అట్టముక్కలతో అందమైన బొమ్మలు
అమరావతి : ఎక్కడో రాజస్థాన్లోని అల్వాల్లో పుట్టిన అమర్ పనికి రాని అట్టముక్కలకు రంగులు వేసి అద్భుతమైన బొమ్మలుగా తీర్చిదిద్ది ఉపాధి పొందుతున్నాడు. తనలో ఉన్న సృజనాత్మకతను ఉపయోగించి నెమలి, ఈఫిల్ టవర్, పది అంతస్తుల భవనం, పొదరిల్లు వంటి ఎన్నో అద్భుతమైన బొమ్మలను తయారు చేసి నామమాత్రపు ధరకే పుష్కర యాత్రికులకు విక్రయిస్తున్నాడు.