VRO results
-
సాధించారు...
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆ ర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆ ర్ఏ) ఫలితాలు శనివారం విడుదలయ్యా యి. ఫిబ్రవరి 2న జరిగిన వీఆర్వో, వీఆర్ ఏ రాత పరీక్షలకు 50 వేలకుపైగా మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. జిల్లాలోని భైంసా మండల కేంద్రానికి చెందిన ఎన్.స్వరూప్‌రాజ్ వీఆర్వో పరీక్షలో 98 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సాధిం చారు. కాగా, మంచిర్యాల మండలంలోని సు బ్బపల్లి గ్రామానికి చెందిన పోలంపల్లి వెంకటేష్ 98 మార్కులతో జిల్లా రెండో ర్యాంకు సాధిం చారు. మందమర్రికి చెందిన ఓజ్జా రమేష్ 97 మార్కులో మూడో ర్యాంకు సాధించాడు. వీఆర్ ఏ ఫలితాల్లో నిర్మల్‌కు చెందిన ఎ.రవికిరణ్ 92 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సాధించా రు. రాష్ట్ర వ్యాప్తంగా 20 ర్యాంకులు సాధించిన వారిలో ఎన్.స్వరూప్‌రాజ్ ఏడో ర్యాంకు సాధిం చగా, వెంకటేష్ ఎనిమిదో ర్యాంకు సాధించారు. వీఆర్వో, వీఆర్ఏ ఫలితాలను www.adila-bad.nic.in వెబ్సైట్లో చూ సుకోవచ్చని కలెక్టరేట్ ఏవో సంజయ్‌కుమార్ తెలిపారు. కానిస్టేబుల్‌కు కొనసాగుతూనే.. భైంసా : వీఆర్వో ఫలితాల్లో భైంసాలోని కిసాన్‌గల్లీకి చెందిన నేరల్‌వార్ స్వరూప్‌రాజ్ (హాల్ టికెట్ నం. 119113410) వీఆర్వో పరీక్షల్లో వంద మార్కులకు 98 మార్కులు సాధించి జి ల్లా టాపర్‌గా, రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంకులో నిలిచాడు. ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో క్విక్ రియాక్షన్ టీంలో కానిస్టేబుల్‌గా వి ధులు నిర్వర్తిస్తున్న స్వరూప్ శనివారం భైంసా లో ఆక్రమణల తొలగింపు కోసం బందోబస్తు లో ఉండగానే ఈ వార్త విన్నాడు. దీంతో తోటి కానిస్టేబుళ్లతో, విధుల్లో ఉన్న ఎస్సైలతో ఆనం దం పంచుకున్నాడు. విషయం తెలియగానే పోలీసు అధికారుల అనుమతి తీసుకుని విధు ల్లో నుంచి ఇంటికి వెళ్లి అమ్మ శకుంతల, అన్న సందీప్‌తో ఆనందం పంచుకున్నాడు. ఎస్సై పరీక్షలు రాసి... స్వరూప్‌రాజ్ 2012లో కానిస్టేబుల్ పరీక్షలు రాశాడు. 2013లో విధుల్లో చేరాడు. చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి ఉన్న స్వరూప్‌రాజ్ శిక్షణలోనూ ప్రతిభ కనబరిచాడు. ఆదిలాబాద్‌లో ఆర్ఎస్సై పెద్దయ్య స్వరూప్‌రాజ్‌ను ప్రోత్సహించాడు. 2013లో ఎస్సై పరీక్షలు రాయగా.. ఆ ఫలితాలు రాకముందే వీఆర్వో పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు వీఆర్వో పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచి అందరి మన్ననలు పొందాడు. కష్టాలతోనే... స్వరూప్‌రాజ్ నిరుపేద కుటుంబంలో జన్మించా డు. రాంచందర్ శకుంతల దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సందీప్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లి ఇప్పటికీ తిరిగిరాలేదు. అప్పటి నుంచి తల్లి శకుంతలే ఇద్దరు కొడుకులను పోసిస్తోంది. వ్యవసాయ కూలీ పనిచేస్తూ కొడుకులను చదివించింది. భైంసాలో అనాథ పిల్లలకు వంట చేస్తూ వచ్చే డబ్బులు పిల్లల చదువులకు వెచ్చించేది. చిన్న కొడుకు స్వరూప్‌రాజ్ వీఆర్వో పరీక్షల్లో రాణించడంతో తన కష్టం తీరిపోయిందంటూ ఉత్సాహంగా కొడుకును ముద్దాడింది. పనిచేస్తూ చదువుకుంటూ... స్వరూప్‌రాజ్ సైతం కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు చదువుతూ మరోవైపు చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా కుటుంబ కష్టాల్లో పాలుపంచుకున్నాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు భైంసా ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ నిర్మల్‌లోని దీక్షా కళాశాలలో, డిగ్రీ హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్‌లో పూర్తిచేశాడు. ఇంటర్‌లోనూ రాష్ట్రంలో ఏడో ర్యాంకు సాధించాడు. 2002-04 వరకు భైం సాలో చదువుతున్న సమయంలో ఎస్టీడీ బూ త్లో పనిచేశాడు. బడికి సెలవు ఇచ్చాక రాత్రి సమయంలో ఎస్టీడీలో పనిచేస్తూ ప్రతినెలా వచ్చే రూ.250 ఇంట్లో ఇచ్చేవాడు. 2004-05లో పదో తరగతికి చేరుకోగానే ఖర్చులు కాస్త పెరిగాయి. కళ్ల ముందు తల్లి కష్టాలు చూడలేక భైంసాలోని ఓ బార్లో పనికి కుదిరాడు. రాత్రి సమయంలో బార్లో పనిచేస్తే ప్రతినెలా రూ.800 ఇచ్చేవారు. అవే డబ్బులతో పదో తరగతి పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఏ కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండా ఇంట్లో తల్లి శకుంతల, అన్న సందీప్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగాడు. కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాక ఆర్ఎస్సై పెద్దయ్య ప్రోత్సాహం తోడవడంతో వీఆర్వో పరీక్షల్లోనూ జిల్లా టాపర్‌గా నిలిచాడు. ‘చిన్నప్పటి నుంచి అమ్మ శకుంతల ఎంతో కష్టపడి అన్నయ్యను, నన్ను చదివించింది. కూలీ పని చేసి మమ్మల్ని ఈ స్థా యికి తీసుకువచ్చింది. గ్రూప్ 1 సాధించడమే నా లక్ష్యం. కానిస్టేబుల్ విధులను వదిలేస్తా. వీఆర్వోగా విధులు నిర్వహిస్తూ గ్రూప్1కు సిద్ధమవుతానని’ స్వరూప్‌రాజ్ చెప్పాడు. పేద కుటుంబం నుంచి వీఆర్వో స్థాయికి.. మందమర్రి : వీఆర్వో ఫలితాల్లో మందమర్రి పట్టణానికి చెందిన ఓజ్జా రమేష్ (హాల్‌టికెట్ నం.119114039) జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. వంద మార్కులకు గాను 97 మార్కులు పొందాడు. రమేష్ తల్లిదండ్రులు గట్టయ్య, గట్టమ్మ. తండ్రి ఏడేళ్ల క్రితం సింగరేణిలో పదవి విరమణ పొందాడు. రమేష్ పదో తరగతి స్థానిక విజ్ఞాన్ పాఠశాలలో, ఇంటర్ సరస్వతి కళాశాలలో చదివి, ఇందిర గాంధీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రి పూర్తి చేశాడు. గ్రూప్‌కు సెలెక్ట్ కావడమే తన లక్ష్యమని, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ ర్యాంకు సాధ్యమైందని ఈ సందర్భంగా రమేష్ చెప్పాడు. -
వీఆర్వో టాపర్ సతీష్
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఈ ఫలితాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. వీఆర్వో విభాగంలో మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన కోటగిరి సతీష్ (హాల్‌టికెట్ నంబర్ 122129713) 97 మార్కులతో జిల్లాస్థాయిలో ప్రథముడిగా నిలిచారు. వీఆర్ఏ కేటగిరీలో కూసుమంచి మండల కేంద్రానికి చెందిన కొమ్ము బాబూరావు (హాల్‌టికెట్ నం. 222100093) 93 మార్కులతో ప్రథమస్థానం పొందారు. చర్ల మండలం ఆర్.కొత్తగూడెంకు చెందిన తిప్పనబోయిన విష్ణునారాయణ వీఆర్వో విభాగంలో రెండో ర్యాంకు, తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన సౌజన్య మూడో ర్యాంకు, బయ్యారం మండలం కొత్తపేట వాసి పాతూరి సందీప్ నాల్గో ర్యాంకు, తల్లాడ మండలం నారాయణపురానికే చెందిన మరో అభ్యర్థి వి. అంకిరెడ్డి ఐదోర్యాంకు సాధిం చారు. తీవ్ర పోటీ నెలకొన్ని వీఆర్వో కేటగిరీలో తొలి 20 ర్యాంకులు సాధించిన వారిలో అత్యధికులు బీసీ-డీ కేటగిరీకి చెందిన వారే ఉన్నారు. టాప్‌లో 20లో బీసీ-డీకి చెందినవారు ఎనిమిది మంది ఉండటం గమనార్హం. వీఆర్ఏ కేటగిరీ లో కూసుమంచికి చెందిన బాబూరావు ప్రథమస్థానంలో నిలిచారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాస్థాయి ర్యాంకులు ఉండవని, గ్రా మాలు యూనిట్‌గా తీసుకుని మెరిట్ లిస్టును ప్రకటిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. తుదిజాబితా కోసం కసరత్తు.. జిల్లా కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ శనివారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో వీఆర్వో, వీఆర్ఏ ఫలితాల సీడీని ఆవిష్కరించారు. వీటి ఆధారంగా ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులు త్వరలో ఉద్యోగ నియామకపత్రాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆది లేదా సోమవారం ఉద్యోగాాలు పొందినవారి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయి. మైదాన, షెడ్యూల్ ఏరియాలో వేర్వేరుగా... ఈ నెల 2న నిర్వహించిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 73,260 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 65,480 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 78 వీఆర్వో పోస్టులకు 62,752 మంది హాజరయ్యారు. 105 వీఆర్ఏ పొఓస్టులకు 2,752 మంది హాజరయ్యారు. అర్హత సాధించిన అభ్యర్థుల వీఆర్వో ఉద్యోగాలకు మైదానప్రాంతంలో ఒక్కో పోస్టుకు ఒకరి చొప్పున (1:1), షెడ్యూల్ ఏరి యాలో 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు. వీఆర్ఏ ఉద్యోగాలకు 1:5 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను తయారు చేస్తారు. పనిచేయని సర్వర్లు.. జిల్లాలో ఇంటర్నెట్ సర్వర్లు పనిచేయకపోవడంతో వీఆర్వో, వీఆర్ఏ ఫలితాలు తెలుసుకోవడం కోసం అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో అత్యధిక మార్కుల జాబితాను తెలుసుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరకు త్రీజీ సెల్‌ఫోన్స్ సహాయంతో జాబితాను తెలుసుకోవాల్సి వచ్చింది. -
హిప్ హిప్ హుర్రే
వీఆర్ఓ, వీఆర్ఏ ఫలితాలు విడుదల కలెక్టరేట్, న్యూస్‌లైన్: నౌకరీ వచ్చిందో రాలేదో అభ్యర్థులందరిలో ఒకటే టెన్షన్. ఒక్కో వీఆర్ఓ పోస్టు కోసం 527 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, ఒక్కో వీఆర్ఏ పోస్టు కోసం 13 మంది పోటీలో ఉన్నారు. ఇంత గట్టిపోటీ మధ్య జరిగిన వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్ష ఫలితాలు వెల్లడి కావడంతో అభ్యర్థులు ఉత్కంఠకు గురయ్యారు. నసీబ్‌లో సర్కారీ నౌకరీ ఉందో లేదో తెల్సుకోడానికి ఇంటర్నెట్ సెంటర్ల ముందు క్యూకట్టారు. అనుకున్న మార్కులు దక్కి ఉద్యోగం పొందే అవకాశం ఉన్న అభ్యర్థులు ఆనందపు డోలికల్లో మునిగిపోయారు. ఈ ‘సారీ’ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయిన అభ్యర్థులు ఎప్పటిలాగే నిరుత్సాహానికి గురయ్యారు. ‘బిజిలీ’ చమ్కీ వీఆర్ఓ పరీక్ష ఫలితాల్లో రేగోడ్‌కు చెందిన బిజిలీపురం ఆ దర్శ కుమార్ 98 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. ఇక వీఆర్ఓ పరీక్ష ఫలితాల్లో నారాయణఖేడ్‌కు చెందిన జన్వాడ అజయ్‌కుమార్ 88 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. అయితే, అజయ్‌కుమార్ వీఆర్ఓ పరీక్షలోనూ 92 మార్కులు సాధించడంతో ఆయనకువీఆర్ఓ కొలువు దక్కే అవకాశముంది. వీఆర్ఓ పరీక్ష ఫలితాల్లో సదాశివపేట మండలం నిజాంపూర్‌కు చెందిన రాఘవేందర్గౌడ్కు 91 మార్కులు దక్కించుకున్నారు. తమ పేర్లకు తగ్గ ట్టు రెండు విభాగాల్లో టాపర్లుగా నిలిచి వీళ్లిద్దరూ సార్థక నా మధేయులు అనిపించుకున్నారు. బిజిలీపురం ఆదర్శ్ కుమార్ వీఆర్ఓ టాపర్‌గా నిలిచి బిజిలీ(మెరుపు)లా మెరిసీ ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. అజయ్ కుమార్ వీఆర్ఏలో జిల్లా టాపర్‌గా నిలవడమే కాకుండా వీఆర్ఓలో సైతం సత్తా చాటి అజేయుడనిపించుకున్నాడు. నా టార్గెట్ ఐఏఎస్ నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చది వించారు. వీఆర్ఓ ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. నా టార్గెట్ మాత్రం ఐఏఎస్. కలెక్టర్‌గా పేదలకు సేవలందిస్తూ నా తల్లిదండ్రులు, నా ప్రాంతానికి మంచి పేరుతేవాలని ఉంది. ఆ దిశగానే ముందుకు సాగుతున్నా. - ఆదర్శ్, వీఆర్ఓ జిల్లా టాపర్ ఉన్నత ఉద్యోగమే లక్ష్యం వీఆర్ఏ ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. వీఆర్ఓ ఫలితాల్లో కూడా 92 మార్కులు వచ్చాయి. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన ప్రస్తుతం గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఎప్పటికైనా ఉన్నత ఉద్యోగం పొందడమే నా లక్ష్యం. ఇది చిన్న మజిలీ మాత్రమే. కల్హేర్ మండలం ముబారక్‌పూర్‌లోని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి నేను మరింతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నా. -అజయ్‌కుమార్, వీఆర్ఏ జిల్లా టాపర్