినహాయిస్తే మిగిలిన 11 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 65,388 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. తగ్గిన పోలింగ్ స్టేషన్ల సంఖ్య ఓటర్ల సంఖ్య పెరిగినా రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య తగ్గడం గమనార్హం. ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్ స్టేషన్ ఉండే విధంగా కసరత్తు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా 437 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 521 పోలింగ్ స్టేషన్లను విలీనం చేసింది. దీంతో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 45,920 నుంచి 45,836కు తగ్గింది. ఎస్‌ఎస్‌ఆర్‌లో భాగంగా 2019 డిసెంబర్ 23వ తేదీన 3,98,34,776 ఓటర్లతో జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలను కోరింది. 1,63,030 ఓటర్లను చేర్చాలని, 60,412 ఓటర్లను తొలగించాలని అభ్యర్థనలు వచ్చినట్లు విజయానంద్ తెలిపారు. నికరంగా 1,02,618 ఓటర్లను జత చేసి, ఓటర్ల తుది జాబితాను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్ ఫొటో గుర్తింపు కార్డులను ఓటర్లకు వారి ఇంటి వద్దనే అందించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. -
వార్డుల విభజన సక్రమంగా జరగలేదు
సాక్షి, చీమకుర్తి: నగర పంచాయతీలో వార్డుల విభజన సక్రమంగా జరగలేదని వైఎస్సార్ సీపీ నాయకులు శుక్రవారం కమిషనర్ చంద్రశేఖరరెడ్డికి వినతిపత్రం అందించారు. ఇటీవల ఓటర్ల సవరణ, వార్డుల విభజన అనంతరం పబ్లిష్ చేసిన ఓటర్ల లిస్ట్‌లో వార్డుల విభజన హేతుబద్దంగా లేదని గుర్తించినట్లు వైఎస్సార్సీపీ గిరిజన విభాగం పార్లమెంట్ కన్వీనర్ పేరం శ్రీనివాసరావు, చేనేత సొసైటీ అధ్యక్షులు దొంతు సుబ్బారావు, రాష్ట్ర నాయకులు చింతకింది అశోక్, కోటా రాములు, టీ.బాబూరావు, బొంతా వెంకటేశ్వర్లు, పేరం హనుమంతురావు, ఏడుకొండలు, మురళి కమిషనర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. 7వ వార్డు నుంచి 12వ వార్డు వరకు వార్డుల విభజన క్రమ పద్ధతిలో లేవని, ఒకే ప్రాంతంలోనున్న గిరిజన ఓట్లను ఐదు వార్డులలోకి విభజించి వేశారని తమ వినతిపత్రంలో తెలిపారు. అధికారులు స్పందించి వార్డుల విభజనను మళ్లీ చేయాలని విజ్ఞప్తి చేశారు. -
పంచాయతీ ఓటర్ల జాబితాలను సిద్ధం చేయండి
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసిపోయిన దృ ష్ట్యా పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికల ను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో స రికొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడానికి అ ధికారులు శ్రీకారం చుట్టారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి రెండో వారంలోగా పంచాయతీల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయితే ముందస్తు శాసనసభ ఎన్నికలు, ఫలితాలు ము గిసిన తరువాత పంచాయతీల ఎన్నికల షెడ్యూ ల్ వెలువడే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించేనాటికి పంచాయతీ ల వారిగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి ఉద్యోగులకు నిర్దేశించారు. గతంలోనే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారిగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. అయితే ముందస్తు ఎన్నికల నేప థ్యంలో ఓటు హక్కుకు అర్హత ఉన్నవారు దర ఖాస్తు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ అవ కాశం కల్పించింది. దీంతో అనేకమంది ఓటర్ల జాబితాల్లో స్థానం దక్కించుకున్నారు. ఆయా శా సనసభ స్థానాల్లో కొత్త ఓటర్ల సంఖ్య పెరగడం తో కొత్త వారికి పంచాయతీ ఎన్నికల్లోను ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘం ని ర్ణయించింది. అలాగే వార్డుల ప్రకారం జాబితాలను సిద్ధం చేసి కులాల గణను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్త ఓటర్ల జాబితాలను ఈనెల 25వ తేది వరకు సిద్ధం చే యాలని పంచాయతీ ఉన్నతాధికారులు రెండు రోజుల కింద ఆదేశించారు. నిజామాబాద్ జి ల్లాలో 530 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జి ల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జా బితాల్లో చేర్చిన ఓటర్లు ఏ వార్డులకు సంబంధించిన వారో కూడా విభజించాల్సి ఉంటుంది. గ తంలో ఓటర్ల జాబితాలను ముద్రించిన దృష్ట్యా కొత్తగా చేర్చే ఓటర్లను జాబితాల్లో రాతపూర్వకంగానే రాసి సిద్ధం చేయాలని పంచాయతీ అధికారులు సూచించారు. శాసనసభ ఎన్నికల కోసం కొత్తగా ముద్రించిన ఓటర్ల జాబితాలను పంచాయతీల కార్యదర్శులు సేకరించి కొత్తగా చేరిన వారు ఏ వార్డుకు చెందిన వారు అని గుర్తించాల్సి ఉంది. అలాగే కు లాల గణనను కూడా పూర్తి చే యాల్సి ఉంది. ఓ టర్ల జాబితాల్లో మార్పులు చే ర్పులతో పాటు కు లాల వారిగా ఓటర్ల గణన కోసం కొన్ని రోజుల గడువు పెంచాలని కార్యదర్శులు కోరుతున్నారు. -
17న ఓటర్ల తుది జాబితా ప్రచురణ
