Single Hand
-
Parvathy Gopakumar: ఒంటి చేత్తో విజయం
కారణాలు, సాకులు విజయానికి విరోధులు. లక్ష్యం ఉన్నవారు ఆకాశాన్ని, పాతాళాన్ని ఏకం చేసి అనుకున్నది సాధిస్తారు. 12వ ఏట కుడి చేతిని కోల్పోయిన పార్వతి గోపకుమార్ సివిల్స్ 2023లో 282వ ర్యాంక్ సాధించడానికి ఒంటి చేత్తో పోరాడింది. ‘మీరు సంతోషంగా ఉంటేనే సరిగ్గా చదవగలరు’ అంటున్న పార్వతి సమస్యలను జయించగల చిరునవ్వును సొంతం చేసుకుంది. పార్వతి గోపకుమార్ సంతోషంగా ఉంది. ఆమెకు కలెక్టర్ కావాలని ఉంది. సివిల్స్ 2023 ఫలితాలలో 282 ర్యాంక్ సాధించింది. కాని ఆ ర్యాంక్‌కు ఐ.ఏ.ఎస్. రాకపోవచ్చు. కాని దివ్యాంగ కోటాలో చూసినప్పుడు ఆమెది టాప్ ర్యాంక్. కనుక రావచ్చు.‘మాది అలెప్పి. బెంగళూరు నేషనల్ లా స్కూల్లో చదువుకున్నాను. ఆ సమయంలో అలెప్పి కలెక్టరేట్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాటి కలెక్టర్ ఎస్.సుహాస్ పనిచేసే విధానం, కలెక్టర్ స్థానంలో ఉంటే ప్రజలకు చేయదగ్గ సేవ చూసి నాక్కూడా ఐ.ఏ.ఎస్. కావాలనిపించింది. ఆ విషయం తెలిశాక కలెక్టరేట్లో అందరూ నన్ను అందుకు కష్టపడమని ్రపోత్సహించారు. 2022లో మొదటిసారి సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ దాటలేకపోయాను. ఒక సంవత్సరం విరామం ఇచ్చి 2023లో రెండోసారి రాశాక ఈ ర్యాంక్ తెచ్చుకున్నాను’ అని తెలిపింది పార్వతి. ఇప్పుడు ఆమె వయసు 26 సంవత్సరాలు. 7వ తరగతిలో ప్రమాదం2010లో పార్వతి ఏడవ తరగతిలో ఉండగా కారు ప్రమాదంలో ఆమె కుడిచేయి మోచేతి వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వయసులో అలాంటి నష్టం ఎవరికైనా పెద్ద దెబ్బగా ఉంటుంది. అయితే తండ్రి గోపకుమార్, తల్లి శ్రీకళ ఇచ్చిన ధైర్యంతో వెంటనే ఎడమ చేత్తో రాయడం ్రపాక్టీసు చేసింది పార్వతి. ఆ తర్వాత మూడు నెలల్లో వచ్చిన పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు సిలికాన్, ΄్లాస్టిక్లతో చేసిన కృత్రిమ హస్తాన్ని అమర్చుకుంది.‘నాకు దివ్యాంగులు అనే పదం నచ్చదు. అందులో ఏదో బుజ్జగింపు ఉంటుంది. వికలాంగులను వికలాంగులుగానే పిలుస్తూ సమాన గౌరవం ఇవ్వాలి. చేయి కోల్పోయాక నా జీవితమే మారిపోయింది. జనం వికలాంగులతో ఎంతో మొరటుగా వ్యవహరిస్తారు. నువ్వు బ్రా ఎలా వేసుకుంటావు, ΄్యాడ్ ఎలా పెట్టుకుంటావు అని అడిగినవారు కూడా ఉన్నారు’ అని చెబుతుంది పార్వతి.మహిళా దివ్యాంగుల కోసంఐ.ఏ.ఎస్ అయ్యాక దివ్యాంగుల కోసం, ముఖ్యంగా మహిళా దివ్యాంగుల కోసం పని చేయాలనుకుంటోంది పార్వతి. ‘ప్రేమలో పడి శారీరక వాంఛను వ్యక్తం చేసే దివ్యాంగుల సినిమాలు మీరెప్పుడైనా చూశారా? దివ్యాంగులకు ప్రేమ ఏమిటి అనే ధోరణి మనది. ఇక మహిళా దివ్యాంగులైతే పెళ్లి చేసుకుని భర్త ఎదుట ఆత్మన్యూనతతో ఉండేలా తయారు చేశారు. శారీరక లోపం శరీరానికి సంబంధించింది. మేము పొందాల్సిన ప్రేమ, గౌరవం, లైంగిక జీవితం పట్ల మాకు సమాన హక్కు ఉంది. కొందరు అబ్బాయిలు మమ్మల్ని ప్రేమించి ఉద్ధరిస్తున్నామనుకుంటారు. ఇందులో ఉద్ధరణ ఏమీ లేదు. మేము కూడా సమాన మనుషులమే. అందరిలాగే మేము కూడా’ అంటోందామె. -
ఒంటిచేత్తో గిన్నిస్ రికార్డు
One handed climber: ప్రమాదాల్లో చేతులు, కాళ్లు పోగొట్టుకున్న వాళ్లు కొందరు కుంగిపోతుంటారు. ఇక బయటి ప్రపంచంతో పోటీపడలేమని లోలోపల మథనపడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఇవేం మనకు అడ్డే కాదని దూసుకుపోతుంటారు. ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంటారు. అలాంటివాళ్లలో ఒకరే అనౌషీ హుస్సేస్. లండన్‌కు చెందిన ఈమె పుట్టినప్పుడు కుడిచేయి మోచేతి భాగం వరకు లేకుండానే పుట్టారు. అయినా టీనేజ్‌లో ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్‌లో పట్టు సాధించారు. లక్సెంబర్గ్ నేషనల్ టీమ్‌లోనూ సభ్యురాలు కూడా. కానీ ఎహ్లర్స్–డాన్లోస్ సిండ్రోమ్ (చర్మం, కీళ్లు మరియు రక్తనాళాల గోడలపై ప్రభావం చూపుతుంది) అనే వారసత్వంగా వచ్చే వ్యాధితో ఇబ్బందిపడటంతో కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. కానీ ఆమె కుంగిపోలేదు. తర్వాత కేన్సర్ బారిన పడ్డారు. భయపడలేదు. వ్యాధి నుంచి కోలుకుంటున్న క్రమంలో పదేళ్ల కిందట క్లైంబింగ్పై దృష్టి పెట్టారు. మెళకువలు నేర్చుకున్నారు. తాజాగా ఒక గంటలో 374 మీటర్లు క్లైంబింగ్ వాల్ ఎక్కి ఔరా అనిపించారు. క్లైంబింగ్ వాల్‌పై ఒక గంటలో ఒంటి చేత్తో ఎక్కువ దూరం ఎక్కిన మహిళగా గిన్నిస్ రికార్డును సాధించారు. ‘నా బలహీనతను అధిగమించేందుకు సాధన చేస్తూ వచ్చా. అనుకున్నది సాధించా’అని అనౌషీ అంటున్నారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత టీనేజర్‌గా బహదూర్.. రికార్డు బలాదూర్) -
ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపాడు! వైరల్ వీడియా
Ukrainian Man Single-Handedly Stops: గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ పై మూడువైపుల నుంచి దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌లోని బఖ్మాచ్ వీధుల్లో ఒక వ్యక్తి రష్యన్ యుద్ధ ట్యాంకుని ఒంటి చేత్తో పట్టుకుని ఆపేశాడు. తాను ఎంతవరకు బలంగా నెట్టగలడో అంతమేర నెట్టి ఆ తదుపరి నేలమీద మోకాళ్ల పై నిలబడి కూర్చున్నాడు. వెంటేనే అక్కడ ఉండే నివాసితులు అతని వద్దకు పరిగెత్తుకుని వస్తారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అంతేకాదు ఉక్రెయిన్ అధికారులు ఇన్‌స్టాగ్రాంలో .."ఉక్రెయిన్ ప్రజలను బందిఖానాలో ఉంచుతానని రష్యా సంవత్సరాలుగా అబద్ధం చెబుతోంది. వాస్తవమేమిటంటే ఉక్రేనియన్ ప్రజలు స్వేచ్ఛగా జీవించడమే కాదు అవసరమైతే తమ ఒట్టి చేతులతో రష్యన్ ట్యాంకులను ఆపడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ భావోద్వేగంగా పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Ukraine UA (@ukraine.ua) (చదవండి: యుద్ధ ట్యాంక్ కారుని నుజ్జునుజ్జు చేసింది...కానీ ఆవ్యక్తి) -
