Administrative Staff College of India
-
రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేయగలగాలి
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ రంగం ఆత్మ నిర్భరత కోసం ‘రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో)’ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని సంస్థ డైరెక్టర్ జి.సతీశ్‌రెడ్డి చెప్పారు. రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం కాకుండా.. ఎగుమతి చేసే స్థితికి రావాలని దేశం మొత్తం కోరుకుంటోందని పేర్కొన్నారు. ఇం దుకు రేపటితరం టెక్నాలజీలను చౌకగా, అత్యంత నాణ్యతతో అభివృద్ధి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. గురువారం ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి)’ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రసంగించారు. సంక్లిష్టమైన, కీలకమైన ఆయుధ వ్యవస్థ లను, టెక్నాలజీలను అభివృద్ధి చేయడంపై డీఆర్డీవో దృష్టి పెట్టిందని సతీశ్‌రెడ్డి చెప్పారు. త్వరలోనే భారత్ రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ దేశమైనా రక్షణ అవసరాలకు సంబంధించి కేవలం క్షిపణులు, ఆయుధాలకు మాత్రమే పరిమితం కాలేదని.. ఆహా రం మొదలుకొని దుస్తుల వరకూ అన్నింటినీ అభివృద్ధి చేయాల్సి ఉంటుం దని స్పష్టం చేశారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘ఆకాశ్’క్షిపణిని ఇప్పటికే రక్షణ దళాలకు అందించగలిగామని, బీడీఎల్ దాదాపు 30 వేల కోట్ల రూపాయల ఆర్డర్లను తయారు చేస్తోందని చెప్పారు. ధ్వనికంటే ఎక్కువ వేగంతో దూసువెళ్లే బ్రహ్మోస్ క్షిపణిలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలన్నింటినీ భారత్‌లోనే తయారు చేశామని చెప్పారు. ప్రపంచంలోనే దీర్ఘశ్రేణి కలిగిన తుపాకీ (అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్)ను కూడా అభివృద్ధి చేయగలిగామని సతీశ్‌రెడ్డి వివరించారు. దేశంలో దాదాపు 14 వేల ప్రైవేట్ కంపెనీలు, మూడు వందల విద్యా సంస్థలు, అంతర్జాతీయ స్థాయిలో 30 దేశాలు డీఆర్డీవోతో కలిసి పనిచేస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో ఆస్కి చైర్మన్ కే.పద్మనాభయ్య తదితరులు పాల్గొన్నారు. -
సమర్థ అధికారుల వల్లే.. ప్రజలకు అభివృద్ధిఫలాలు
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో మానవ వనరులకు, ప్రతిభకు కొరతలేదని.. వీటికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వ విధివి ధానాలను సమర్థవంతంగా అమలుచేసేలా అధికారులు పని చేసినప్పుడే ప్రజలకు అభివృద్ధి ఫలాలు దక్కుతాయన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆస్కి’(అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)లో శనివారం సంస్థ చైర్మన్, డైరెక్టర్ బోర్డు సభ్యులు, సెక్రటరీ జనరల్, బోధనా సిబ్బందితో జరిగిన చర్చాగోష్టిలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, కుల,మత, లింగ వివక్ష వంటి అడ్డంకులను దాటుకుని ముందుకెళ్తేనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలమని అభిప్రాయపడ్డారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను నేర్చుకుని అమలుచేసేందు కు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందన్నారు. అధికారులకు శిక్ష ణనిచ్చి ప్రజాసేవల వ్యవస్థను పకడ్బందీగా మార్చడంలో ‘ఆస్కి’వంటి సంస్థలు కృషిచేయాలన్నారు. స్వచ్ఛభారత్, బేటీ బచావో–బేటీ పడావో–బేటీ బడావ్, జన్ ధన్ యోజన వంటి కార్యక్రమా లు విజయవంతం కావడానికి అవి ప్రజా ఉద్యమాలుగా మారడ మే కారణమన్నారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి ‘ఆస్కి’లోని వివిధ విభాగాలను సందర్శించారు. శిక్షణార్థులతో ముఖాముఖి మాట్లాడారు. చైర్మన్ పద్మనాభయ్య అధ్యక్షతన జరిగిన సమా వేశంలో వివిధ విభాగాల అధిపతులు తమ విభాగాల ద్వారా జరుగుతున్న అధ్యయనాలు, శిక్షణలను ఉపరాష్ట్రపతికి వివరించా రు. ఈ సందర్భంగా ‘ఆస్కి’పనితీరును, శిక్షణ సామర్థ్యాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఆస్కిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ప్రాజెక్టు వర్క్ గురించి వివరిస్తున్న ప్రొఫెసర్లు -
మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు
సాక్షి, వరంగల్(వరంగల్) : స్వచ్ఛభారత్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వెల్లడించారు. వరంగల్ నగరంలో శనివారం జపాన్ బృందం పర్యటించింది. గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలోని షీ టాయిలెట్ నిర్వహణ, విధానాన్ని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ) ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారిపేటలోని మానవ మల, మూత్ర వ్యర్థాల ప్లాంట్‌ను సందర్శించారు. వ్యర్థాల శుద్దీకరణ, తదుపరి నీరు మొక్కలకు సద్వినియోగం, ఎరువు మొక్కల సంరక్షణకు వాడుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రెండు పద్దతుల్లో ఫీకల్ ఎరువుగా మార్చడం జరుగుతుందని ఆస్కీ డైరెక్టర్ శ్రీనివాసాచారి వెల్లడించారు. ఈ ప్రక్రియను జపాన్ ప్రతినిధి తన కెమెరాలో చిత్రాలను బంధించారు. అనంతరం హన్మకొండ ఫారెస్టు కార్యాలయానికి సమీపంలోని పబ్లిక్ టాయిలెట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్కీ ప్రతినిధులు రాజమోహన్‌రెడ్డి, ప్రొఫెసర్ సుబ్రమణ్యం, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. మేయర్‌తో జపాన్ ప్రతినిధి భేటీ.. సంపూర్ణ పారిశుద్ధ్యంతో మెరుగైన సమాజం సిద్ధి్దస్తుందని వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు తెలిపారు. మేయర్‌ను తన క్యాంపు కార్యాలయంలో జపాన్ ప్రతినిధులు కజుషి హషిముటో, డాక్టర్ సీతారాం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్ జపాన్ ప్రతినిధులకు పారిశుద్ధ్య నిర్వహణ, ఆధునిక పద్దతులు, వ్యర్థ నీటి సమర్థ నిర్వహణ నగర పరిస్థితులకు అనుగుణంగా చేపడుతున్న వివరాలను వెల్లడించారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వారు ప్రపంచంలో 8 నగరాలను ఎంపిక చేయగా, అందులో వరంగల్ ఒకటని తెలిపారు. చెత్త, మానవవ్యర్థాలు, కలుషిత నీరు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయో అక్కడే శుద్ధి చేసే ప్రక్రియ ఉపయోగకరమన్నారు. పెద్దపెద్ద హోటళ్లలో, వాణిజ్య సముదాయాల్లో అవలంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించిన పరికరాలను జపాన్ నుంచి దిగుమతి చేసి తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటుచేస్తే ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని మేయర్ తెలిపారు. భేటీలో ఆస్కీ, ఎంహెచ్ఓ రాజారెడ్డి, డీఈ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌తో సమావేశం.. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సలహా, ఆస్కీ ఆహ్వానం మేరకు వ్యర్థ నీటి నిర్వహణ, వికేంద్రీకరణ, చెరువుల అభివృద్ధిపై సలహాలు ఇచ్చేందుకు జపాన్ ప్రతినిధి మెస్సర్స్ యబియో ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్, అంతర్జాతీయ శాఖ సలహాదారుడు కజుషి హషిమోటో, ఏషియాన్ డెవలప్మెంట్ బ్యాంక్, టోక్యో , జపాన్ నుంచి డాక్టర్ సీతారాం జికలెక్టర్ ప్రశాంత్ జీవన్ ప్రాటిల్ను కలిశారు. కలెక్టర్ పారిశుద్ధ్య మెరుగుకు చేపడుతున్న అంశాలను కలెక్టర్ వివరించారు.అమ్మవారిపేటలోని మల, మూత్ర వ్యర్థాల ప్లాంట్‌ను పరిశీలిస్తున్న జపాన్ ప్రతినిధి, ఆస్కీ సిబ్బంది. -
మౌలిక వసతుల అధ్యయనానికి కమిటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన సలహా కమిటీని నియమించింది. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రాజధాని నిర్మాణం పై ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అన్ని విభాగాల్లోని నిపుణుల సలహాలు, సూచనలను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)కి అప్పగించింది. కమిటీ విధివిధానాలను, మార్గదర్శకాలను ఆస్కీ సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ(ఇన్‌క్యాప్) సమగ్ర వివరాలతో ఓ డ్రాప్ట్‌ను రూపొం దించి ప్రభుత్వానికి అందిస్తుంది. రాజధాని ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య, సమాచార వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలనేదానిపై సూచనలిస్తుంది. మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ డి. సాంబశివరావు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేశారు. కమిటీలో ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య, న్యాయ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇన్‌క్యాప్ ఎండీ, ఏపీఐఐసీ ఎండీ కూడా సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆరు నెలల్లో పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. -
పాశ్చాత్య ‘స్మార్ట్ సిటీ’లను అనుకరించలేం
స్మార్ట్ సిటీలపై నిర్వహించిన సదస్సులో మంత్రి కేటీఆర్ హైదరాబాద్: పాశ్చాత్య దేశాల్లోని స్మార్ట్ సిటీలను అనుకరిస్తూ ఇక్కడి నగరాలను నూటికి నూరుపాళ్లు వాటిలాగే మార్చివేయలేమని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అభిప్రాయపడ్డారు. స్మార్ట్ సిటీలు అంటే ఎత్తైన భవనాలు, విశాలమైన రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు మాత్రమే కాదని, అది పూర్తిగా స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణరుుంచాల్సిన అంశమని అన్నారు. సంసృ్కతి, సంప్రదాయాలు, ఆచారవ్యవహారల పరంగా భిన్నమైన పరిస్థితులున్న దేశం కావడంతో ఇక్కడ స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగానే స్మార్టు సిటీల కార్యాచరణ ఉండాలని ఆయున అభిప్రాయుపడ్డారు. ‘స్మార్ట్ నగరాలుగా భారత పట్టణాలను రూపాంతరీకరించడం’ అనే అంశంపై మెట్రోపోలీస్, జీహెచ్ఎంసీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) ఆధ్వర్యంలో ఏఎస్సీఐ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం సదస్సును నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, ప్రత్యేక కమిషనర్ ఎ.బాబు, ఏఎస్సీఐ డీన్ శ్రీనివాస్ చారితో పాటు మైక్రోసాఫ్ట్, ఎయిర్టెల్, సాఫ్ట్‌టెక్, గిఫ్ట్ కంపెనీల సాంకేతిక నిపుణులు పాల్గొన్న ఈ సదస్సుకు మంత్రి కె.తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయున వూట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించి ప్రజల జీవన ప్రమాణాలు, సేవల్లో నాణ్యత పెంపొందించడమే స్మార్టు సిటీల ఉద్దేశం కావాలన్నారు. పట్టణ ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యా, వైద్య సేవలు, పర్యావరణ పరిరక్షణ, రక్షణ అందించడం సవాలుగా మారిందన్నారు. ఐటీ సాయంతో అన్ని రకాల సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చి, మౌలిక సౌకర్యాలతో నగరాలు, పట్టణాలను స్మార్టు సిటీలుగా అభివృద్ధిపరచడం అవసరమన్నారు. ఉపాధిని నీరుగార్చవద్దు: గడ్కరీకి లేఖ సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.వెనుక బడిన మండలాలకే ఈ పథకాన్ని పరిమితం చేయనుందని వచ్చిన వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌గడ్కరీకి శుక్రవారం లేఖ రాశారు. ఈ వార్తలు నిజమైతే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఉపాధిహామీ పథకంలో మార్పులు చేసే ముందు తెలంగాణలో పథకం అమలు జరుగుతున్న తీరును పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని 443 మండలాల్లో, 8880 గ్రామపంచాయతీల్లో పథకం అమలువుతోందని, గతేడాది 8.39 కోట్ల పనిదినాలలో 1.06 లక్షల కుటుంబాలు 100 రోజుల ఉపాధి పొందారని మంత్రి తెలిపారు. -
ప్రవేశాలు: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ), హైదరాబాద్ కింది కోర్సులో ప్రవేశానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (పీజీడీహెచ్ఎం) అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. మ్యాట్/సీమ్యాట్/క్యాట్/జీమ్యాట్/గ్జాట్/ఏటీఎంఏ పరీక్షలో అర్హత స్కోరు కలిగి ఉండాలి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: మే 11 వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. చిరునామా: ఏఎస్సీఐ, రోడ్ నెం 3, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34 వెబ్సైట్: www.asci.crg.in మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు.