Warangal Municipal Corporation of Greater
-
మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు
సాక్షి, వరంగల్(వరంగల్) : స్వచ్ఛభారత్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వెల్లడించారు. వరంగల్ నగరంలో శనివారం జపాన్ బృందం పర్యటించింది. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలోని షీ టాయిలెట్ నిర్వహణ, విధానాన్ని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారిపేటలోని మానవ మల, మూత్ర వ్యర్థాల ప్లాంట్‌ను సందర్శించారు. వ్యర్థాల శుద్దీకరణ, తదుపరి నీరు మొక్కలకు సద్వినియోగం, ఎరువు మొక్కల సంరక్షణకు వాడుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రెండు పద్దతుల్లో ఫీకల్ ఎరువుగా మార్చడం జరుగుతుందని ఆస్కీ డైరెక్టర్ శ్రీనివాసాచారి వెల్లడించారు. ఈ ప్రక్రియను జపాన్ ప్రతినిధి తన కెమెరాలో చిత్రాలను బంధించారు. అనంతరం హన్మకొండ ఫారెస్టు కార్యాలయానికి సమీపంలోని పబ్లిక్ టాయిలెట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్కీ ప్రతినిధులు రాజమోహన్‌రెడ్డి, ప్రొఫెసర్ సుబ్రమణ్యం, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. మేయర్‌తో జపాన్ ప్రతినిధి భేటీ.. సంపూర్ణ పారిశుద్ధ్యంతో మెరుగైన సమాజం సిద్ధి్దస్తుందని వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు తెలిపారు. మేయర్‌ను తన క్యాంపు కార్యాలయంలో జపాన్ ప్రతినిధులు కజుషి హషిముటో, డాక్టర్ సీతారాం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ జపాన్ ప్రతినిధులకు పారిశుద్ధ్య నిర్వహణ, ఆధునిక పద్దతులు, వ్యర్థ నీటి సమర్థ నిర్వహణ నగర పరిస్థితులకు అనుగుణంగా చేపడుతున్న వివరాలను వెల్లడించారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వారు ప్రపంచంలో 8 నగరాలను ఎంపిక చేయగా, అందులో వరంగల్ ఒకటని తెలిపారు. చెత్త, మానవవ్యర్థాలు, కలుషిత నీరు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయో అక్కడే శుద్ధి చేసే ప్రక్రియ ఉపయోగకరమన్నారు. పెద్దపెద్ద హోటళ్లలో, వాణిజ్య సముదాయాల్లో అవలంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించిన పరికరాలను జపాన్ నుంచి దిగుమతి చేసి తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటుచేస్తే ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని మేయర్ తెలిపారు. భేటీలో ఆస్కీ, ఎంహెచ్ఓ రాజారెడ్డి, డీఈ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌తో సమావేశం.. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సలహా, ఆస్కీ ఆహ్వానం మేరకు వ్యర్థ నీటి నిర్వహణ, వికేంద్రీకరణ, చెరువుల అభివృద్ధిపై సలహాలు ఇచ్చేందుకు జపాన్ ప్రతినిధి మెస్సర్స్ యబియో ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్, అంతర్జాతీయ శాఖ సలహాదారుడు కజుషి హషిమోటో, ఏషియాన్ డెవలప్మెంట్ బ్యాంక్, టోక్యో , జపాన్ నుంచి డాక్టర్ సీతారాం జికలెక్టర్ ప్రశాంత్ జీవన్ ప్రాటిల్ను కలిశారు. కలెక్టర్ పారిశుద్ధ్య మెరుగుకు చేపడుతున్న అంశాలను కలెక్టర్ వివరించారు.అమ్మవారిపేటలోని మల, మూత్ర వ్యర్థాల ప్లాంట్‌ను పరిశీలిస్తున్న జపాన్ ప్రతినిధి, ఆస్కీ సిబ్బంది. -
లే ఔట్
సామాజిక స్థలాలు మాయం పాత లే అవుట్ల పరిశీలన 684 లే అవుట్లకు అనుమతి 163 చోట్ల ఖాళీ స్థలాలు లభ్యం 200 ఎకరాలకు పైగా కనుమరుగు హన్మకొండ : సామాజిక అవసరాల కోసం లే అవుట్లలో కేటాయించాల్సిన ఖాళీ స్థలాలు కబ్జా అయ్యూరుు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు రెండు వందలకు పైగా స్థలాలు మాయమయ్యాయి. సుమారు 200 ఎకరాలు అన్యాక్రాంతమయ్యూరుు. నగరంలో కొత్తగా మార్కెట్లు, క్రీడాస్థలాలు నిర్మించేందుకు ఖాళీ స్థలాలను గుర్తించేందుకు చేపట్టిన కసరత్తులో ఈ నిజాలు వెలుగుచూశారుు. జనవరిలో నాలుగు రోజుల పర్యటన సందర్భంగా వరంగల్ నగరంలో ఖాళీగా ఉన్న స్థలాల వివరాలు అంగుళంతో సహా సేకరించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. ఇళ్ల నిర్మాణాలకు లే అవుట్ల అనుమతి పొందే ముందు ఇల్లు, రోడ్లు మినహాయించి పది శాతం స్థలాన్ని పార్కు, కమ్యూనిటీ హాలు, సామాజిక అవసరాలకు కేటాయించాలి. ఈ నిబంధనలు పాటిస్తూ రూపొందిం చిన లే అవుట్లలోనే నిర్మాణాలకు అనుమతిస్తారు. నగరంలో ఖాళీ ప్రదేశాల గుర్తింపు పనిలో భాగంగా 1940లో ఉన్న వరంగల్ మునిసిపాలిటీ లే అవుట్లు, ఆ తర్వాత ఏర్పడిన కాకతీయ ప్ట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు సంబంధించి 1982 నుంచి వచ్చిన లే అవుట్లతోపాటు డెరైక్టర్ ఆఫ్ టౌన్, కంట్రీ ప్లానింగ్‌ల వద్ద ఉన్న రికార్డులను నెలరోజుల నుంచి పరిశీలిస్తున్నారు. ఈ మూడు రకాలైన రికార్డులను పరిశీలించగా... నగరంలో దాదాపు 684 లే అవుట్లకు అనుమతి ఇచ్చినట్లుగా తేలింది. సరిగా ఉన్నవి 163 మాత్రమే.. ప్రాథమిక అంచనాల ప్రకారం నగరంలో 684 లే అవుట్లలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లుగా తేలింది. కానీ... ప్రస్తుతం అందుబాటులో ఉన్న రికార్డులను జీపీఎస్ ద్వారా పరిశీలించగా కేవలం 163 లే అవుట్లలోనే సామాజిక అవసరాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన లే అవుట్లలో కొత్తగా నిర్మాణాలు వెలిశాయి. మొదటగా లే అవుట్లో పది శాతం ఖాళీ స్థలాలు చూపించి నిర్మాణాలకు అనుమతులు పొందిన వెంచర్ డెవలపర్లు, బిల్డర్లు.. ఆ తర్వాత కాలంలో నిబంధనలు తుంగలో తొక్కారు. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టి జేబులు నింపుకున్నారు. ఇవన్నీ కార్పొరేషన్ అధికారుల కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 684 లే అవుట్లలో కేవలం 163 లేఅవుట్లలోనే ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నట్లుగా తేలింది. కనుమరుగైన స్థలం దాదాపు 200 ఎకరాలకు పైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. సర్ఫరాజ్ ఏం చేస్తారో? కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి, పారిశుద్ధ్యం వంటి కీలక విభాగాల్లో కొంత కాలంగా స్తబ్ధత వాతావరణం నెలకొంది. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. నగరంలో కొత్తగా అత్యుత్తమ ప్రమాణాలతో కూరగాయలు, పూలు, పండ్ల మార్కెట్లు నిర్మించాలన్నా, క్రీడాస్థలాలను అందుబాటులోకి తేవాలన్నా ఖాళీ స్థలాల గుర్తింపు ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో కొత్తగా వెలిసిన నిర్మాణాల విషయంలో కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.