warangal mgm
-
విషమంగానే ప్రీతి ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్/హైదరాబాద్: వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అంతర్గత అవయవాలు ఫెయిలైన స్థితిలో ఆమెను నిమ్స్‌కు తెచ్చారని, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరిచేందుకు ఎక్మో, సీఆర్ఆర్టీలతో ప్రయత్నం చేస్తున్నామని నిమ్స్ వైద్యులు వివరించారు. అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఈమేరకు గురువారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. సీనియర్ విద్యార్థి చేతిలో వేధింపులకు గురైన ప్రీతి బుధవారం ఎంజీఎం ఆస్పత్రిలో ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. పోలీసుల అదుపులో సైఫ్? ప్రీతి తండ్రి నరేందర్ నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు, సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సైఫ్‌పై ర్యాగింగ్, వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఏసీపీ బోనాల కిషన్ గురువారం కేఎంసీ, ఎంజీఎంలో విచారణ జరిపారు. ప్రీతి, సైఫ్‌ల సెల్ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు.. కాల్‌డేటా ఆధారంగా కూడా విచారిస్తున్నారు. అదేవిధంగా ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణమా..? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా ఆరా తీశారు. మరోవైపు, ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ప్రీతి సహచర విద్యార్థులు, అనస్థీషియా విభాగ వైద్యులతో మాట్లాడి ప్రాథమిక నివేదిక తయారుచేసింది. ఈ నివేదికను శుక్రవారం డీఎంఈకి పంపనున్నట్లు ఎంజీఎం పరిపాలనాధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రీతి, సైఫ్ ఇద్దరి కుటుంబాలదీ రైల్వే బ్యాక్ గ్రౌండే కావడం గమనార్హం. ప్రీతి తండ్రి ధరావత్ నరేందర్ నాయక్ వరంగల్ రైల్వే ప్రొటెక్షన్స్ ఫోర్స్‌లో ఏఎస్ఐగా పని చేస్తుండగా, సైఫ్ తండ్రి సలీం కాజీపేటలో రైల్వే డీజిల్ లోకోషెడ్‌లో పని చేస్తున్నారు. సరస్వతీ పుత్రిక ఎంజీఎం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రీతి సర్వసతీ పుత్రిక అని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెబుతున్నారు. ఎస్ఎస్సీలో 600కు గాను 526 మార్కులు సాధించింది. ఇంటర్లో వెయ్యి మార్కులకు 970 సాధించింది. ఎంసెట్ ఎంట్రన్స్‌లో 5 వేల ర్యాంకు సాధించి కామినేని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. 2013లో వైద్యవిద్యను ప్రారంభించి 2019లో పూర్తిచేసింది. పీజీ ఎంట్రన్స్‌లో ఆలిండియా 1161 ర్యాంకు సాధించి కేఎంసీలో అనస్థీషియా విభాగంలో అడ్మిషన్ పొందింది. అన్ని స్థాయిల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తున్న ప్రీతి ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు తలొగ్గేది కాదని, వైద్యవిద్య అంటే ఆమెకు ఇష్టమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. -
ఎంజీఎంలో విషాదం: నిర్లక్ష్యానికి ‘ఊపిరి ఆగింది’!
