Walmart shooting
-
‘వాల్‌మార్ట్’ కాల్పుల దోషికి 90 జీవిత ఖైదులు
ఎల్ పాసో: అమెరికాలోని ఎల్ పాసో నగరంలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో 2019లో కాల్పులు జరిపి 23 మంది మృతికి కారణమైన వ్యక్తికి కోర్టు 90 వరుస జీవిత ఖైదులను విధించింది. దోషి పాట్రిక్ క్రుసియస్(24)పై సుమారు 50 ఫెడరల్ విద్వేష నేరాభియోగాలున్నాయి. దీనిపై జిల్లా కోర్టు విచారణ జరిపి, శిక్షలు ప్రకటించింది. రాష్ట్ర కోర్టులో విచారణకొస్తే మరణ శిక్ష సహా మరిన్ని శిక్షలపై పట్టుబడతామని న్యాయవాదులు అంటున్నారు. ఈ నేరానికి పాల్పడేందుకు పథకం ప్రకారం క్రుసియస్ డల్లాస్‌లోని సొంతింటి నుంచి ఏకే రైఫిల్‌తో తన వాహనంలో 700 మైళ్ల దూరంలోని ఎల్ పాసోకు వచి్చనట్లు పోలీసులు తెలిపారు. హిస్పానిక్ ప్రజలే లక్ష్యంగా అతడు వాల్ మార్ట్ స్టోర్ లోపల, వెలుపల యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 23 మంది చనిపోగా మరో 25 మంది గాయపడ్డారు. 2006 తర్వాత అమెరికాలో జరిగిన జాత్యహంకార కాల్పుల ఘటనల్లో అత్యంత తీవ్రమైందిగా ఎల్ పాసో ఘటనను పరిగణిస్తున్నారు. -
వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో తుపాకీ మరోసారి గర్జించింది. వర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తుపాకీతో స్టోర్‌లోకి వెళ్లిన వ్యక్తి కన్పించినవారిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. అతను వాల్‌మార్ట్‌లో పనిచేసే ఉద్యోగా? కాదా? తెలియాల్సి ఉందన్నారు. నిందితుడు కూడా స్టోర్ లోపలే చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. అయితే పోలీసులే నిందితుడ్ని కాల్పి చంపి ఉంటారని స్థానిక మీడియా చెప్పింది. కానీ తాము కాల్పులు జరపలేదని పోలీసు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడే తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవదహనం -
అమెరికాలో మళ్లీ కాల్పులు!
అమారిలో: ఆర్లెండోలోని నైట్ క్లబ్బులో జరిగిన దారుణమైన కాల్పుల ఉదంతం మరువకముందే మళ్లీ అమెరికాలో కాల్పుల మోత మోగినట్టు తెలుస్తోంది. టెక్సాస్ అమారిలోలోని వాల్‌మార్ట్ వద్ద ఓ సాయుధుడు కాల్పులతో కలకలం రేపాడు. సాయుధుడి చేతిలో పలువురు బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లడం మానుకోవాలని, ట్రాఫిక్ మీద దృష్టి పెట్టడం కన్నా సంఘటన స్థలంలో పరిస్థితులపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాలని అమారిలో పోలీసు విభాగం సూచించింది. వాల్‌మార్ట్ స్టోర్‌లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి తుపాకులతో వీరంగానికి దిగినట్టు తెలుస్తున్నదని స్థానిక మీడియా కథనాలు తెలుపుతున్నాయి. అయితే, ఈ ప్రాంతంలో ఎవరూ కాల్పుల బారిన పడలేదని, కాల్పుల వల్ల ఎవరు గాయపడ్డట్టు సమాచారం లేదని అమారిలో పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు వాల్‌మార్ట్ స్టోర్‌లోకి ప్రవేశించారని, ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగడం లేదని వెల్లడించారు. సాయుధుడి ఆధీనంలో ఉన్న బందీలంతా సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఆర్లెండోలోని ఓ గే నైట్‌క్లబ్బులో రెండ్రోజుల కిందట ఓమర్ మతీన్ ఉన్మాదీ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. పల్స్ క్లబ్బులో పార్టీలో మునిగితేలిన యువకులపై అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 49మందిని పొట్టనబెట్టుకున్నాడు. దేశీయ ఉగ్రవాదమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే టెక్సాస్‌లోని అమారిలోలో కాల్పులు చోటుచేసుకోవడం అమెరికన్లు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.