Wall hangings
-
Interior Decor: చేటలో ప్లాంట్.. బాల్కనీకి పల్లె సొగసు.. వెదురు అందం!
సహజంగా దొరికేవన్నీ ఆరోగ్యాన్ని, అందాన్ని ఇనుమడింపజేసేవే.. ఒంటికైనా.. ఇంటికైనా! ఆ జాబితాలోనిదే వెదురు కూడా. ఇప్పుడు గృహాలంకరణలో భాగమై ఇంటి అందాన్ని పెంచుతోంది. ఎలాగో చూద్దాం.. బాల్కనీకి పల్లె సొగసు ఆత్మీయులు.. సన్నిహితులు ఎవరైనా ఈ వేసవి సీజన్లో మామిడి పండ్లనో.. లేక ఈ కాలంలో దొరికే ఇంకే పళ్లనో వెదురు బుట్టలో పెట్టి కానుకగా పంపింస్తుంటారు కదా! ఖాళీ అయిన ఆ బుట్టను మూలన పడేయకుండా ఇలా వాల్ డెకార్‌కి వాడుకోవచ్చు. బాల్కనీలోకి పల్లె ఇంటి ఆవరణను తీసుకురావచ్చు. చేటలో ప్లాంట్ ప్లాస్టిక్ చేటలతో గడిపేస్తున్న కాలం ఇది. వెదురుతో అల్లిన చేట నిరుపయోగంగా కనిపిస్తుంటే ఇదిగో ఇలా ఓ మొక్కతో దాన్ని గోడ మీదకు చేర్చండి. ఆ గోడకు క్లాసీ లుక్‌నే కాదు.. ఇంటికొచ్చే అతిథులకూ మీ రిచ్ టేస్ట్‌ను చూపిస్తుంది. వేస్ట్ బుట్ట బెస్ట్ విడిచిన బట్టలు వేయడానికి, ఇంట్లో చెత్తను గుమ్మరించడానికి ప్లాస్టిక్ బాస్కెట్లనే ఎక్కువగా ఉపయోగిస్తున్న ఉన్నాం. అవి విరిగినా, రంగు వెలసినా స్క్రాప్ షాప్‌కి వెళ్లిపోతుంటాయి. అలా వేస్ట్ అనుకున్న ప్లాస్టిక్, ఐరన్ బాస్కెట్లను నార తాడుతో చుట్టి, లేదా గ్లూతో అతికించి అలంకరణ వస్తువుగా మార్చేసుకోవచ్చు. వీటిలో ఇండోర్‌ప్లాంట్స్ పెడితే నిండే పచ్చదనం.. ఇంటిని చల్లగా ఆహ్లాదకరంగా ఉంచుతుంది. అంటే వేస్ట్‌ను కూడా బెస్ట్‌గా మార్చి వ్యర్థాలు పెరగకుండా ప్రకృతిని కాపాడవచ్చన్నమాట. కాదేదీ అలంకరణకు అనర్హం అన్నట్టుగా ఇలా ఈ వెదురు బుట్టలు, చేటలతో ఇంటికి ప్రకృతిని ఆహ్వానించ వచ్చు.. పచ్చదనాన్ని పదిలం చేసుకోవచ్చు. లేదంటే రంగుల కళతోనూ వెలుగులు నింపచ్చు. చదవండి: Miniature Garden: టీ కప్పులో వనాలు పెంచండిలా! -
లోగిలి
ఆనందం కళాత్మకంగా ఉండే డ్రాయింగ్ రూమ్ ఇంటి అందానికే కాదు, మనోల్లాసానికి కూడా దోహదం చేస్తుంది. హాల్లో సీటింగ్, మ్యూజిక్ సిస్టం, టీవీ, వాల్‌హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టమ్, తివాచీలు ఎలా అమరిస్తే అందంగా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. మీ ఇంటికి వచ్చిన అతిథులు మీరు గోడలకు అమర్చిన పెయింటింగ్స్ చూసి... వాటిని ఎక్కడ కలెక్ట్ చేశారని అడిగేలా వాటి కళాత్మకత ఉండాలి. ఇంట్లో రూముల గురించి మాత్రమే కాక పోర్టికో, ఇంటి ముందు ఉండే ఖాళీ ప్రదేశంలో ఇంటి వెనుక పెంచే మొక్కలు ఊయల గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి. మీ ఇంటి వరండాలోనూ ఇంటిముందు ఉన్న ఖాళీ ప్రదేశంలోనూ పెంపుడు జంతువుల కొరకు కేజ్‌లు ఏర్పాటు చేయండి. పక్షుల కోసం నీటి గిన్నెలు, కొన్ని గింజలు పెట్టండి. ఇంటిని ప్రశాంతనిలయంలా తీర్చిదిద్దడానికి ఇంల్లోని ప్రతి గది కొలతలు మీకు క్షుణ్నంగా తెలిసి ఉండాలి. అప్పుడే అలంకరణ విషయంలో స్పష్టమైన అవగాహన వస్తుంది. ప్రతిగదిలోనూ ఏదో ఒక ప్రాంతం ఫోకస్ పాయింట్లా ఉండాలి. అందుకు ప్రతి గదిలోనూ ఒక ప్రదేశంలో మీ అభిరుచికి తగినట్లు ప్రత్యేకమైన శిల్పాలు చిన్న పిల్లల బొమ్మలు లైటింగ్ టేబుల్స్, షాండ్లియర్, ఫ్లవర్ పాట్స్ అమర్చండి. చూసిన వెంటనే ఆకట్టుకునే విధంగా... గదిలో అమర్చిన లైటింగ్ ఆ గది అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. మీ గది రంగును రిఫ్లెక్ట్ చేసే విధంగా బల్బులను అమర్చండి. మీరు అమర్చిన లైటు కింద చక్కటి రౌండ్ టేబుల్ వేసి దానిమీద ఫ్లవర్బేసిన్ను పెట్టండి. రంగురంగుల డిజైన్లలో ఉండే బేసిన్లో నీళ్లు పోసి దాని పై రంగురంగుల అందమైన పూలను అమర్చండి.