
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో మానవ వనరులకు, ప్రతిభకు కొరతలేదని.. వీటికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వ విధివి ధానాలను సమర్థవంతంగా అమలుచేసేలా అధికారులు పని చేసినప్పుడే ప్రజలకు అభివృద్ధి ఫలాలు దక్కుతాయన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆస్కి’(అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)లో శనివారం సంస్థ చైర్మన్, డైరెక్టర్ బోర్డు సభ్యులు, సెక్రటరీ జనరల్, బోధనా సిబ్బందితో జరిగిన చర్చాగోష్టిలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, కుల,మత, లింగ వివక్ష వంటి అడ్డంకులను దాటుకుని ముందుకెళ్తేనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలమని అభిప్రాయపడ్డారు.
భారత సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను నేర్చుకుని అమలుచేసేందు కు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందన్నారు. అధికారులకు శిక్ష ణనిచ్చి ప్రజాసేవల వ్యవస్థను పకడ్బందీగా మార్చడంలో ‘ఆస్కి’వంటి సంస్థలు కృషిచేయాలన్నారు. స్వచ్ఛభారత్, బేటీ బచావో–బేటీ పడావో–బేటీ బడావ్, జన్ ధన్ యోజన వంటి కార్యక్రమా లు విజయవంతం కావడానికి అవి ప్రజా ఉద్యమాలుగా మారడ మే కారణమన్నారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి ‘ఆస్కి’లోని వివిధ విభాగాలను సందర్శించారు. శిక్షణార్థులతో ముఖాముఖి మాట్లాడారు. చైర్మన్ పద్మనాభయ్య అధ్యక్షతన జరిగిన సమా వేశంలో వివిధ విభాగాల అధిపతులు తమ విభాగాల ద్వారా జరుగుతున్న అధ్యయనాలు, శిక్షణలను ఉపరాష్ట్రపతికి వివరించా రు. ఈ సందర్భంగా ‘ఆస్కి’పనితీరును, శిక్షణ సామర్థ్యాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు.
ఆస్కిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ప్రాజెక్టు వర్క్ గురించి వివరిస్తున్న ప్రొఫెసర్లు