water merchants
-
ఆర్సీఎఫ్లో 10% విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని మరో సంస్థ రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్ఎల్)లో 10 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. మర్చంట్ బ్యాంకర్లు జనవరి 28 నాటికి, లీగల్ అడ్వైజర్లు 29 నాటికి బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్సీఎఫ్ఎల్లో కేంద్రానికి 75 శాతం వాటాలు ఉండగా, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో 10 శాతాన్ని విక్రయించాలని భావిస్తోంది. శుక్రవారం నాటి ఆర్సీఎఫ్ షేరు ముగింపు ధర రూ. 54 ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 300 కోట్లుగా ఉంటుంది. బీఈఎంఎల్లో వాటాల విక్రయానికి బిడ్ల ఆహ్వానం ప్రభుత్వ రంగ దిగ్గజం బీఈఎంఎల్లో 26 శాతం వాటాల విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా బిడ్లను ఆహ్వానించింది. బిడ్డర్లు మార్చి 1 లోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) దాఖలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) వెల్లడించింది. శుక్రవారం బీఈఎంఎల్ షేరు ధర రూ. 974 ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 1,000 కోట్లుగా ఉంటుంది. డిఫెన్స్, రెయిల్, విద్యుత్, మైనింగ్, ఇన్ఫ్రా తదితర రంగాల్లో బీఈఎంఎల్ కార్యకలాపాలు సాగిస్తోంది. 2020 మార్చి 31 నాటికి రూ. 9,795 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. సంస్థలో కేంద్రానికి 54.03 శాతం వాటాలు ఉండగా.. కొనుగోలుదారులకు 26 శాతం వాటాలతో పాటు యాజమాన్య హక్కులు కూడా బదలాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. -
శంషాబాద్‌లో నీళ్ల వ్యాపారుల దోపిడీ
శంషాబాద్ నీళ్ల వ్యాపారుల దోపిడీ మరింత పెరిగింది. గత పదిహేను రోజులుగా రూ.10 కు విక్రయించే 20 లీటర్ల నీటిని అమాంతం రెట్టింపు చేశారు. ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలను కూడా పాటించకుండా ఫిల్టర్ నీటిని అమ్ముకునే వ్యాపారులు సిండికేట్‌గా మారారు. గత పదేళ్లుగా పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న ఫిల్టర్ వ్యాపారులపై ఇంతరకు అధికారులు తనిఖీలు, అజమాయిషి కాస్తా లేకపోవడంతో వీరిది ఇష్టారాజ్యంగా మారింది. ఇటీవల సిండికేట్‌గా మారి రేట్లు కూడా పెంచేవారు. ఫ్లోర్ ఫ్లోరుకు ఓ లెక్కన రేట్లు తీసుకుంటున్నారు. నీటి సమస్యతో .. శంషాబాద్‌లో ప్రస్తుతం పాత గ్రామానికి కృష్ణా నీరు సరఫరా అవుతోంది. రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. అయితే, రైల్వే ట్రాక్‌కు కుడివైపున ఉన్న కాలనీలకు కృష్ణా నీరు అందటం లేదు. దీంతో ఇక్కడి వారు ఫిల్టర్ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. శంషాబాద్ పట్టణంలో సుమారు 40 వేల జనాభాకు సరిపడా నీటి సరఫరా లేకపోవడంతో నీటి వ్యాపారులు ఇదే అదనుగా ధరలను పెంచేసి దోపిడి చేస్తున్నారు. మురుగునీటి ప్రవాహనం పక్కనే బోర్లు వేసి కూడా నీటిని అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయతీ కొరడా.. ఇటీవల గ్రామసభలో సమస్య ప్రస్తావనకు రావడంతో ఎట్టకేలకు శంషాబాద్ పంచాయతీ అధికారులు రంగంలోకి దిగారు. ఫిల్టర్ నీటిని సరఫరా చేసే వారు నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన సర్టిఫికెట్లను పొందడంతో పాటు పంచాయతీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా సోమవారం ఫిల్టర్ వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. పెంచిన రేట్లను కూడా వెంటనే తగ్గించాలని ఆదేశించారు. పంచాయతీ అధికారులు రంగంలోకి దిగడంతో వ్యాపారులు దిగొస్తారా.. లేదా యధాతథంగా తమ దందాను కొనసాగిస్తారా..? లేదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.