wallposters
-
వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలపై ఫిర్యాదు
నెల్లిమర్ల : తనపై సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపించారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులపై ఓ యువతి నెల్లిమర్ల పోలీసుస్టేషన్న్లో ఫిర్యాదు చేసింది. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేటకు చెందిన ఆ యువతి, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం పట్టణానికి చెందిన వి.సునీల్‌కుమార్ జరజాపుపేటకు చెందిన ఓ యువతి పట్ల అసభ్యకరంగా గోడపత్రికలు ముద్రించి, చెడుగా ప్రచారం చేశాడు. వీటిని జరజాపుపేటలోని ఇళ్ల గోడలకు అంటించాడు. అలాగే మరో యువకుడు పి.పవన్‌కల్యాణ్ ఆ వాల్‌పోస్టర్లకు ఫోటోలు తీసి, వాటిని వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు. సదరు యువతి ఇరువురిపై నెల్లిమర్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం సునీల్‌కుమార్, పవన్‌కల్యాణ్‌లపై కేసు నమోదు చేశారు. -
31 నుంచి మోపిదేవి బ్రహ్మోత్సవాలు
మోపిదేవి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకూ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఏసీ ఎం.శారదాకుమారి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం వాల్‌పోస్టర్లు విడుదల చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి 1న స్వామివారి కల్యాణం, 2వ తేదీ ర«థోత్సవం జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి నూతన పట్టువస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ విచ్చేస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో శాంతి కల్యాణం, వివాహాలు, ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు బుద్దు పవన్‌కుమార్‌శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్యశర్మ, ఆలయ సూపరింటెండెంట్ మధుసూదనరావు, ఆలయ అధికారులు నాగమల్లేశ్వరరావు, కేశవరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
జన్యుమార్పిడి ఆహార పంటలను ఆపాలి
మిరుదొడ్డి: జన్యుమార్పిడి ద్వారా ఆహార పంటలను పండించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆడ్డుకోవాలని సీసీసీ (కేరింగ్ సిటిజన్ కలెక్టివ్) జిల్లా కో-ఆర్డినేటర్ సూకూరి ప్రవీణ్ అన్నారు. జన్యుమార్పిడి ఆహార పంటలను ఆపాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని చెప్యాల గ్రామ పంచాయతీ మదిర గ్రామం లింగుపల్లి రైతులతో కలిసి శనివారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆహార వ్యవస్థకు గొడ్డలి పెట్టులా మారిన జన్యు మార్పిడి పంటలను ఆపాలని డిమాండ్ చేశారు. జన్యు మార్పిడి పంటలతో భూ సారం తగ్గడం, కలుపు మొక్కలు విపరీతంగా పెరగడం, మొక్కలలో నపుంసకత్వం, తేనెటీగలు అంతరించడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్నారు. ప్రకృతికి విరుద్ధంగా ఒక జీవజాతి నుండి జన్యువులు తీసుకుని మరొక జీవజాతిలోకి చొప్పించి పంటల మార్పిడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే జరిగితే జన్యు మార్పిడి జరిగిన ఆహార పదార్థాలను తింటే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. పంటల మార్పిడి అయిన పంటలను పశు పక్ష్యాదులకు సైతం ప్రాణ హాని జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ఆహార పంటలలో జన్యు మార్పిడి వద్దే వద్దని గ్రామ గ్రామాన రైతులకు ఆవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.