సాక్షి, హైదరాబాద్: భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల సవరణ (ఫొటో ఎలక్టోరల్ రోల్స్)ల తో కూడిన తుది జాబితా ప్రచురణ తేదీని మార్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈనెల 16వ తేదీన దీనిని ప్రచురించాల్సి ఉంది. ఈ తేదీని మారుస్తూ 17వ తేదీన తుది జాబితాను ప్రచురించనున్నట్లు ఇన్చార్జ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనూప్‌సింగ్ ఒక ప్రకటలో తెలిపారు. -
ఓటు నమోదు.. పట్టని యువత
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఓటర్లుగా నమోదు కావడానికి యువత ఆసక్తి చూపడం లేదు. యువతను వంద శాతం ఓటర్లుగా నమోదు చేయించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. గత నెల 31న ప్రకటించిన ఓటర్ల తుది జాబితాను పరిశీలిస్తే యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు ఉత్సాహం చూపడం లేదని స్పష్టమవుతోంది. జిల్లాలో 18 ఏళ్ల పైబడిన వారు 27,11,140 మంది ఉన్నారు. ఇందులో 18, 19 ఏళ్ల మధ్య ఉండే యువత 1,55,010 మంది ఉన్నారు. వీరందరిని ఓటర్లుగా గుర్తించేందుకు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఓటర్లుగా నమోదు కానివారిలో అత్యధికంగా విద్యార్థులే ఉన్నట్లుగా గుర్తించిన అధికార యంత్రాంగం విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఓటర్లుగా నమోదయ్యేలా ప్రోత్సహించాలని కోరింది. కానీ 18, 19 ఏళ్లు యువత 71,756 మంది మాత్రమే ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. మొత్తంగా 18 ఏళ్ల పైబడిన వారు 27,11,140 మంది ఉంటే ఓటర్లు మాత్రం 29,64,172 మంది ఉన్నారు. అంటే జనాభా కంటే ఓటర్లు 2,53,032 మంది ఎక్కువగా ఉన్నారు. వీరందరినీ బోగస్ ఓటర్లుగా పరిగణిస్తారు. బోగస్ ఓటర్ల తొలగింపునకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల ముందు బోగస్ ఓటర్లను తొలగిస్తే కాంగ్రెస్ రాజకీయ పార్టీల నుంచి ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో అధికారులు బోగస్ ఓటర్ల జోలికి వెళ్లలేదనే ఆరోపణలున్నాయి. బోగస్ ఓటర్లకు నిదర్శనాలు: గోనెగండ్ల మండలం లింగందిన్నెలోని దాదాపు 10 కుటుంబాలు దశాబ్దాల క్రితం కోడుమూరుకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాయి. ఈ కుటుంబాలకు సంబంధించి లింగందిన్నె గ్రామంలో ఇప్పటికి 45 ఓట్లు ఉండటం విశేషం. గ్రామస్తులు ఫారం-7 ద్వారా పలుసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసివేయడం లేదు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన 200 మంది కర్నూలులోని మద్దూర్‌నగర్, లక్ష్మీనగర్‌లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లుగా ఉన్నారు. వీటిపైన ఫారం-7 దరఖాస్తులు ఇచ్చినా అధికారులు ఎన్నికల సమయంలో వీటిని తొలగిస్తే అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తొలగించ లేదు. ప్యాపిలి మండలం అలేబాదు గ్రామానికి చెందిన దాదాపు 15 కుటుంబాలు వివిధ ప్రాంతాలకు కొన్నేళ్ల క్రితమే వలస వెళ్లాయి. ఈ కుటుంబాలకు చెందిన 65 మంది ఇప్పటి గ్రామంలో ఓటర్లుగా ఉన్నారు. వీటిని తొలగించేందుకు పలుసార్లు ఫారం-7 ద్వారా ఫిర్యాదులు చేసినా అధికార యంత్రాంగం స్పందించలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బోగస్ ఓటర్లపై అధికారులు దృష్టి పెట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనాభాతో పోలిస్తే ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి వయస్సు గ్రూపు ఓటర్లు జనాభా 18-19 71,756 15,570 20-29 9,23,996 7,97,301 30-39 7,78,433 6,33,913 40-49 5,49,112 4,66,014 50-59 3,47,071 2,95,414 60-69 1,96,078 2,55,332 70-79 79,468 85,323 80 ప్లస్ 18,438 52,833 మొత్తం 29,64,352 26,01700 -
ఓటర్ల తుది జాబితా ప్రకటన నేడు
కూడికలు తీసివేతల్లో పార్టీలు ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఓటర్ల తుది జాబితాను శుక్రవారం జిల్లా యంత్రాంగం ప్రకటించనుంది. గత ఏడాది నవంబర్ 19వ తేదీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించింది. అదే సమయంలో 2014 జనవరి 1నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితాలో జిల్లాలో 23 లక్షల 15 వేల 407 మంది ఓటర్లుగా తేలారు. జనవరి 16వ తేదీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ముందుగానే ప్రకటించారు. అందుకోసం నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని 2751 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 24వ తేదీ జిల్లాలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 23 లక్షల 15 వేల 407 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. గత జాబితాతో పోల్చుకుంటే కొత్తగా 2 లక్షల 7 వేల 19మంది ఓటర్లుగా చేరారు. అదే సమయంలో 73,121 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలను కలవరపాటుకు గురిచేసింది. శుక్రవారం ప్రకటించనున్న ఓటర్ల తుది జాబితాపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నియోజకవర్గాల వారీగా ఎంతమంది కొత్తగా ఓటు హక్కు పొందారు, ఎంతమంది ఓటు హక్కును కోల్పోయారన్న లెక్కలు వేసుకుంటున్నారు. తాజాగా ప్రకటించనున్న ఓటర్ల జాబితాను ఆధారం చేసుకొని త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ప్రాధాన్యతను సంతరించుకొంది.