సాక్షి,వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ కరోనా రోగి మృతి చెందాడు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వెంటిలేటర్‌పై ఉన్న రోగి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. కరోనా బాధితుడు గాంధీ.. గత నెలాఖరులో ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే, శనివారం ఆస్పత్రిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై అతను ప్రాణాలు కోల్పోయాడు. కాగా, వెంటిలేటర్ తీసేసి సాధారణ బెడ్‌పై వేయడంతో గాంధీ ప్రాణాలు కోల్పోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి వివరణ ఇస్తూ... ఆస్పత్రిలో అందుబాటులో జనరేటర్లు ఉన్నాయని, మరో వెంటిలేటర్ మార్చే క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగానే కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేశారు. -
వరంగల్‌లో అదృశ్యం.. కశ్మీర్లో ప్రత్యక్షం
నర్సంపేట రూరల్: మతిస్థిమితం లేని కుటుంబ పెద్ద తప్పిపోయి.. 13 ఏళ్ల తర్వాత ఇంటికి చేరడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేవు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కీర్తి మల్లయ్య, శాంతమ్మ దంపతులకు కుమారుడు యాకయ్య, కుమార్తె ఉన్నారు. తండ్రి మల్లయ్యకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కొడుకు యాకయ్య వరంగల్ ఎంజీఎంలో చికిత్స చేయించేవాడు. ఈ క్రమంలో 2007 ఎండాకాలంలో పరీక్షల నిమిత్తం కొడుకుతో కలసి ఎంజీఎంకు వెళ్లిన మల్లయ్య అక్కడ తప్పిపోయాడు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతకని ప్రదేశం లేదు. ఎన్నిచోట్ల వాకబు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరాడిలా.. గత నెల 25న జమ్మూ, కశ్మీర్లో మల్లయ్య తిరుగుతూ కనిపించడంతో సీఆర్పీఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని నర్సంపేట వాసిగా గుర్తించి క్యాంప్‌లో ఉన్న తెలంగాణ సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు తెలంగాణ రిటైర్డ్ సెంట్రల్ పారామిలటరీ ఫోర్సెస్ వెల్ఫేర్ ఫౌండేషన్‌కు సమాచారం అందించారు. స్థానిక పోలీçసుల సహాయంతో మల్లయ్యను కుటుంబ సభ్యులతో వీడియోకాల్ ద్వారా మాట్లాడించడంతో అతడిని గుర్తు పట్టారు. ఈనెల 9న జమ్మూలో ఫౌండేషన్ ప్రతినిధులకు మల్లయ్యను అప్పగించడంతో శనివారం రాత్రి స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఆదివారం ఫౌండేషన్ అధ్యక్షుడు మావురం సత్యనారాయణరెడ్డి, నర్సంపేట ఎస్సై యుగేందర్, మల్లయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోషల్ మీడియాలో ఫొటో పంపించాం.. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, మల్లయ్యను కుటుంబ సభ్యులు గుర్తించడంతో సోషల్ మీడియాలో ఫొటో పంపించామని, దాంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు మల్లయ్యను అప్పగించారని తెలిపారు. కాగా తండ్రిని తమకు అప్పగించిన సీఆర్‌పీఎçఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు, నర్సంపేట పోలీసులు, ఫౌండేషన్ బృందానికి యాకయ్య కృతజ్ఞతలు తెలిపాడు. -
వన్నె తెచ్చిన ‘శిశు సంజీవని’
ఎన్ఎన్ఎఫ్ సర్టిఫికెట్ అందుకున్న ఎంజీఎం అధికారులు నవజాత శిశువులకు మెరుగుపడనున్న సేవలు ఎంజీఎం(వరంగల్) : వరంగల్‌లోని మహత్మాగాంధీ మెమోరియల్(ఎంజీఎం) ఆస్పత్రి పిల్లల విభాగం వైద్యులు రెండేళ్ల పాటు పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఎంజీఎం ఆస్పత్రిలోని పీడియాట్రీక్ విభాగానికి ప్రతిష్టాత్మకమైన నేషనల్ నియోనాటాలజీ ఫోరం(ఎన్ఎన్ఎఫ్) సర్టిఫికెట్ మంజూ రైంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ఎన్ఎఫ్ సర్టిఫికెట్ పొందిన మొట్టమొదటి ఆస్పత్రిగా ఎంజీఎం అరుదైన గుర్తింపు దక్కిం చుకుంది. ఎన్ఎన్ఎఫ్ అధ్యక్షులు అజయ్ గంభీర్, కార్యదర్శి సునీల్ మహేందీరత మంజూరు చేసిన సర్టిఫికెట్‌ను మంగళవారం పీడియాట్రిక్ విభాగాధిపతి బలరాంకు డీఎంఈ రమణి, యూనిసెఫ్ ప్రతినిధులు అందించారు. సందర్శించిన ఎన్ఎన్ఎఫ్ ప్రతినిధి ఎన్ఎన్ఎఫ్ సర్టిఫికేషన్ కోసం ఎంజీఎం నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించాలని ఢిల్లీకి చెందిన ఎన్ఎన్ఎఫ్ బృందాన్ని కోరగా ఆగస్టు 10వ తేదీన ఒరిస్సాకు చెందిన ఎన్ఎన్ఎఫ్ ప్రతినిధిlడాక్టర్ అసితోష్ మహాపాత్ర ఎస్ఎన్సీయూ(నవజాత శిశుసంరక్షణ కేంద్రం)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో శిశువులకు అందుతున్న వైద్యసేవలతో పాటు అత్యాధునిక పరికరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు తమ నివేదికను ఢిల్లీ బృందానికి అందజేయగా ఎన్ఎన్ఎఫ్ సర్టిఫికెట్ అందజేశారు. నాలుగు జిల్లాలకు పెద్దదిక్కుగా... నాలుగు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించడంతో ఎంజీఎం ఆస్పత్రి పెద్దదిక్కుగా నిలుస్తోంది. ఈ ఆస్పత్రిలో శిశు మరణాలు నివారించేందుకు నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 2011లో ప్రతిపాదనలు పంపించారు. దీంతో 2012 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఎంజీఎం ఆస్పత్రికి నవజాత శిశు సంరక్షణ కేంద్రం(ఎస్ఎన్సీయూ)ను మం జూరు చేసింది. ఈ మేరకు 14 మంది స్టాఫ్ నర్సులు, నలుగురు మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ అటెండర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు సెక్యూరిటీ, నలుగురి సపోర్టింగ్ స్టాఫ్‌ను అం దిస్తూ 20 పడకలతో అనుమతి ఇచ్చింది. ఇం దులో ఇరవై వార్మర్లు, పది వెంటిలేటర్లు, ఏడు సిపాక్ మిషన్లతో 24 గంటల పాటు శిశువులకు వైద్య చికిత్స అందిస్తూ ఏడాది కాలంలో ఐదు వేలకు పైగా శిశువులను సురక్షితంగా తల్లుల ఒడికి చేర్చారు. ఈవిధంగా అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. ఆధునిక పరికరాలు 2012లో ఆక్సిజన్ అందక పెద్ద ఎత్తున శిశుమరణాలు సంభవించిన క్రమంలో ఎంజీఎం పిడియాట్రిక్ విభాగంలో పది వెంటిలైటర్లను అం దుబాటులోకి తీసుకవచ్చారు. పుట్టగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడే చిన్నారులకు ఈ వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందజేస్తారు. ఇదే వెంటిలేటర్ల ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం రోజుకు రూ. 12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో వెంటిలేటర్లతో పాటు సిపాక్, వార్మర్లతో కలిపి అత్యాధునిక పరికరాలు ఎంజీఎంలో ఉండడంతో పైసా ఖర్చు లేకుండా పేదలకు ఉచితంగా వైద్యచికిత అందుతోంది. ఇదేకాకుండా నెలలు నిండకుం డా తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో ఊపిరి తిత్తుల్లో సమస్య తలెత్తుతుంది. అలాంటి సమయాల్లో వెంటనే శిశువుకు వెంటిలైటర్లతో పాటు సిపాక్ పరికరాలను ఉపయోగించి కృతిమ శ్వాస అందించాల్సి ఉంటుంది. ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణకేంద్రానికి కరీంనగర్‌తో పాటు సీకేఎం, జీహెచ్ఎం ఆస్పత్రుల్లో సంరక్షణ కేంద్రాలు ఉన్నప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్న శిశువులను ఎంజీఎంకే తరలిస్తుంటారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో 20 పడకలు(వార్మర్లు) ఉన్నప్పటికీ ఒక్కో వార్మర్పై ఇద్దరు, ముగ్గురు చొప్పున 70 మందికి వైద్య చికిత్స అందిస్తున్నారు.