water bandh
-
నేడు సగం సిటీకి నీరు బంద్
♦ ఆదివారం కొన్ని ప్రాంతాలకు... ♦ సోమవారం నాటికి పునరుద్ధరణ ♦ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకూ కష్టమే ♦ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ సాక్షి, సిటీబ్యూరో : కృష్ణా మూడో దశ ట్రయల్న్‌ల్రో భాగంగా సుమారు 45 మిలియన్ గ్యాలన్ల జలాలను ఫేజ్-1, 2 పైప్లైన్ల ద్వారా నగరం నలుమూలలకు సరఫరాచేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నగరంలోని వివిధ ప్రాంతాలకు 180 ఎంజీడీల కృష్ణా జలాల సరఫరా నిలిచిపోనుంది. దీంతో సగం సిటీకి నీరందే పరిస్థితి లేదు.ఆదివారం కూడా కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. సోమవారం సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపింది. ట్రయల్న్‌ల్రో భాగంగా నల్లగొండ జల్లాలోని అక్కంపల్లి జలాశయంలో నీటిని తొలగించి... మూడోదశకు అవసరమైన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. రింగ్‌మెయిన్-1 పనులు 6.5 కి.మీ. మేర పూర్తి కానందున ఫేజ్-1, ఫేజ్-2 పైప్లైన్లను వాడుకోవడం అనివార్యమవుతోందని తెలిపింది. మరో మూడు నెలల్లో ఫిల్టర్బెడ్లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ పనులను పూర్తి చేసి నగరానికి 90 ఎంజీడీల నీటిని తరలిస్తామని జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ తెలిపారు. శనివారం ఏం చేస్తారంటే... ♦ అక్కంపల్లి జలాశయంలో హెడ్ రెగ్యులేటర్ తెరచి ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని కిందకు వదులుతారు. ♦ నీటి నిల్వలు తగ్గిన తరువాత కృష్ణా ఫేజ్-1, 2 మోటార్లను ఉదయం 4- 5 గంటల మధ్యఆపేస్తారు. ♦ ఉదయం 6 గంటలకు అక్కంపల్లిలో కాపర్ బండ్ ఉంచి... మూడో దశకు అవసరమైన పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. ♦ సాయంత్రం 4 గంటలకు జలాశయాన్ని నీటితో నింపుతారు. ♦ సాయంత్రం 5 గంటలకు మూడో దశలో ఏర్పాటు చేసిన రెండు పంపులను ప్రారంభించి...పరీక్షిస్తారు. ♦ రాత్రి 9 గంటలకు అక్కంపల్లి నుంచి నగర శివార్లలోని సాహెబ్‌నగర్ (సుమారు 108 కి.మీ)కు 45 ఎంజీడీల నీటిని తరలించి.. మార్గమధ్యలో నూతన రిజర్వాయర్లు, వాల్వ్‌లు, జంక్షన్ల వద్ద లీకేజీలను పరీక్షిస్తారు. ♦ ఈ నీటిని అర్థరాత్రికి కృష్ణా మొదటి, రెండో దశ పైప్లైన్ల ద్వారా నగరం నలుమూలల్లోని రిజర్వాయర్లకు సరఫరా చేస్తారు. రైల్వే స్టేషన్లలో ఇబ్బందే నగరంలోని నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు కూడా నీటి సరఫరా నిలిచిపోనుంది. దీంతో రైళ్లను శుభ్రపరచడం, నీటిని నింపుకునే పనులను వరంగల్, ఖాజీపేట్ తదితర స్టేషన్లలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లలో నీటి కొరత కారణంగా సుమారు 80కి పైగా ఎక్స్‌ప్రెస్, మరో వంద ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే వేలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే రైల్వే స్టేషన్లలోని ట్యాంకులలో నీటిని ముందుగానే నిల్వ చేసి పెట్టినట్లు ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. నీటి సరఫరా పునరుద్ధరించే వరకు ప్రయాణికులు పొదుపుగా నీటిని వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
సబ్సిడీలకు స్వస్తి
