wall climbing
-
ఒంటిచేత్తో గిన్నిస్ రికార్డు
One handed climber: ప్రమాదాల్లో చేతులు, కాళ్లు పోగొట్టుకున్న వాళ్లు కొందరు కుంగిపోతుంటారు. ఇక బయటి ప్రపంచంతో పోటీపడలేమని లోలోపల మథనపడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఇవేం మనకు అడ్డే కాదని దూసుకుపోతుంటారు. ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంటారు. అలాంటివాళ్లలో ఒకరే అనౌషీ హుస్సేస్. లండన్‌కు చెందిన ఈమె పుట్టినప్పుడు కుడిచేయి మోచేతి భాగం వరకు లేకుండానే పుట్టారు. అయినా టీనేజ్‌లో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్‌లో పట్టు సాధించారు. లక్సెంబర్గ్ నేషనల్ టీమ్‌లోనూ సభ్యురాలు కూడా. కానీ ఎహ్లర్స్–డాన్లోస్ సిండ్రోమ్ (చర్మం, కీళ్లు మరియు రక్తనాళాల గోడలపై ప్రభావం చూపుతుంది) అనే వారసత్వంగా వచ్చే వ్యాధితో ఇబ్బందిపడటంతో కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఆమె కుంగిపోలేదు. తర్వాత కేన్సర్ బారిన పడ్డారు. భయపడలేదు. వ్యాధి నుంచి కోలుకుంటున్న క్రమంలో పదేళ్ల కిందట క్లైంబింగ్పై దృష్టి పెట్టారు. మెళకువలు నేర్చుకున్నారు. తాజాగా ఒక గంటలో 374 మీటర్లు క్లైంబింగ్ వాల్ ఎక్కి ఔరా అనిపించారు. క్లైంబింగ్ వాల్‌పై ఒక గంటలో ఒంటి చేత్తో ఎక్కువ దూరం ఎక్కిన మహిళగా గిన్నిస్ రికార్డును సాధించారు. ‘నా బలహీనతను అధిగమించేందుకు సాధన చేస్తూ వచ్చా. అనుకున్నది సాధించా’అని అనౌషీ అంటున్నారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత టీనేజర్‌గా బహదూర్.. రికార్డు బలాదూర్) -
గోడలెక్కే రోబో జలగ
టోక్యో: జలగ మాదిరిగా గోడలను సైతం సునాయాసంగా పాకుతూ ఎక్కగలిగే రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ రోబోలు భవనాల నిర్వహణ, తనిఖీ, అన్వేషణ, విపత్తు సమయాల్లో భవనాల లోపలికి వెళ్లగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని జపాన్‌లోని టోయోహాషి యూనివర్సిటీ, బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. దీని పేరు లీచ్(లాంగిట్యూడినల్లీ ఎక్స్‌టెన్సిబుల్ కంటినమ్ రోబోట్ ఇన్స్పైర్డ్ బై హిరుడినియా). దీనిని షవర్ హోస్(స్నానాల గదిలో వాడే పైపు), రెండు సక్షన్ కప్(గోడకు పట్టి ఉండే పరికరం)లను ఉపయోగించి తయారు చేశారు. జలగలు కొండలు, ఇతరత్రా ఎక్కేటప్పుడు వాటి శరీరంలో ఉండే సక్షన్ కప్‌లు ఉపయోగపడతాయని తాము గుర్తించామని అన్నారు. ఈ రెండింటితోపాటు మరికొన్ని పరికరాలను ఉపయోగించి దీనిని తయారు చేశామని వివరించారు. మృదువుగా, సౌకర్యవంతంగా ఉంటూ ఎలాంటి గోడలను అయిన ఎక్కగలిగే ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో ఇదేనని వెల్లడించారు. ఈ వివరాలు సాఫ్ట్ రోబోటిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
‘వాల్’చూపు చూసేద్దాం
వాల్ క్లైంబింగ్ విషయానికొస్తే.. ఇది అందులో ఎవరెస్టు శిఖరంలాంటిది. స్విట్జర్లాండ్‌లోని దిగాది లజ్జోన్.. వాల్ క్లైంబింగ్‌కు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తై కృత్రిమ గోడ. దీని ఎత్తు 540 అడుగులు. అందుకే వాల్ క్లైంబింగ్ అంటే ఆసక్తి ఉన్నవారు ఈ గోడ ఎక్కడానికి ఉవ్విళ్లూరుతుంటారు. వాస్తవానికి ది లజ్జోన్ డామ్ తాలూకు గోడ. దీన్ని ఎక్కాలనుకునేవారు రూ.1,400 చెల్లించాల్సి ఉంటుంది.