ఒంటిచేత్తో బ్యాటింగ్.. ప్రశంసల వర్షం
దుబాయ్ : ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ వీరోచిత సెంచరీతో పాటు మరో ఆటగాడి ఒంటిచేతి పోరాటంను అందరూ అభినందిస్తూన్నారు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసి ఔరా అనిపించాడు. లంక బౌలర్ లక్మల్ వేసిన రెండో ఓవర్లో ఇక్బాల్ ఎడమ చేతి మణికట్టుకి బంతి బలంగా తాకడంతో తీవ్ర గాయమైంది. దీంతో అతను రెండో ఓవర్లోనే రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఓవైపు ముష్ఫికర్ రహీమ్ పోరాడుతున్నా మరోవైపు నుంచి సహాకారం లేక వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బంగ్లా తొమ్మిదో టికెట్‌ను కోల్పోయింది. రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగిన ఇక్బాల్ ఇబ్బందుల్లో ఉన్న జట్టు కోసం గాయంతోనే పదో వికెట్‌గా క్రీజ్‌లోకి వచ్చి ఒంటిచేత్తో బ్యాటింగ్ చేశాడు. గాయం కారణంగా బాధపడుతునే ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశం కోసం గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఒంటిచేత్తో బ్యాటింగ్ చేయడం గ్రేట్.. నీ ధైర్యానికి సెల్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్ 137 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా తరువాత జరిగే మ్యాచ్‌కు తమీమ్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలవాల్సి ఉంది. tamim iqbal batting with one arm, is this even real? massive respect 🙌 #banvsl pic.twitter.com/znsBtpGEF9 — Ali (@AleyFarooqq) September 15, 2018 -
ఎనీ గేమ్..సింగిల్ హ్యాండ్
ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. గణష్. ఇది సినిమా డైలాగ్. నిజ జీవితంలో కార్మికుడి కొడుకు ఆటైనా.. ఈతైనా.. పరుగైనా.. సైక్లింగైనా.. ఒంటి చేత్తో జాతయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నాడు. మణికట్టు లేకపోయినా మనోధైర్యంతో ముందుకు సాగుతున్న మురళికి వికలాంగులే ప్రేరణ అయ్యారు. రామగుండం(కరీంగనర్), న్యూస్‌లైన్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖని రాంనగర్లో నివాసముంటున్న తడబోయిన రమేష్-లక్ష్మి దంపతులకు శ్రీనివాస్, మురళి, సరళ సంతానం. రమేష్ సింగరేణి రామగుండం-2 ఏరియా పరిధిలోని ఓసీపీ-3 మేయిం టనెన్స్ సెక్షన్లో జనరల్ మజ్దూర్‌గా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు మురళికి పుట్టుకతోనే కుడి చేయి మణికట్టు లేదు. దీంతో మానసికంగా కృంగిపోయిన