న్యూఢిల్లీ:ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత నీటి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొనసాగడం కష్టమేనని తెలుస్తోంది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రాయితీల కోసం నిధులు కేటాయించకపోవడమే ఇందుకు కారణం. ఏప్రిల్ నుంచి రాయితీలు కొనసాగకపోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాత్సవ ఇటీవల అన్నారు. ఉచిత నీటి పథకం రద్దయితే ఢిల్లీవాసులు నీరు, విద్యుత్‌కు విపరీతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత నీటి పథకం ప్రకారం కుళాయి కనెక్షన్లు ఉన్న వారికి నెలకు 20 వేల లీటర్ల చొప్పున నీరు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అయితే ఈ పథకం కొనసాగింపుపై తమ వద్ద కచ్చితమైన సమాచారం ఏదీ లేదని ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ) అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉందని, సబ్సిడీలు కూడా తొలగించారు కాబట్టి రాయితీ కొనసాగింపుపై త్వరలో జరిగే డీజేబీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విద్యుత్,నీటి పథకాల రాయితీల కోసం 2013-14 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించని మాట నిజమేనని ఆర్థికశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉచిత నీటి పథకం అమలు కోసం డీజేబీకి ప్రతి నెలా రూ.165 కోట్లు ఖర్చవుతోంది. రాయితీల తొలగింపు కారణంగా డిస్కమ్‌లు చార్జీల మోత మోగిస్తుండగా, ఏప్రిల్ నుంచి నీటి బిల్లులు కూడా వీటికి తోడవుతాయని ఢిల్లీవాసులు భయపడుతున్నారు. ఈ పథకం కొనసాగించాలని డీజేబీ నిర్ణయించుకుంటే ప్రభుత్వం దానిని ఆమోదించాల్సి ఉంటుందని సంస్థ మాజీ అధికారి ఒకరు అన్నారు. రాయితీల కొనసాగింపు, పరిహారం చెల్లింపు కోసం డీజేబీ కేంద్రాన్ని సంప్రదించగా అక్కడి నుంచి ప్రతికూల స్పందన వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి. ఉచిత నీటి సరఫరా పథకాన్ని రద్దు చేయాలని ఆదేశించిందని ఆర్థికశాఖవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో డీజేబీ శుక్రవారం బోర్డు సమావేశం నిర్వహించనుంది. అయితే ఉచిత నీటి పథకంపై చర్చ ఎజెండాలో లేదు. సబ్సిడీ కొనసాగింపును లెఫ్టినెంట్ గవర్నర్ వ్యతిరేకిస్తే తాము ఏప్రిల్ నుంచి చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుందని ఆర్థికశాఖ అధికారి ఒకరు తెలిపారు. సబ్సిడీ తొలగిస్తే ఊరుకోం : ఆప్ ఉచిత నీటి పథకం రద్దు పూర్తిగా ప్రజావ్యతిరేక చర్య అని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అభిప్రాయపడింది. రాయితీలను తొలగిస్తే తాము భారీ ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర పొత్తును కూడా బట్టబయలు చేస్తామని హెచ్చరించింది. ‘అవినీతిమయమైన షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని కూలగొట్టినందుకు కాంగ్రెస్ ఇలా పగతీర్చుకుంటోంది. డీజేబీ స్వయంప్రతిపత్తి గల సంస్థ కాబట్టి దాని నిర్ణయాన్ని అడ్డుకునే శక్తి ఎల్జీ, కేంద్ర ప్రభుత్వానికి ఉండబోదు’ అని ఆప్ ప్రకటన తెలిపింది. అయితే ఉచిత నీటి పథకం అమలుకు అవసరమైనన్ని నిధులు డీజేబీ వద్ద ఉన్నాయి కాబ ట్టి దానిని కొనసాగించడం కష్టమేమీ కాదని నిపుణు లు చెబుతున్నారు. రూ.నాలుగు వేల కోట్ల వార్షిక బడ్జెట్ గల డీజేబీ ఉచిత నీటి సరఫరా కోసం రూ.160 కోట్లు ఖర్చు చేయడం కష్టం కాదని అంటున్నారు.ఇదిలా ఉంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు పార్లమెంటు గత శుక్రవారం ఆమోదించిన బడ్జెట్లో విద్యుత్ రాయితీ కోసం నిధులు కేటాయించలేదు. ఫలితంగా ఏప్రిల్ ఒకటి నుంచి రాయితీ కొనసాగకపోవచ్చని విద్యుత్‌శాఖ వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 400 యూనిట్ల వరకు వాడుకునే విద్యుత్ వినియోగదారులకు మార్చ్ 31 వరకు మాత్రమే 50 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే.