warangal electricity
-
మీ చేతిలోనే ‘పవర్’.. కరెంట్ బిల్లు స్లాబ్ రేట్ల తగ్గుదలకు 10 చిట్కాలు
విద్యుత్‌ను మనం ఉత్పత్తి చేయకపోవచ్చు కానీ.. వృథా చేయకుండా పొదుపు చేస్తే పరోక్షంగా ఉత్పత్తి చేసినట్లే. అనవసరంగా కరెంట్‌ను వాడకుండా పొదుపు చేయవచ్చు. తద్వారా వినియోగం యూనిట్లు తగ్గి బిల్లు స్లాబ్ రేట్లు తగ్గుతాయి. బిల్లుల రూపేణ చెల్లించే ఖర్చులు తగ్గుతాయి. మంగళవారం నుంచి 21 వరకు విద్యుత్ వారోత్సవాలు జరగనున్నాయి. కరెంటు ఆదా చేసే ఆ పది పద్ధతులు ఏంటో చూద్దాం. –సాక్షి, హన్మకొండ విద్యుత్ పొయ్యి ఆహారపదార్థాలు వండడానికి నిర్దేశించిన సమయానికంటే కొన్ని నిమిషాల ముందే విద్యుత్ స్టౌను ఆపేయాలి.సమతలమైన అడుగును కలిగిన వంటపాత్రలను ఉపయోగించాలి. ఎందుకంటే అవి పొయ్యిలోని కాయిల్ పూర్తిగా కప్పబడి ఉంటాయి. విద్యుత్ సద్వినియోగమై వంట త్వరగా పూర్తవుతుంది. మిక్సీలు రోజువాడే వాటిలో మిక్సీలు, గ్రైండర్లు ముఖ్యమైనవి. పొడిగా ఉండే వాటిని మెదపడానికి ఇవి ఎక్కువ సమయం తీసుకుంటాయి. తడి పదార్థాలను తక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి పొడులు చేయడం తగ్గించుకోవాలి. ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉండే గృహోపకరణాలను వాడితే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఫ్యాన్లు ఫ్యాన్ లేని ఇల్లు.. గది అంటూ ఉండదు. మనం ఏ గదిలో ఉంటామో అక్కడే ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. అక్కడినుంచి మరో గదిలోకి వెళ్లినప్పుడు ఆఫ్ చేయడం మరిచిపోవద్దు. రెగ్యులరేటర్‌ను కచ్చితంగా వాడాలి. ఇప్పుడు తక్కువ కరెంటు వినియోగంతో.. ధారాళంగా గాలి వచ్చే ఫ్యాన్లు వస్తున్నాయి. వాటిని వాడాలి. బల్బులు ఆర్పివేయాలి ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆర్పివేయాలి. కిటికీలను తెరిచి ఉంచడం, లేతరంగుల కర్టెన్లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావతంగా వస్తుంది. ఎల్ఈడీ బల్బులు నాలుగు రెట్ల వెలుగునిస్తాయి. తద్వారా విద్యుత్ పొదుపు అవుతోంది. బాత్రూమ్లలో చిన్న బల్బులను వాడాలి. బల్బులు ఆర్పివేయాలి. ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆర్పివేయాలి. కిటికీలను తెరిచి ఉంచడం, లేతరంగుల కర్టెన్లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావతంగా వస్తుంది. ఎల్ఈడీ బల్బులు నాలుగు రెట్ల వెలుగునిస్తాయి. తద్వారా విద్యుత్ పొదుపు అవుతోంది. బాత్రూమ్లలో చిన్న బల్బులను వాడాలి. ఎయిర్ కండిషనర్లు గది ఉష్ణోగ్రతను బట్టి దానికదే నియంత్రించుకునే పరికరాలను కొనాలి. తక్కువ చల్లదనం స్థితిలో ఉండేలా రెగ్యులేటర్లను ఉంచాలి. ఏసీతోపాటు సీలింగ్ ఫ్యాన్ కూడా వేసి ఉంచండి. అందువల్ల గది మొత్తం తొందరగా