అతడికి కుటుంబ సభ్యులు, మిత్రులు, కోచ్‌ల ప్రోత్సాహం ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న మురళి పట్టుదలతో సాధన చేసి క్రీడల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. వికలాంగులే ప్రేరణ చిన్నతనంలో సెలవు దినాల్లో కామారెడ్డి సమీపంలోని ముత్యంపేట గ్రామానికి వెళ్లిన మురళి అక్కడ చూసిన ఆ దృశ్యం అతడి జీవితాన్నే మార్చేసింది. రెండుకాళ్లు, ఒక చేయి లేని వ్యవసాయ కూలి చెరువులో ఈత కొడుతుంటే చూసి ఆక్చర్యపోయాడు. అంతే కాదు.. తన తాత మల్లయ్యకు కంటి చూపు లేకున్నా గోదావరిలో ఈత కొడుతుంటే గమనించాడు. కరీంనగర్లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మాదాసు శ్రీనివాస్‌కు రెండు కాళ్లు లేవు. ఆయన క్రీడల్లో సత్తా చాటి అర్జున అవార్డుకు ఎంపికవడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఈ సంఘటనలన్నీ దగ్గరగా గమనించిన మురళిలో ఏదైనా సాధించాలనే తపన పెరిగింది. క్రీడారంగలో అడుగులు ముందుకు వేయడానికి దారి చూపాయి. డిగ్రీ చదువుతున్న కాలేజీ డెరైక్టర్ రాజేందర్, లెక్చర్లు రాజయ్య, రవీందర్ మిత్రులుగా మారిపోయారు. తోటి క్రీడాకారులు అఖిల్షాఖన్, మధు, ఆనంద్, కోచ్‌లు కష్ణమూర్తి, కొండయ్య, శ్రీనివా స్, లైఫ్‌సేవింగ్ టీం మెంబర్ గౌతం ప్రోత్సాహం పుష్కలంగా లభించింది. తొలిసారి వరంగల్‌లో స్టేట్‌లెవల్ స్విమ్మింగ్ మీట్‌కు వెళ్లడానికి భయం పడుతుంటే.. మిత్రులు అఖిల్షాఖన్, ఆనంద్ కాలేజీకి డుమ్మాకొట్టి పోటీలకు తీసుకుపోగా ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానం లో నిలిచాడు. ఇది మురళి క్రీడా జీవితంలో టర్నింగ్‌పాయింట్‌గా మారింది. దీంతో ప్రతీ ఈవెంట్‌ను ఛాలెం జ్గా తీసుకుంటూ ముందుకు సాగాడు. సాధించిన విజయాలు చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పారా ఒలంపిక్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటాడు. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా మూడు అంశాలలో(750 మీటర్ల ప్రీస్టైల్ స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైకిలింగ్, 5 కిలోమీటర్ల పరుగు పందెం) కోలకతాలో జరిగిన పారా ఒలంపిక్ త్రైత్లాన్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో గత ఏడాది అక్టోబర్ 2న జరిగిన రాష్ట్రీయ క్రీడల్లో ఒంటి చేత్తో బ్యాడ్మింటన్ ఆడి బంగా రు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ పోటీలే లక్ష్యం అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించడమే తన లక్ష్యం. ఇందుకోసం అవసరమైన కసరత్తు చేస్తున్నాను. రక్షణ శాఖ లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేష న్(డీఆర్డీఓ)లో ఉద్యోగం చేయాలని ఉంది. -తడబోయిన మురళి -
ఒంటి చేత్తోనే కళాఖండాల సృష్టి..!
