wally
-
‘వాలీ’ దొరికిందోచ్!.. 22 రోజుల్లో 900 కిలోమీటర్లు ఈదేసింది
‘వాలీ’.. సముద్ర జలాల్లో తన విభిన్న చేష్టలతో ప్రఖ్యాతి గాంచిన వాల్రస్(ధ్రువపు జీవి). ఆర్కిటిక్ ప్రాంత సముద్ర జలాల్లో ప్రయాణించేవారికి ఇది సుపరిచితం. అయితే కొన్నిరోజుల కిందట అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో చాలా మంది జంతు ప్రేమికులు, పర్యాటకులు ఆందోళన చెందారు. వాలీ క్షేమంగా ఉండాలంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఎట్టకేలకు 22 రోజుల తర్వాత వాలీ ఆచూకీ లభించింది. 800 కిలోల బరువు ఉండే ఈ ప్రాణి.. 22 రోజుల్లో దాదాపు 900 కిలోమీటర్లు ఈదేసింది. చివరిసారిగా ఐర్లాండ్‌లో కనిపించిన వాలీ.. తిరిగి 22 రోజుల తర్వాత ఆదివారం ఐస్లాండ్ సమీపంలో దర్శనమిచ్చింది. బ్రిటిష్ డైవర్స్ దాని శరీరం మీద ఉన్న గుర్తుల ఆధారంగా ‘వాలీ’ని నిర్ధారించారని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ తెలిపింది. ఈ 22 రోజులు చాలా ఆందోళన చెందామని.. మళ్లీ చూస్తామో లేదో అని భయపడ్డామని పేర్కొంది. ఎట్టకేలకు వాలీ ఆచూకీ లభించడం సంతోషంగా ఉందని వెల్లడించింది. అది తిరిగి తన స్వస్థలం ఐర్లాండ్‌కు వచ్చేందుకు ఈదడం మొదలుపెట్టిందని వివరించింది. వివిధ దేశాల మీదుగా దాదాపు 4,000 కిలోమీటర్లు ప్రయాణించి ఐర్లాండ్‌కు చేరుకుంటుందని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ అంచనా వేస్తోంది. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ చదవండి: ఇది మా గగన విహారం మీరు ఎగరడానికి వీల్లేదు! #WalrusWatch UPDATE: After 22 days with no confirmed sightings, we were starting to lose hope of ever seeing the young, wandering walrus again. HOWEVER, we just received notice that a similar-looking walrus was sighted yesterday in ICELAND.. Picture: Hafrún Eiríks / Höfn 1/7 pic.twitter.com/ZQLwGtbVol — Seal Rescue Ireland (@seal_rescue) September 20, 2021 -
24 నుంచి జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు
బ్రోచర్, ఆహ్వాన పత్రిక విడుదల ఉప్పలగుప్తం (అమలాపురం) : మహాశివరాత్రి, కోనసీమ ఉత్సవ శోభ ఉత్సవాలను పురస్కరించుకుని గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఈ నెల 24 నుంచి ఐదు రోజుల పాటు నిమ్మకాయల వెంకటరంగయ్య జాతీయస్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల బ్రోచర్, ఆహ్వాన పత్రికలను బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విడుదల చేశారు. గొల్లవిల్లిలోని చినరాజప్ప కల్యాణ మంటపంలో టోర్నీ అధ్యక్షుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు అధ్యక్షతన టోర్నీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొన్నేళ్లుగా అందరి సహకారంతో పోటీలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ ద్వారా ఈ పోటీలకు పలు రాష్ట్రాల నుంచి జాతీయ క్రీడాకారులు హజరవుతారని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. టోర్నీ కోశాధికారి, సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు అరిగెల వెంకటముసలయ్య. కార్యదర్శి మద్ధింశెట్టి సుబ్బరాజు (సురేష్) మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలతో వాలీబాల్ కోర్టు, గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొలకోటి సత్తిరాజు, సాంకేతిక పర్యవేక్షకులు ఉండ్రు రాజబాబు, సభ్యులు షేక్ చినవలీ, సలాది సత్తిబాబు, గుర్రాల దుర్గాప్రసాద్, నిర్వాహక కార్యదర్శి గొలకోటి ఫణీంద్రకుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి, అమలాపురం జోన్ పీఈటీల సంఘ అధ్యక్షుడు ఉండ్రు ముసలయ్య, ఎస్సై డి.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.