చల్లబడుతుంది. ఏసీలోని ధర్మోస్టాట్ నార్మల్ దగ్గర ఉంచాలి. లేకపోతే ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది. ఫ్రిజ్‌లు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయడం వల్ల మాన్యువల్ డీప్రాస్ట్ చేయాల్సిన ఫ్రిజ్, ఫ్రిజర్లు, ఫ్రిజ్‌లోని మోటార్ సరిగ్గా పనిచేసేందుకు శక్తిని పెంచుకుంటాయి. ఫ్రిజ్‌కు.. గోడకు మధ్య గాలి ఆడేలా కొంతస్థానాన్ని ఉంచాలి. డోర్ సరిగ్గా పట్టిందో, లేదో సరిచూసుకోవాలి. వేడిగా లేదా వెచ్చని పదార్థాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మైక్రోవేవ్స్ ఓవెన్స్ ఇవి సంప్రదాయక విద్యుత్ లేదా గ్యాస్ స్టౌ కన్నా 50 శాతం తక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఆహారపదార్థాలు ఓవెన్లో పెట్టాక ఎంత వరకు వచ్చాయో చూడడానికి మాటిమాటికి తలుపు తెరవద్దు. అలా తెరచిన ప్రతిసారీ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. తిరిగి మళ్లి వేడెక్కడానికి విద్యుత్ ఖర్చవుతుంది. టీవీ టీవీ లేని ఇల్లు ఉండదు. ఇప్పుడు అంతా ఎల్ఈడీ, ఎల్సీడీ అధునాత టెక్నాలజీతో వస్తున్నాయి. ఒక్కోసారి మనం టీవీ ఆన్‌చేసి ఇతర పనుల్లో నిమగ్నమవుతాం. అది మోగుతూనే ఉంటుంది. అలాకాకుండా మనం చూసిన తరువాత ఆఫ్ చేయడం మరిచిపోవద్దు. ఆన్‌లో ఉంటే 10వాట్ల శక్తిని నష్టపరుస్తుంది. కంప్యూటర్లు ఉపయోగించనప్పుడు ఇంట్లో, ఆఫీసులో కంప్యూటర్లను ఆఫ్ చేయడం మంచిది. ఎందుకంటే 24 గంటలు పనిచేసే ఒక కంప్యూటర్, ఫ్రిజ్ కన్నా ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. స్లీప్ మోడ్ ఉండేలా సెట్టింగ్ చేయడం ద్వారా దాదాపు 40శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. ల్యాప్‌టాప్‌ను కూడా ఇదేవిదంగా చేయాలి. సోలార్ వాటర్ హీటర్ చలికాలంలో వేడినీటితో స్నానం తప్పనిసరి. నీటిని వేడి చేసేందుకు విద్యుత్ హీటర్ బదులుగా సోలార్ వాటర్ హీటర్‌ను ఉపయోగించడం ఉత్తమం. విద్యుత్ హీటర్ ఎక్కువ కరెంటును తీసుకుంటుంది. కొంత ప్రమాదకరం కూడా. రోజువారీగా చెక్ చేసుకుంటూ పోతే సోలార్కు పెద్దగా ఖర్చు ఉండదు. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి... వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి. దీనివల్ల ధనాన్ని పొదుపు చేసుకున్నట్లే. వినియోగదారులు విద్యుత్ చాలా తక్కువగా వినియోగించే ఉపకరణాలు వాడాలి. టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ పొదుపు చేయడంలో, సౌర విద్యుత్ ఉత్పత్తిలో ముందుంది. ఇండియా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఊర్జా, స్కోచ్ అవార్డులు అందుకుంది. -ఎన్నమనేని గోపాల్‌రావు, సీఎండీ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ -
కరెంట్ తీగను మింగేశారు!