ఎంతటి గజ ఈతగాడైనా ఒంటి చేత్తో సముద్రాన్ని ఈదగలడా? అసాధ్యం కదూ! టీవీయస్ శర్మను చూస్తే ఈ ప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదనిపిస్తుంది. కళాదర్శకుడంటేనే చేతులతో పని. చక చకా బొమ్మలు గీసెయ్యాలి. సెట్లు వేసెయ్యాలి. టీవీయస్ శర్మకు ఎడమ చెయ్యి లేదు. ఒంటి చేత్తోనే కళాఖండాలన్నీ సృష్టించేశాడాయన. లవకుశ... నర్తనశాల... సీతారామ కల్యాణం... భీష్మ... మైరావణ... రాజు-పేద... చెంచులక్ష్మి... దొంగరాముడు... తోడికోడళ్లు... కలిసి ఉంటే కలదు సుఖం... శకుంతల... శ్రీకృష్ణ పాండవీయం... ఈ క్లాసిక్స్ అన్నింటికీ ఓ కళ తీసుకొచ్చింది శర్మే. నెల్లూరులో పుట్టి పెరిగిన శర్మకు చిన్నతనంలోనే చిత్రలేఖనం అలవడింది. మరో పక్క ఆటల్లో బెస్టు. అల్లరిలో ఫస్టు. ఆ అల్లరి ఓసారి శ్రుతి మించింది. ఓ దీపావళినాడు బాణాసంచా పేలి, ఎడమ చేయి తెగిపడింది. మోచేతి దాకా తీసిపారేశారు. చేయి లేకపోతేనేం... చేవ ఉంది కదా అనుకున్నా డాయన. తన కల నెరవేర్చుకోవడానికి సింగిల్ హ్యాండ్ చాలనుకున్నాడు. సినిమా ఫీల్డ్కి వచ్చీ రావడంతోనే శర్మ కళాపరిమళం గుప్పున ఉప్పొంగింది. తొలి సినిమా ‘సతీ తులసి’ (1936)తోనే అందరి కళ్లూ శర్మ వైపే. ‘మై రావణ’ (1939)లో పాతాళలోక సృష్టి చూసి భేష్ అననివారు లేరు. అసలు పౌరాణికాలన్నీ ఆయన పేరు చెబితేనే పులకించిపోయేవి. ఏం మేజిక్ చేసేవాడో ఏంటో కానీ, కొన్ని పాత్రల గెటప్పులు చూస్తే నిజంగా దేవతలే దిగివచ్చినట్టుగా అనిపించేసింది. ‘లవకుశ’లో అయితే నిజంగా శ్రీరాముడు, సీతాదేవి - ఎన్టీఆర్, అంజలీదేవిగా మారువేషం వేసుకున్నట్టే ఫీలయ్యారు జనాలు. ‘సత్యభామ’ సినిమాలో నారదుడి వేషం కానివ్వండి. ‘శ్రీకృష్ణ పాండవీయం’లో దుర్యోధనుడి రూపకల్పన కానివ్వండి... ఆయన కళా చాతుర్యం అద్భుతః.‘నర్తనశాల’లో బృహన్నల పాత్ర అయితే ఎక్స్లెంట్. ఎన్టీఆర్‌లాంటి సూపర్‌స్టార్‌ని అటూ ఇటూ కాని పేడి పాత్రలో చాలా లబ్జుగా తయారు చేశారు. ఏమాత్రం అటూ ఇటూ అయినా ఆ పాత్ర కాదు, సినిమానే తేడా కొట్టేసేది. ఇక ఆ సినిమా సెట్టింగులైతే అదరహో. ఈ సినిమా కోసం ఆయన తయారు చేసిన రాజరాజేశ్వరీ విగ్రహానికి సావిత్రి ఫ్లాట్ అయిపోయారు. షూటింగంతా అయ్యాక ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్లి, అక్కడే శాశ్వతపూజలో పెట్టేసుకున్నారు. ఏ కళాదర్శకుడికైనా ఇంతకన్నా ఏం కావాలి? ‘జకార్తా’ ఫిల్మ్ ఫెస్టివల్లో అయితే వచ్చిన గెస్టులంతా ‘నర్తనశాల’ సెట్టింగుల్ని రెండు కళ్లూ చాలవన్నట్టు చూశారు. ఇండోనేషియా ప్రధాని సుకర్ణో అయితే, ఒంటి చేత్తోనే శర్మ ఇవన్నీ సృష్టించారని తెలిసి ఒకటే పొగడ్తలు. అప్పుడే ఆయనకు ఉత్తమ కళాదర్శకుడిగా అవార్డొచ్చింది. ఇలా ఒక్కటని కాదు. శర్మ కెరీర్లో అన్నీ మెరుపులే.