వినతిపత్రం అందిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
సాక్షి, చీమకుర్తి: నగర పంచాయతీలో వార్డుల విభజన సక్రమంగా జరగలేదని వైఎస్సార్ సీపీ నాయకులు శుక్రవారం కమిషనర్ చంద్రశేఖరరెడ్డికి వినతిపత్రం అందించారు. ఇటీవల ఓటర్ల సవరణ, వార్డుల విభజన అనంతరం పబ్లిష్ చేసిన ఓటర్ల లిస్ట్‌లో వార్డుల విభజన హేతుబద్దంగా లేదని గుర్తించినట్లు వైఎస్సార్‌సీపీ గిరిజన విభాగం పార్లమెంట్ కన్వీనర్ పేరం శ్రీనివాసరావు, చేనేత సొసైటీ అధ్యక్షులు దొంతు సుబ్బారావు, రాష్ట్ర నాయకులు చింతకింది అశోక్, కోటా రాములు, టీ.బాబూరావు, బొంతా వెంకటేశ్వర్లు, పేరం హనుమంతురావు, ఏడుకొండలు, మురళి కమిషనర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. 7వ వార్డు నుంచి 12వ వార్డు వరకు వార్డుల విభజన క్రమ పద్ధతిలో లేవని, ఒకే ప్రాంతంలోనున్న గిరిజన ఓట్లను ఐదు వార్డులలోకి విభజించి వేశారని తమ వినతిపత్రంలో తెలిపారు. అధికారులు స్పందించి వార్డుల విభజనను మళ్లీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment