warning to india
-
చైనా దూకుడు.. భారత్‌కు పొంచి ఉన్న పెను ముప్పు!
డ్రాగన్ కంట్రీ చైనా.. ఎప్పుడూ భారత్ విషయంలో కవ్వింపులకు పాల్పడుతూనే ఉంటుంది. భారత సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. హియాలయాల పొడవునా చైనా నిర్మాణాలు చేపడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక, లడఖ్ సమీపంలో చైనా మరో వంతెన నిర్మిస్తున్న విషయం శాటిలైట్ ఫొటోల ద్వారా బహిర్గతమైంది. ఈ విషయాన్ని అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండింగ్ జనరల్‌గా ఉన్న ఛార్లెస్ ఏ ఫ్లిన్ తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా దూకుడు పట్ల భారత్‌ను ఆయన హెచ్చరించారు. లడఖ్‌లో జరుగుతున్న నిర్మాణాలు కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఉన్నట్లు ఆయన ఆరోపించారు. చాలా ఆందోళనకర రీతిలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చైనా వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన చార్లెస్.. చైనా తన మిలిటరీ వనరులు అన్నింటినీ పెంచుకుంటుందని అన్నారు. చైనా కదలికలు ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ఏమాత్రం ప్రయోజకరంకాదన్నారు. చైనా విధానాలు హిమాలయ సరిహద్దులో చాలా ఆందోళనకరీతిలో ఉన్నాయని తెలిపారు. వెస్ట్రన్ థియేటర్ కమాండ్ వాళ్లు నిర్మిస్తున్న కట్టడాలు ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో, చైనా చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫ్లిన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ అమెరికా సైనిక జనరల్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో సమావేశమయ్యారు. #China builds a defence infrastructure in #Ladakh to frighten India! @TheTechOutlook https://t.co/tAH8GgZxHQ — The Tech Outlook (@TheTechOutlook) June 8, 2022 ఇది కూడా చదవండి: ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్న శ్రీలంక... పొదుపు దిశగా అడుగులు -
10 సర్జికల్ దాడులతో బదులిస్తాం: పాక్
ఇస్లామాబాద్: భారత్ తమపై ఒక్క సర్జికల్ దాడి చేస్తే ప్రతీకారంగా తాము అటువంటి 10 దాడులు చేస్తామని పాక్ హెచ్చరించింది. పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ జావెద్ బజ్వాతోపాటు లండన్‌లో మీడియాతో మాట్లాడిన సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ఈ హెచ్చరికలు చేసినట్లు పాక్ రేడియో పేర్కొంది. ‘భారత్ చేసే ప్రతి సర్జికల్ స్ట్రైక్‌కు సమాధానంగా 10 దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాకు వ్యతిరేకంగా దుస్సాహసానికి పాల్పడాలనుకునే వారు, మా సామర్థ్యాన్ని గురించి సందేహ పడవద్దు’అంటూ వ్యాఖ్యానించారు. దాదాపు రూ.3లక్షల కోట్లతో చేపట్టే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) భారీ ప్రాజెక్టు సంరక్షణ బాధ్యతను సైన్యం తీసుకుంటుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడాన్ని సైన్యం కోరుకుంటోందని ఆ కథనంలో పాక్ రేడియో తెలిపింది. -
మాతో పెట్టుకోవాలంటే అమెరికాకు కూడా భయం!
దలైలామా కార్డును ఉపయోగించడం భారతదేశానికి అంత మంచిది కాదని చైనా అధికారిక మీడియా హెచ్చరించింది. చైనాతో పెట్టుకోవాలంటే అమెరికా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపింది. చైనా విధానాలను వ్యతిరేకించిన డోనాల్డ్ ట్రంప్ విషయంలో తాము ఎలా వ్యవహరించామో చూసి పాఠాలు నేర్చుకోవాలని, 'చెడిపోయిన పిల్లవాడి'లా ప్రవర్తించడం మానుకోవాలని తెలిపింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే కిరీటం చూసుకుని ఒక్కోసారి భారతదేశం చెడిపోయిన పిల్లాడిలా ప్రవర్తిస్తుందని, గొప్ప దేశంగా రూపొందే అవకాశం ఉన్నా.. ఆ దేశానికి దూరదృష్టి కొరవడిందని అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో రాసిన కథనంలో పేర్కొన్నారు. తైవాన్ విషయంలో ట్రంప్ -చైనాల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. తైవాన్ అద్యక్షుడికి ట్రంప్ ఫోన్ చేయడంపై చైనా నిరసన వ్యక్తం చేయడం, ఆయన వన్-చైనా విధానాన్ని ప్రశ్నించడం లాంటి చర్యలన్నింటినీ కూడా ఆ కథనంలో ప్రస్తావించారు. ఇక వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించిన అమెరికన్ అండర్ వాటర్ డ్రోన్‌ను చైనా స్వాధీనం చేసుకుని, దాన్ని పరిశీలించిన తర్వాత తిరిగి ఇవ్వడాన్ని కూడా చెప్పారు. సున్నితమైన విషయాలలో తమతో పెట్టుకోవాలంటే అమెరికా కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుందని, అలాంటప్పుడు తాము ఎలాగోలా నెగ్గుకు రాగలమని భారతదేశానికి అంత విశ్వాసం ఎక్కడినుంచి వచ్చిందని ఆ కథనంలో ప్రశ్నించారు. మంగోలియాకు భారతదేశం వంద కోట్ల డాలర్ల సాయం ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ఆ దేశం మీద చైనా ఆంక్షలు విధించిందని తెలిపారు. చైనా వద్దన్నా సరే దలైలామాకు ఆశ్రయం ఇవ్వడంతో ఆ ఆంక్షలు విధించారు. చైనా విధించిన ఆంక్షల నుంచి బయటపడేందుకు వీలుగా తమకు సాయం చేయాలని భారతదేశంలో మంగోలియా రాయబారి కోరారు. దాంతో భారత్ సాయం చేసింది. అయితే, దలైలామాను తాము ఇక మీదట ఎప్పుడూ ఆహ్వానించబోమని మంగోలియా ప్రభుత్వం స్పష్టం చేసింది.