సాక్షి, వరంగల్(వరంగల్) : స్వచ్ఛభారత్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వెల్లడించారు. వరంగల్ నగరంలో శనివారం జపాన్ బృందం పర్యటించింది. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలోని షీ టాయిలెట్ నిర్వహణ, విధానాన్ని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారిపేటలోని మానవ మల, మూత్ర వ్యర్థాల ప్లాంట్‌ను సందర్శించారు. వ్యర్థాల శుద్దీకరణ, తదుపరి నీరు మొక్కలకు సద్వినియోగం, ఎరువు మొక్కల సంరక్షణకు వాడుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రెండు పద్దతుల్లో ఫీకల్ ఎరువుగా మార్చడం జరుగుతుందని ఆస్కీ డైరెక్టర్ శ్రీనివాసాచారి వెల్లడించారు. ఈ ప్రక్రియను జపాన్ ప్రతినిధి తన కెమెరాలో చిత్రాలను బంధించారు. అనంతరం హన్మకొండ ఫారెస్టు కార్యాలయానికి సమీపంలోని పబ్లిక్ టాయిలెట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్కీ ప్రతినిధులు రాజమోహన్‌రెడ్డి, ప్రొఫెసర్ సుబ్రమణ్యం, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
మేయర్‌తో జపాన్ ప్రతినిధి భేటీ..
సంపూర్ణ పారిశుద్ధ్యంతో మెరుగైన సమాజం సిద్ధి్దస్తుందని వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు తెలిపారు. మేయర్‌ను తన క్యాంపు కార్యాలయంలో జపాన్ ప్రతినిధులు కజుషి హషిముటో, డాక్టర్ సీతారాం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ జపాన్ ప్రతినిధులకు పారిశుద్ధ్య నిర్వహణ, ఆధునిక పద్దతులు, వ్యర్థ నీటి సమర్థ నిర్వహణ నగర పరిస్థితులకు అనుగుణంగా చేపడుతున్న వివరాలను వెల్లడించారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వారు ప్రపంచంలో 8 నగరాలను ఎంపిక చేయగా, అందులో వరంగల్ ఒకటని తెలిపారు. చెత్త, మానవవ్యర్థాలు, కలుషిత నీరు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయో అక్కడే శుద్ధి చేసే ప్రక్రియ ఉపయోగకరమన్నారు. పెద్దపెద్ద హోటళ్లలో, వాణిజ్య సముదాయాల్లో అవలంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించిన పరికరాలను జపాన్ నుంచి దిగుమతి చేసి తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటుచేస్తే ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని మేయర్ తెలిపారు. భేటీలో ఆస్కీ, ఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డీఈ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌తో సమావేశం..
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సలహా, ఆస్కీ ఆహ్వానం మేరకు వ్యర్థ నీటి నిర్వహణ, వికేంద్రీకరణ, చెరువుల అభివృద్ధిపై సలహాలు ఇచ్చేందుకు జపాన్ ప్రతినిధి మెస్సర్స్ యబియో ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్, అంతర్జాతీయ శాఖ సలహాదారుడు కజుషి హషిమోటో, ఏషియాన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, టోక్యో , జపాన్ నుంచి డాక్టర్ సీతారాం జికలెక్టర్ ప్రశాంత్ జీవన్ ప్రాటిల్‌ను కలిశారు. కలెక్టర్ పారిశుద్ధ్య మెరుగుకు చేపడుతున్న అంశాలను కలెక్టర్ వివరించారు.అమ్మవారిపేటలోని మల, మూత్ర వ్యర్థాల ప్లాంట్‌ను పరిశీలిస్తున్న జపాన్ ప్రతినిధి, ఆస్కీ సిబ్బంది.
Comments
Please login to add a commentAdd a comment