లైన్ మార్చకుండానే.. మార్చినట్లు రికార్డు ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల చేతివాటం ఎన్పీడీసీఎల్ సొమ్ము దుర్వినియోగం హన్మకొండ : కాంట్రాక్టర్ల లాభాపేక్ష, అధికారుల అక్రమార్జన వెరసి.. అటు వినియోగదారులు, ఇటు ఎన్పీడీసీఎల్ సంస్థకు నష్టం జరుగుతోంది. కొత్తగా విద్యుత్ లైన్ల నిర్మాణం, పాత లైన్ల మార్పు, లూజ్ లైన్లను సరిచేసేందుకు మిడిల్ పోల్స్ ఏర్పాటు, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు తదితర పనులను ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తోంది. అయితే, ఈ పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా.. ఎన్పీడీసీఎల్లోని ఇంజనీర్లు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఇక ఎంతో కొంత చేసిన పనిలో నాణ్యత లోపించ డం వంటి అంశాలను పక్కన పెడితే.. అసలు పనే చేయకున్నా చేసినట్లు సామగ్రి తీసుకుని, లేబర్ చార్జీలు విడిపించుకున్న ఘటన ఒకటి వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లైన్ మార్చేందుకు నాలుగేళ్లు... హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌లో బూర నరేందర్‌కు వెంకటరమణ ఆటో గ్యాస్ పేరు తో ఆటో గ్యాస్ డీలర్షిప్(బంక్) మంజూరైంది. ఆయన బంక్ మంజూరు చేయాలనుకున్న స్థలంలో విద్యుత్ లైను ఉండగా.. దాన్ని మారిస్తేనే బంక్ ఏర్పాటుకు అనుమతిస్తామని సంబంధిత కంపెనీ స్పష్టం చేసింది. దీంతో లైన్ మార్చడానికి అయ్యే ఖర్చులు రూ.34 వేలను డీడీ ద్వారా 2011 ఏప్రిల్‌లో ఎన్పీడీసీఎల్కు చెల్లించారు. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు విద్యుత్ లైన్ మార్చకపోవడంతో విసిగిపోయిన నరేందర్.. లైన్ మార్చకపోవడంతో తన గ్యాస్ డీలర్ షిప్ రద్దయ్యే ప్రమాదముం దని, దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకువెళ్లారు. దీంతో రంగంలోని దిగిన ఓ ఉన్నతాధికారి విచారణ జరపగా విస్తుపోయే నిజం బయటపడింది. ఎల్లాపూర్‌లో విద్యుత్ లైన్ మార్చేందుకు మూడు విద్యుత్ స్తంభాలు, దీనికి సరిపడా విద్యుత్ వైర్‌ను స్టోర్ నుంచి డ్రా చేయడమే కాక, మెటీరియల్ తరలింపు, లైన్ మార్చేందుకు లేబర్ చార్జీల కింద రూ.7వేలు 2012 నవంబర్‌లో డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉండడాన్ని ఆయన గుర్తించారు. అసలు లైనే మార్చనప్పుడు మెటీరియల్, లేబర్ చార్జీలు ఎవరికి చెల్లించారంటూ ఆయన ఆరా తీయగా.. చింతగట్టులో గతంలో పని చేసి ప్రస్తుతం కన్స్ట్రక్షన్కు బదిలీ అయిన ఎన్పీడీసీఎల్ ఏఈ దీనికి బాధ్యుడిగా తేలింది. ఈ మేరకు సదరు ఏఈపై చర్యలు తీసుకోవాలని విచారణ అధికారి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. అయితే, సదరు ఏఈపై మరికొన్ని ఆరోపణలు ఉన్నాయని, పూర్తిస్థాయిలో తనిఖీలో చేస్తే అవి బయటపడతాయని సంస్థలోని కొందరు అధికారులే చెబుతుండడం గమనార్హం. కాగా, ఎల్లాపూర్‌లో లైన్ మార్పు కోసం తీసుకువెళ్లిన సామగ్రిని ఆ ఏఈ ఏం చేశాడనేది తేలాల్సి ఉంది. ఇక.. డీడీ చెల్లించిన నాలుగేళ్లయినా లైన్ చెల్లించని ఎన్పీడీసీఎల్ సంస్థపై ఆటో గ్యాస్ డీలర్ న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు అధికారులు రంగంలోకి దిగి దిద్దుబాటు చేస్తూనే డీలర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.