VP Sanu
-
ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా సాను
సాక్షి, హైదరాబాద్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడిగా వీపీ సాను, ప్రధాన కార్యదర్శిగా మయూక్ బిశ్వాస్ తిరిగి ఎన్నికయ్యారు. మొత్తం 83 మందితో కొత్త కమిటీ ఎన్నిక కాగా, వారిలో 19 మందితో కార్యదర్శి వర్గం (ఆఫీస్ బేరర్స్) ఎన్నికైంది. జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి నలుగురికి అవకాశం వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలు, శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేషనల్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఉపాధ్యక్షుడు, ప్రెసిడెంట్లుగా నితీశ్ నారాయణ్ (ఢిల్లీ సెంటర్), ప్రతికుర్ రహమన్ (బెంగాల్), తాళ్ల నాగరాజు (తెలంగాణ), అశోక్ (ఏపీ), అనుశ్రీ (కేరళ), సంగీతాదాస్ (అసోం), సహాయ కార్యదర్శులుగా దినిత్ డెంట, దీప్సితాధర్ (ఢిల్లీ సెంటర్), శ్రీజన్ భట్టాచర్య (బెంగాల్), పీఎం అశ్రో (కేరళ), సందీపన్ దాస్ (త్రిపుర), ఆదర్శ్ ఎం.సాజీ (సెంటర్) ఎన్నికయ్యారు. కార్యదర్శి వర్గ సభ్యులుగా నిరుబన్ చక్రవర్తి (తమిళనాడు), ఐషీఘోష్ (ఢిల్లీ), సుభాష్ జక్కర్ (రాజస్థాన్), అమత్ ఠాకూర్ (హిమాచల్‌ప్రదేశ్)ను ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి నాగరాజు, ఆర్.ఎల్.మూర్తి, ఎం.పూజ, మమత, శివదుర్గారావు (హెచ్‌సీయూ)లకు కమిటీలో చోటు లభించింది. (చదవండి: ఇప్పుడేం చేద్దాం? ఢిల్లీ వెళ్లాలా? లేఖ రాయాలా) -
మతోన్మాదంపై పోరాటం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం : దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో మతోన్మాద భావాలను పెంపొందిస్తుందని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్ పరివార్ ఎజెండాను వ్యతిరేకించిన వారిపై దాడులు చేస్తుందన్నారు. దేశంలో ప్రజాతంత్ర భావాలు, అభ్యుదయ వాదులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యూజీసీ నిబంధనల పేరుతో జేఎన్‌యూ తదితర విశ్వవిద్యాలయాల్లో కోర్సులను తగ్గించాలని చూస్తుందన్నారు. అచ్చే దిన్ అంటున్న మోదీ ఎవరికి మంచి రోజులు తెచ్చారో చెప్పాలన్నారు. కార్పొరేట్ శక్తులు పన్నులు ఎగవేసి దేశాలు దాటిపోతున్నా మాట్లాడని ప్రధాని, అన్నదాతలకు రుణమాఫి, ఉన్నత విద్యకు నిధులు కేటాయించడం లేదన్నారు. దేశంలో బీజేపీ విధానాలను ఎదుర్కోవాలంటే మాస్ పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. త్వరలో విద్యారంగ సమస్యలపై దేశవ్యాప్తంగా జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన రాష్ట్ర అధ్యక్షులుగా తిరుపతి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, అధ్యక్షులు ఎం. నాగేశ్వర్, సహాయ కార్యదర్శులు మహేష్, రవి, శ్రీధర్, హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావేద్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న విపి సాను -
ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలి
ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను ఘట్కేసర్ టౌన్: పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా వసతి గృహాల్లోని విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ ఉత్తర కమిటీ ఆధర్యంలో జూలై 24న సికింద్రాబాద్‌లో ప్రారంభమైన సైకిల్‌యాత్ర మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట్, కీసర మండలాల్లో మండలాల్లో కొనసాగి ఘట్కేసర్లో బుధవారం జరిగిన ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గృహాల్లోని విద్యార్థులకు రోజుకు ఒక్కంటికి రూ. 27 తో మూడు పూటలా భోజనం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. విద్యార్థులకు ప్రస్తుతమిస్తున్న కాస్మొటిక్ చారీ్జలను పెంచాలన్నారు. అద్దె భవనాలు, ఇన్చార్జి వార్డెన్లతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని, శాశ్వత వార్డెన్లను నియమించాలని, శాశ్వత భవనాలను నిర్మించాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అనుసరించి కేజీ - పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేశ్వర్, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ వారానికి ఒకసారి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని, ఘట్కేసర్లో మూసిన బీసీ విద్యార్థి వసతి గృహాన్ని తక్షణమే తెరిపించాలన్నారు. బంగారు తెలంగాణ అంటే విద్యారంగాన్ని కార్పొరేటుకు అప్పగించడమేనా అన్ని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని మేడ్చల్, ఘట్కేసర్ మండలాల్లో డిగ్రీ కళాశాలలను ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రీకాంత్, శేఖర్, ప్రశాంత్, గౌతం, లక్ష్మణ్, వెంకటేష్, నర్సింహ, రమేష్ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.