విద్యుదాఘాతంతో రైతు మృతి
నల్గొండ: నల్గొండజిల్లా త్రిపురారం మండలంలోని అభంగాపురంలో బోయ వెంకటయ్య(37) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వివరాలు... శనివారం మధ్యాహ్నం పొలానికి వెళ్లి నీటి మోటర్ స్విచాన్ చేయగా మోటారు స్టార్ట్ కాలేదు. పక్కన ఉన్న బావిలోకి దిగి మోటరు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. అతనికి సొంతంగా 3 ఎకరాలు భూమి ఉండగా, ఎల్14 లిఫ్ట్ కింద మరో 2 ఎకరాలు పొలం కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. వెంకటయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
(త్రిపురాం)