One handed climber: ప్రమాదాల్లో చేతులు, కాళ్లు పోగొట్టుకున్న వాళ్లు కొందరు కుంగిపోతుంటారు. ఇక బయటి ప్రపంచంతో పోటీపడలేమని లోలోపల మథనపడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఇవేం మనకు అడ్డే కాదని దూసుకుపోతుంటారు. ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంటారు. అలాంటివాళ్లలో ఒకరే అనౌషీ హుస్సేస్. లండన్‌కు చెందిన ఈమె పుట్టినప్పుడు కుడిచేయి మోచేతి భాగం వరకు లేకుండానే పుట్టారు.
అయినా టీనేజ్‌లో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్‌లో పట్టు సాధించారు. లక్సెంబర్గ్ నేషనల్ టీమ్‌లోనూ సభ్యురాలు కూడా. కానీ ఎహ్లర్స్–డాన్లోస్ సిండ్రోమ్ (చర్మం, కీళ్లు మరియు రక్తనాళాల గోడలపై ప్రభావం చూపుతుంది) అనే వారసత్వంగా వచ్చే వ్యాధితో ఇబ్బందిపడటంతో కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఆమె కుంగిపోలేదు. తర్వాత కేన్సర్ బారిన పడ్డారు. భయపడలేదు.
వ్యాధి నుంచి కోలుకుంటున్న క్రమంలో పదేళ్ల కిందట క్లైంబింగ్‌పై దృష్టి పెట్టారు. మెళకువలు నేర్చుకున్నారు. తాజాగా ఒక గంటలో 374 మీటర్లు క్లైంబింగ్ వాల్ ఎక్కి ఔరా అనిపించారు. క్లైంబింగ్ వాల్‌పై ఒక గంటలో ఒంటి చేత్తో ఎక్కువ దూరం ఎక్కిన మహిళగా గిన్నిస్ రికార్డును సాధించారు. ‘నా బలహీనతను అధిగమించేందుకు సాధన చేస్తూ వచ్చా. అనుకున్నది సాధించా’అని అనౌషీ అంటున్నారు.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత టీనేజర్‌గా బహదూర్.. రికార్డు బలాదూర్)
Comments
Please login to add a commentAdd a comment