సుందరయ్య విజ్ఞాన కేంద్రం : దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో మతోన్మాద భావాలను పెంపొందిస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్ పరివార్ ఎజెండాను వ్యతిరేకించిన వారిపై దాడులు చేస్తుందన్నారు. దేశంలో ప్రజాతంత్ర భావాలు, అభ్యుదయ వాదులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యూజీసీ నిబంధనల పేరుతో జేఎన్‌యూ తదితర విశ్వవిద్యాలయాల్లో కోర్సులను తగ్గించాలని చూస్తుందన్నారు. అచ్చే దిన్ అంటున్న మోదీ ఎవరికి మంచి రోజులు తెచ్చారో చెప్పాలన్నారు.
కార్పొరేట్ శక్తులు పన్నులు ఎగవేసి దేశాలు దాటిపోతున్నా మాట్లాడని ప్రధాని, అన్నదాతలకు రుణమాఫి, ఉన్నత విద్యకు నిధులు కేటాయించడం లేదన్నారు. దేశంలో బీజేపీ విధానాలను ఎదుర్కోవాలంటే మాస్ పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. త్వరలో విద్యారంగ సమస్యలపై దేశవ్యాప్తంగా జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన రాష్ట్ర అధ్యక్షులుగా తిరుపతి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, అధ్యక్షులు ఎం. నాగేశ్వర్, సహాయ కార్యదర్శులు మహేష్, రవి, శ్రీధర్, హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌రెడ్డి, జావేద్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న విపి సాను
Comments
Please login to add a commentAdd a comment