Water charge
-
సూపర్ లగ్జరీ ప్రయాణికులపై ‘వాటర్ చార్జ్’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర రూ.10 చొప్పున పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శనివారం (ఆగస్టు 12) తొలి సరీ్వసు నుంచి ఇది అమల్లోకి వస్తోంది. ఇంతకాలం ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు మంచినీటి సీసాలు అందించే పద్ధతిని ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రతి ప్రయాణికుడికి అరలీటరు మంచినీటి సీసాను అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి టికెట్ ధరపై రూ.10 చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. దూరంతో ప్రమేయం లేకుండా ఈ అదనపు మొత్తం చార్జి చేస్తారు. టికెట్ ధరలోనే దాన్ని కలిపేస్తారు. దీంతో ప్రయాణికుడికి మంచినీటి సీసా అవసరం ఉన్నా లేకున్నా ఈ అదనపు చార్జీతో కూడిన టికెట్ తీసుకోవాల్సిందే. నిత్యం లక్ష మంది ప్రయాణికులపై ఈ తాజా నిర్ణయం ప్రభావం చూపనుంది. టికెట్‌తో పాటే జీవా బాటిల్.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు సాధారణంగా వాటర్ బాటిళ్లు దగ్గర పెట్టుకుంటారు. చాలామంది బస్టాండ్లలో కొంటారు. బయటి నీటిని తాగేందుకు ఇష్టపడని వారు ఇంటి నుంచి తెచ్చుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గరుడ ప్లస్, గరుడ, లహరి, రాజధాని ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు అరలీటరు పరిమాణంలో ఉన్న నీటి సీసాలను అందించడం ప్రారంభించారు. గతంలో బిస్లరీ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఆ బ్రాండు మంచినీళ్లు అందించేవారు. ఇటీవల జీవా పేరుతో ఆర్టీసీ సొంతంగా ప్యాకేజ్డ్ మంచినీటిని మార్కెట్లోకి తెచ్చింది. ఆర్టీసీ బస్టాండ్లలో ఈ నీటిని విక్రయిస్తున్నారు. ఏసీ బస్సుల్లో కూడా గతంలో ఇచ్చిన బిస్లరీ బాటిళ్లకు బదులు జీవా నీటినే ఇస్తున్నారు. ఇప్పుడు అదే నీటిని సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీకి ఏం లాభం? జీవా నీటికి ఇంకా ఆదరణ పెరగలేదు. దీన్ని మార్కెట్లోకి తెచ్చిన సమయంలో సీసా, అందులోని నీటి నాణ్యత విషయంలో ఫిర్యాదులొచ్చాయి. స్వయంగా సొంత సిబ్బందే నాణ్యతపై ప్రశ్నించటంతో, ఒప్పందం చేసుకున్న సంస్థను నాణ్యత విషయంలో సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో కొంతకాలం నిలిపేసి దిద్దుబాటు తర్వాత ఇటీవలే మళ్లీ విడుదల చేశారు. అయితే ఇప్పటికీ అది ప్రయాణికులకు పూర్తిస్థాయిలో పరిచయం కాలేదు. ఈ నేపథ్యంలోనే జీవా బ్రాండ్‌కు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దీని ద్వారా కొంత అదనపు ఆదాయం కూడా లభిస్తుందనేది ఆర్టీసీ ఆలోచనగా చెబుతున్నారు. ప్రతి అరలీటరు సీసాపై రూ.5.50 చొప్పున, దాన్ని తయారు చేస్తున్న ప్రైవేటు సంస్థకు చెల్లిస్తారు. డ్రైవర్‌కు ఇన్సెంటివ్‌గా 50 పైసలు చెల్లిస్తుంది. మిగతా రూ.4ను తన ఆదాయంగా ఆర్టీసీ లెక్కలు వేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 700 సూపర్ లగ్జరీ బస్సులున్నాయి. వీటిల్లో నిత్యం దాదాపు లక్ష మంది ప్రయాణిస్తున్నారు. ఈ లెక్కన వారిపై రోజుకు రూ.10 లక్షల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
నీటి పిడుగు
నీటి చార్జీల పెంపు ఆదివారం నుంచే అమల్లోకి త్వరలో పెంచనున్న పారిశుద్ధ్య సేవల చార్జి సాక్షి,బెంగళూరు : నగరవాసులపై నీటి పిడుగు పడింది. గృహ, గృహేతర అన్న తేడా లేకుండా అన్ని రంగాలకు సంబంధించి నీటి చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన నీటి ధరలు ఆదివారం నుంచే అమల్లోకి రానున్నాయి. నీటి వినియోగ చార్జీలే కాకుండా కనిష్ట నీటివాడకం చార్జీతో పాటు పారిశుద్ధ్య సేవలను చార్జిని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నీటి వాడకానికి సంబంధించి కనిష్ట చార్జీని రూ.48 నుంచి రూ.57లకు పెంచింది. అదేవిధంగా పారిశుద్ధ్య సేవల చార్జిని కూడా రూ.83 నుంచి రూ.100లకు పెంచుతూ జలమండలి చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనుంది. గృహ అవసరాల కోసం... మొదటి స్లాబ్‌లో ప్రతి వెయ్యి లీటర్ల నీటి వినియోగానికి ఇకపై రూ.7 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ధర లీటరుకు రూ.6. రెండవ స్లాబ్‌లో 8 వేల లీటర్ల నుంచి 25 వేల లీటర్ల నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్ల ఇక పై రూ.9 బదులు రూ.11 చెల్లించాల్సి ఉంటుంది. మూడవ స్లాబ్‌లో 25వేల లీటర్ల నుంచి 50 వేల లీటర్ల నీటిని వాడకంపై ప్రతి వెయ్యి లీటర్ల ధర రూ.15 నుంచి రూ.26కు పెరిగింది. నాల్గవ స్లాబ్‌కు సంబంధించి 50 వేల లీటర్ల నీటి నుంచి అటు పై నీటి వాడకానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్లకు ఇక పై రూ.45 చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటి వరకూ 50 వేల నుంచి 75 వేల లీటర్ల నీటి వినియోగం స్లాబుకు సంబంధించి ప్రతి వెయ్యి లీటర్లకు రూ.30, అదేవిధంగా 75వేల లీటర్ల నుంచి అటు పై వినియోగించుకునే ప్రతి వెయ్యి లీటర్లకు రూ.36లు చెల్లించాల్సి ఉండేది. అయితే ఈ ఇకపై ఈ విభజన ఉండదు. గృహేతర అవసరాల కోసం... మొదటిస్లాబ్లో పదివేల లీటర్ల నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్లకు ఇక పై రూ.36 బదులు రూ.50లు చెల్లించాల్సి ఉంటుంది. రెండవస్లాబ్లో పదివేల లీటర్ల నుంచి ఇరవై వేల నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటరుకు రూ.57 చెల్లించాలి. ఇప్పటి వరకూ ఈ చార్జి రూ.39 మూడవస్లాబ్లో 20 వేల నుంచి 40వేల లీటర్ల నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్ల రూ.44 బదులు రూ.65 చెల్లించాలి. నాల్గవస్లాబ్లో 40వేల నుంచి 60వేల లీటర్ల నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్ల నీటికి రూ.76 చెల్లించాలి. ప్రస్తుతం ఇది రూ.51గా ఉంది. ఐదవస్లాబ్లో 60 వేల నుంచి ఆ పై నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్ల నీటికి రూ. 57 బదులు రూ.87 చెల్లించాలి. అదేవిధంగా పరిశ్రమలు తదితర సంస్థల నీటి కనిష్ట వినియోగ చార్జిని కూడా రూ.60 నుంచి రూ.90లకు పెంచింది. పెంచిన నీటివినియోగ చార్జీలు, సేవలశుల్కం తదితరాల వల్ల జలమండలి ఆదాయం నెలకు రూ.50.23 కోట్ల నుంచి రూ.73.73 కోట్లకు పెరగబోతోందని అధికారుల అంచన. జలమండలి చివరిగా 2005లో నీటి వినియోగ చార్జీలను సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. -
వాణిజ్య కనెక్షన్లపైజలఖడ్గం
జలమండలి చార్జీల కొరడా 25 వేల కనెక్షన్లపై భారం నెలకు రూ.20 కోట్లు.. ఏడాదికి రూ.240 కోట్ల మేర బాదుడు సాక్షి, సిటీబ్యూరో: జలమండలి మళ్లీ వాణిజ్య, పారిశ్రామిక వర్గాలపై నీటిచార్జీల భారం మోపింది. వంద శాతం మేర పెంపుతో హడలెత్తిస్తోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 8 లక్షల నల్లా కనెక్షన్లుండగా 25 వేల కుళాయి కనెక్షన్లపై తాజాగా భారం పడనుంది. మొత్తంగా నీటి ఛార్జీల పెంపుతో జలమండలి నెలకు రూ.20 కోట్లు, ఏడాదికి రూ.240 కోట్ల మేర వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టనుంది. మార్చి 1 నుంచి తాజా చార్జీలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన చార్జీల్లో 35 శాతం మురుగు శిస్తు కలిపే ఉంటుంది. కాగా, 2011లో నీటిచార్జీలు పెంచిన జలమండలి తాజాగా మరోసారి జలఖడ్గం ఝళిపించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గృహవినియోగ కనెక్షన్లను పెంపు నుంచి మినహాయించడం గుడ్డిలో మెల్ల. రూ.29 కోట్ల నెలవారీ లోటు పూడ్చుకునేందుకు చార్జీల పెంపు అనివార్యమైందని జలమండలి వర్గాలు తెలిపాయి. కుళాయి కనెక్షన్ ఇక సులభం గృహవినియోగ నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి జలమండలి ఊరటనిచ్చింది. సేల్‌డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్ డీడ్, సెటిల్మెంట్ డీడ్, సైట్ పట్టా లేని వినియోగదారులు కూడా సులభంగా కుళాయికి దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. సంబంధిత పత్రాలు లేని వారు ఇకపై దరఖాస్తుతోపాటు రూ.100 నాన్‌జ్యుడిషియల్ స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ , విద్యుత్ బిల్లు జతచేస్తే సరిపోతుంది. అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ గడువు మార్చి 31 గ్రేటర్ పరిధిలో సుమారు లక్ష వరకు ఉన్న అక్రమ కుళాయిలను క్రమబద్దీకరించుకునేందుకు జలమండలి మార్చి 31 వరకు గడువునిచ్చింది. గడువులోగా రూ.300 సర్వీసు చార్జి, రూ.200 కనెక్షన్ చార్జి, 3 నెలల సాధారణ బిల్లు చెల్లించి వినియోగదారులు వీటిని క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. 20 ఎంఎం ఆపై పరిమాణం కుళాయి గల వారు వీటితో పాటు ఏడాది సాధారణ నీటిబిల్లు చెల్లించాలి.