రంజాన్ ప్రార్థనలకు మసీదులకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను తప్పకుండా పాటించాలని వక్ఫ్ బోర్డు సీఈవో స్పష్టం చేశారు. ఈ నెల 24 లేదా 25వ తేదీల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుందని, ఈ సమయంలో ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ప్రార్థనల కోసం మసీదులు, దర్గాల వద్దకు రావొద్దన్నారు. ఎవరింట్లో వాళ్లు ప్రార్థనలు చేసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు. అలాగే మసీదులు, దర్గాల వద్ద లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని వక్ఫ్ బోర్డు సీఈవో శుక్రవారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: పారాసిటమాల్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత