గెస్టు లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం
మైలవరం :
మైలవరం వీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లిష్, కామర్స్ (వృత్తి విద్యా కోర్సు ఒఎ) నందు అధ్యాపక పోస్టులలో గెస్టు ఫాకల్టీగా పనిచేడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. శ్రీరామమూర్తి శుక్రవారం తెలిపారు. గెస్టు ఫాకల్టీలకు గంటకు రూ.150 చొప్పున గరిష్టంగా నెలకు రూ. 10 వేలు గౌరవ వేతనం చెల్లించబడుతుందన్నారు. ఔత్సాహికులు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలు లోగా దరఖాస్తులు కళాశాల కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తుదారులు 20వ తేదీ 10గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని లె లిపారు. విశ్రాంత అధ్యాపకులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.