పాశ్చాత్య ‘స్మార్ట్ సిటీ’లను అనుకరించలేం
స్మార్ట్ సిటీలపై నిర్వహించిన సదస్సులో మంత్రి కేటీఆర్
హైదరాబాద్: పాశ్చాత్య దేశాల్లోని స్మార్ట్ సిటీలను అనుకరిస్తూ ఇక్కడి నగరాలను నూటికి నూరుపాళ్లు వాటిలాగే మార్చివేయలేమని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అభిప్రాయపడ్డారు. స్మార్ట్ సిటీలు అంటే ఎత్తైన భవనాలు, విశాలమైన రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు మాత్రమే కాదని, అది పూర్తిగా స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణరుుంచాల్సిన అంశమని అన్నారు. సంసృ్కతి, సంప్రదాయాలు, ఆచారవ్యవహారల పరంగా భిన్నమైన పరిస్థితులున్న దేశం కావడంతో ఇక్కడ స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగానే స్మార్టు సిటీల కార్యాచరణ ఉండాలని ఆయున అభిప్రాయుపడ్డారు. ‘స్మార్ట్ నగరాలుగా భారత పట్టణాలను రూపాంతరీకరించడం’ అనే అంశంపై మెట్రోపోలీస్, జీహెచ్‌ఎంసీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) ఆధ్వర్యంలో ఏఎస్‌సీఐ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం సదస్సును నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, ప్రత్యేక కమిషనర్ ఎ.బాబు, ఏఎస్‌సీఐ డీన్ శ్రీనివాస్ చారితో పాటు మైక్రోసాఫ్ట్, ఎయిర్‌టెల్, సాఫ్ట్‌టెక్, గిఫ్ట్ కంపెనీల సాంకేతిక నిపుణులు పాల్గొన్న ఈ సదస్సుకు మంత్రి కె.తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయున వూట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించి ప్రజల జీవన ప్రమాణాలు, సేవల్లో నాణ్యత పెంపొందించడమే స్మార్టు సిటీల ఉద్దేశం కావాలన్నారు. పట్టణ ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యా, వైద్య సేవలు, పర్యావరణ పరిరక్షణ, రక్షణ అందించడం సవాలుగా మారిందన్నారు. ఐటీ సాయంతో అన్ని రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చి, మౌలిక సౌకర్యాలతో నగరాలు, పట్టణాలను స్మార్టు సిటీలుగా అభివృద్ధిపరచడం అవసరమన్నారు.
ఉపాధిని నీరుగార్చవద్దు: గడ్కరీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.వెనుక బడిన మండలాలకే ఈ పథకాన్ని పరిమితం చేయనుందని వచ్చిన వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌గడ్కరీకి శుక్రవారం లేఖ రాశారు. ఈ వార్తలు నిజమైతే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఉపాధిహామీ పథకంలో మార్పులు చేసే ముందు తెలంగాణలో పథకం అమలు జరుగుతున్న తీరును పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని 443 మండలాల్లో, 8880 గ్రామపంచాయతీల్లో పథకం అమలువుతోందని, గతేడాది 8.39 కోట్ల పనిదినాలలో 1.06 లక్షల కుటుంబాలు 100 రోజుల ఉపాధి పొందారని మంత్రి తెలిపారు.