సాధించారు... | VRO,VRA results released | Sakshi
Sakshi News home page

సాధించారు...

Published Sun, Feb 23 2014 2:48 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

VRO,VRA results released

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆ ర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆ ర్‌ఏ) ఫలితాలు శనివారం విడుదలయ్యా యి. ఫిబ్రవరి 2న జరిగిన  వీఆర్వో, వీఆర్ ఏ రాత పరీక్షలకు 50 వేలకుపైగా మంది అభ్యర్థులు హాజరైన విషయం  తెలిసిందే. జిల్లాలోని భైంసా మండల కేంద్రానికి చెందిన ఎన్.స్వరూప్‌రాజ్ వీఆర్వో పరీక్షలో 98 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సాధిం చారు. కాగా, మంచిర్యాల మండలంలోని సు బ్బపల్లి గ్రామానికి చెందిన పోలంపల్లి వెంకటేష్ 98 మార్కులతో జిల్లా రెండో ర్యాంకు సాధిం చారు. మందమర్రికి చెందిన ఓజ్జా రమేష్ 97 మార్కులో మూడో ర్యాంకు సాధించాడు. వీఆర్ ఏ ఫలితాల్లో నిర్మల్‌కు చెందిన ఎ.రవికిరణ్ 92 మార్కులతో జిల్లా మొదటి ర్యాంకు సాధించా రు. రాష్ట్ర వ్యాప్తంగా 20 ర్యాంకులు సాధించిన వారిలో ఎన్.స్వరూప్‌రాజ్ ఏడో ర్యాంకు సాధిం చగా, వెంకటేష్ ఎనిమిదో ర్యాంకు సాధించారు. వీఆర్వో, వీఆర్‌ఏ ఫలితాలను www.adila-bad.nic.in వెబ్‌సైట్‌లో చూ సుకోవచ్చని కలెక్టరేట్ ఏవో సంజయ్‌కుమార్ తెలిపారు.
 
 కానిస్టేబుల్‌కు కొనసాగుతూనే..
 
 భైంసా : వీఆర్వో ఫలితాల్లో భైంసాలోని కిసాన్‌గల్లీకి చెందిన నేరల్‌వార్ స్వరూప్‌రాజ్ (హాల్ టికెట్ నం. 119113410) వీఆర్‌వో పరీక్షల్లో వంద మార్కులకు 98 మార్కులు సాధించి జి ల్లా టాపర్‌గా, రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంకులో నిలిచాడు. ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో క్విక్ రియాక్షన్ టీంలో కానిస్టేబుల్‌గా వి ధులు నిర్వర్తిస్తున్న స్వరూప్ శనివారం భైంసా లో ఆక్రమణల తొలగింపు కోసం బందోబస్తు లో ఉండగానే ఈ వార్త విన్నాడు. దీంతో తోటి కానిస్టేబుళ్లతో, విధుల్లో ఉన్న ఎస్సైలతో ఆనం దం పంచుకున్నాడు. విషయం తెలియగానే పోలీసు అధికారుల అనుమతి తీసుకుని విధు ల్లో నుంచి ఇంటికి వెళ్లి అమ్మ శకుంతల, అన్న సందీప్‌తో ఆనందం పంచుకున్నాడు.
 
 ఎస్సై పరీక్షలు రాసి...
 
 స్వరూప్‌రాజ్ 2012లో కానిస్టేబుల్ పరీక్షలు రాశాడు. 2013లో విధుల్లో చేరాడు. చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి ఉన్న స్వరూప్‌రాజ్ శిక్షణలోనూ ప్రతిభ కనబరిచాడు. ఆదిలాబాద్‌లో ఆర్‌ఎస్సై పెద్దయ్య స్వరూప్‌రాజ్‌ను ప్రోత్సహించాడు. 2013లో ఎస్సై పరీక్షలు రాయగా.. ఆ ఫలితాలు రాకముందే వీఆర్వో పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు వీఆర్వో పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచి అందరి మన్ననలు పొందాడు.
 
 కష్టాలతోనే...
 
 స్వరూప్‌రాజ్ నిరుపేద కుటుంబంలో జన్మించా డు. రాంచందర్ శకుంతల దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సందీప్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లి ఇప్పటికీ తిరిగిరాలేదు. అప్పటి నుంచి తల్లి శకుంతలే ఇద్దరు కొడుకులను పోసిస్తోంది. వ్యవసాయ కూలీ పనిచేస్తూ కొడుకులను చదివించింది. భైంసాలో అనాథ పిల్లలకు వంట చేస్తూ వచ్చే డబ్బులు పిల్లల చదువులకు వెచ్చించేది. చిన్న కొడుకు స్వరూప్‌రాజ్ వీఆర్వో పరీక్షల్లో రాణించడంతో తన కష్టం తీరిపోయిందంటూ ఉత్సాహంగా కొడుకును ముద్దాడింది.
 
 పనిచేస్తూ చదువుకుంటూ...
 
 స్వరూప్‌రాజ్ సైతం కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు చదువుతూ మరోవైపు చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా కుటుంబ కష్టాల్లో పాలుపంచుకున్నాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు భైంసా ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ నిర్మల్‌లోని దీక్షా కళాశాలలో, డిగ్రీ హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్‌లో పూర్తిచేశాడు. ఇంటర్‌లోనూ రాష్ట్రంలో ఏడో ర్యాంకు సాధించాడు. 2002-04 వరకు భైం సాలో చదువుతున్న సమయంలో ఎస్‌టీడీ బూ త్‌లో పనిచేశాడు. బడికి సెలవు ఇచ్చాక రాత్రి సమయంలో ఎస్‌టీడీలో పనిచేస్తూ ప్రతినెలా వచ్చే రూ.250 ఇంట్లో ఇచ్చేవాడు. 2004-05లో పదో తరగతికి చేరుకోగానే ఖర్చులు కాస్త పెరిగాయి. కళ్ల ముందు తల్లి కష్టాలు చూడలేక భైంసాలోని ఓ బార్‌లో పనికి కుదిరాడు. రాత్రి సమయంలో బార్‌లో పనిచేస్తే ప్రతినెలా రూ.800 ఇచ్చేవారు. అవే డబ్బులతో పదో తరగతి పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి ఏ కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండా ఇంట్లో తల్లి శకుంతల, అన్న సందీప్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగాడు. కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాక ఆర్‌ఎస్సై పెద్దయ్య ప్రోత్సాహం తోడవడంతో వీఆర్వో పరీక్షల్లోనూ జిల్లా టాపర్‌గా నిలిచాడు. ‘చిన్నప్పటి నుంచి అమ్మ శకుంతల ఎంతో కష్టపడి అన్నయ్యను, నన్ను చదివించింది. కూలీ పని చేసి మమ్మల్ని ఈ స్థా యికి తీసుకువచ్చింది. గ్రూప్ 1 సాధించడమే నా లక్ష్యం. కానిస్టేబుల్ విధులను వదిలేస్తా. వీఆర్వోగా విధులు నిర్వహిస్తూ గ్రూప్1కు సిద్ధమవుతానని’ స్వరూప్‌రాజ్ చెప్పాడు.
 
 పేద కుటుంబం నుంచి వీఆర్వో స్థాయికి..
 మందమర్రి : వీఆర్వో ఫలితాల్లో మందమర్రి పట్టణానికి చెందిన ఓజ్జా రమేష్ (హాల్‌టికెట్ నం.119114039) జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. వంద మార్కులకు గాను 97 మార్కులు పొందాడు. రమేష్ తల్లిదండ్రులు గట్టయ్య, గట్టమ్మ. తండ్రి ఏడేళ్ల క్రితం సింగరేణిలో పదవి విరమణ పొందాడు. రమేష్ పదో తరగతి స్థానిక విజ్ఞాన్ పాఠశాలలో, ఇంటర్ సరస్వతి కళాశాలలో చదివి, ఇందిర గాంధీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రి పూర్తి చేశాడు. గ్రూప్‌కు సెలెక్ట్ కావడమే తన లక్ష్యమని, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ ర్యాంకు సాధ్యమైందని ఈ సందర్భంగా రమేష్ చెప్పాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement