warning phone calls
-
మహిళా డైరెక్టర్‌కు హత్యా బెదిరింపులు
పెరంబూరు: భారతీయ జనతా పార్టీ, పుదియతమిళగం పార్టీలకు చెందిన కొంతమంది తనను చంపుతామని బెదిరిస్తున్నారని లఘు చిత్ర దర్శకురాలు దివ్యభారతి ఆరోపించారు. మధురై, ఆణైయూర్‌కు చెందిన ఈమె లెనినిస్ట్ సంఘంలో పనిచేస్తున్నారు. 2009లో లా కాలేజీ విద్యార్థి సురేశ్ పాము కాటుకు గురై మృతి చెందాడు. అతనికి నష్టపరిహారం ఇవ్వాలని దివ్యభారతి మధురై ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పోరాటం చేసిన కేసులో గతవారం అరెస్టు అయ్యి అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం ఉదయం మాట్లాడుతూ కొన్ని రోజులుగా తనకు హత్యాబెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. విదేశాల నుంచి కూడా ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. తాను నిర్మించిన కక్కూస్ లఘు చిత్రాన్ని తప్పుగా అర్ధం చేసుకుని ఇలాంటి హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అయితే, వారు ఎవరనే విషయాన్ని ఆరా తీయగా బీజేపీ, పుదియ తమిళం పార్టీ నేత కృష్ణస్వామికి చెందిన వాళ్లమని చెబుతున్నారన్నారు. ఈ విషయాన్ని పోలీసులు తేల్చాలని కోరారు. అలాంటి వారికి కృష్ణస్వామి బుద్ది చెప్పాలన్నారు. కక్కూస్ చిత్రంపై కృష్ణస్వామి కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసిందని, ఆయన ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. పశుమాంసం ఇతి వృత్తంగా లఘు చిత్రాన్ని రూపొందింస్తున్నందుకే తనకు ఈ బెదిరింపులు వస్తున్నట్లు భావిస్తున్నానని చెప్పారు. -
అకున్‌కు బెదిరింపు కాల్స్.. ఆఫ్రికన్ భాషలో..
హైదరబాద్: రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారం అంతు తేల్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. డ్రగ్స్ విచారణ ఉన్నపలంగా నిలిపేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు కాల్ చేసి హెచ్చరికలు చేశారు. అకున్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ బెదిరించారు. ఇంటర్నెట్ ద్వారా అగంతుకుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన డ్రగ్స్ మాఫియా ముఠాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్ భాషలో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు వారం రోజులుగా కూడా ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంట. దీంతో డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ముఠా నెదర్లాండ్, ఐరోపాలోని పలు దేశాలు, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు కెల్విన్ ద్వారానే అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టమైంది. దీంతో డ్రగ్స్ మాఫియా తాజాగా చేసిన ఫోన్ కాల్స్‌పై ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఇప్పటి వరకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యామ్‌కే నాయుడు, నటుడు సుబ్బరాజును విచారించిన విషయం తెలిసిందే. సుబ్బరాజు విచారణ ఆధారణంగా తాజాగా మరో 15మంది సినీనటులకు నోటీసులు పంపించనున్నారు. నేడు (శనివారం) తరుణ్ విచారణ జరగనుంది. -
చంద్రబాబును విమర్శిస్తే చంపేస్తా
అనంతపురం : సీఎం చంద్రబాబు, కృష్ణయ్యలను విమర్శిస్తే హతమారుస్తానంటూ ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు బేరంగుల ఉదయ్‌కిరణ్‌కు ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో ఉదయ్‌కిరణ్ గుంతకల్లు పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.