Water supply scheme
-
‘మహా’ దాహార్తి తీర్చేందుకు..
సాక్షి, హైదరాబాద్: మహానగర తాగునీటి అవసరాల కోసం మరో 20 టీఎంసీలను గోదావరి జలాలను మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి తరలించేందుకు టెండర్ ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి తాగునీటి సరఫరా పథకం 2, 3 దశ పనులు చేపట్టేందుకు సుమారు రూ.7,360 కోట్లను మంజూరు చేసింది. దీంతో ఈ నెల 15వ తేదీలోగా టెండర్లను ఆహ్వానించేందుకు జలమండలి కసరత్తు ప్రారంభించింది.గోదావరి జలాల్లో హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా ఇప్పటికే గోదావరి మొదటి దశ కింద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. తాజాగా రెండు, మూడో దశ కింద మిగిలిన 20 టీఎంసీలు తరలించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నగర ప్రాజెక్టును హైబ్రీడ్ యాన్యూటీ మోడల్(హ్యామ్) చేపట్టనున్నారు. మొత్తం వ్యయంలో ప్రభుత్వ వాటా 40 శాతం, నిర్మాణ సంస్థ వాటా 60 శాతం భరించనున్నారు. ప్రభుత్వం తమ వాటా నిధులను హడ్కో వద్ద రుణం తీసుకోనుంది. ప్రాజెక్టు 24 నెలల్లో పూర్తిచేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. రెండు వరసల పైప్లైన్లతో..కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను ఘన్పూర్ మీదుగా ఉస్మాన్‌సాగర్ వరకు తరలించనున్నారు. మొత్తం 20 టీఎంసీల్లో నగర తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, మిగిలిన 5 టీఎంసీలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పునరుజ్జీవానికి వినియోగించనున్నారు. రెండు పైప్లైన్ల ద్వారా 3000 ఎంఎం డయాతో 50 కిలోమీటర్లు, 2,200 ఎంఎం డయాతో 58 కిలో మీటర్ల వరకు పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. ఘన్పూర్ వద్ద సుమారు 1170 ఎంఎల్డీల నీటిశుద్ధి ప్లాంట్ నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి జంక్షన్ వరకు 2400 ఎంఎం పైప్‌లైన్ 40 కిలోమీటర్ల వరకు, దాని వెంట 3000 ఎంఎం డయా రింగ్ మెయిన్‌ను కలుపుతూ పైప్‌లైన్ నిర్మాణం చేపడతారు. ఉస్మాన్‌సాగర్‌లో 120 ఎంఎల్డీ, హిమాయత్‌సాగర్‌లో 70 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను నిర్మిస్తారు. -
హైదరాబాద్ ప్రజలకు ఉచిత మంచినీరు :మంత్రి కే టీ ఆర్
-
బొట్టు రాలితే ఒట్టు !
-
బొట్టు రాలితే ఒట్టు !
* గొంతెండుతున్న పట్నం * జాతీయ నిబంధనల కంటే అతి తక్కువగా నీటి సరఫరా * 182 పట్టణాల్లో నిబంధనలకు మేర నాలుగు చోట్లే * 138 మున్సిపాలిటీల్లో సరఫరా అస్తవ్యస్తం * రెండు నుంచి ఆరు రోజులకోసారి నీటి సరఫరా * రూ. 2,185 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం దాహం.. దాహం.. దాహం.. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల ఆక్రందన ఇది. చిన్న మున్సిపాలిటీల నుంచి కార్పొరేషన్ల దాకా ఎక్కడ చూసినా నీటికి కటకటే. గుక్కెడు మంచినీటి కోసం కూడా అల్లల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనంతటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఎన్నో తాగునీటి పథకాలు చేపట్టినా.. అందులో పూర్తయి నీరందిస్తున్నవి కొన్నే. ఇప్పటికే ఉన్న మంచినీటి పథకాలు కూడా నిర్వహణ లోపం వల్ల పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. దీనికితోడు అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, నిధులున్నా పనులు చేయకపోవడం వంటి కారణాలతో పేదలకు ‘నీటి’ బాధ తప్పడం లేదు. సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో అంతో ఇంతో ఇస్తున్న ఆ నీటి సరఫరాకు కూడా సమయం సందర్భం ఉండడం లేదు. ఎప్పుడు సరఫరా చేస్తే అప్పుడు పట్టుకోవాల్సిందే. అదికూడా ఒక్కో రోజు ఒక్కో సమయంలో, ఒక్కో పరిమాణంలో ఉంటుండడం గమనార్హం. నియమిత పరిమాణం కంటే తక్కువ నీటిని సరఫరా చేస్తున్నా.. ప్రజలపై బిల్లుల మోత మాత్రం మోగిస్తూనే ఉన్నారు. ఇక ఇచ్చే నీరైనా ప్రతీరోజు ఇస్తున్నారా.. అంటే అదీ లేదు. చాలా పట్టణాల్లో రెండు నుంచి ఆరు రోజులకోమారు నీటిని సరఫరా చేస్తున్నారు. శీతాకాలం ముగియకముందే రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పరిస్థితి ఇలా ఉంటే.. వేసవిలో పరిస్థితిని ఊహిస్తేనే భయం గొలుపుతోంది. ఇంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే.. సరఫరా చేసే ఆ కాస్త నీరైనా పరిశుభ్రంగా ఉండడం లేదు. మురికివాడల్లోని ప్రజల పరిస్థితి మరీ దారుణం. ఏది అందుబాటులో ఉంటే ఆ నీరు తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. అదే ఢిల్లీలో ఇటీవలే గద్దెనెక్కిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఒక్కో ఇంటికి ప్రతినెలా 20 వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా ఇస్తోంది. మన రాష్ట్రంలోనైతే ఉచితం కాదుగదా.. బిల్లులు వసూలు చేసైనా ఓ గంటసేపు మంచినీళ్లు ఇస్తే చాలని ప్రజలు వాపోతున్నారు. అమలుకాని నిబంధనలు.. రాష్ట్రంలో 182 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. జాతీయ నియమావళి ప్రకారం.. పట్టణాలు, నగరాల్లో ప్రతీరోజు ఒక్కొక్కరికీ 135 లీటర్ల చొప్పున (ఎల్పీసీడీ) నీటిని సరఫరా చేయాలి. కానీ, రాష్ట్రంలో ఆ మేరకు నీటిని సరఫరా చేస్తున్న మున్సిపాలిటీలు కేవలం నాలుగే. కృష్ణా, గోదావరి నదుల పక్కనే ఉన్న పట్టణాలు, నగరాల్లోనూ నీటి సరఫరా అంతంత మాత్రమే. 100 లీటర్ల (ఎల్పీసీడీ) కంటే తక్కువ నీటిని సరఫరా చేసే మున్సిపాలిటీల సంఖ్య 138. అందులో 33 పట్టణాల్లో 40 లీటర్ల (ఎల్పీసీడీ) కంటే తక్కువ నీరు సరఫరా చేస్తున్నారు. నీళ్లిచ్చేదెన్నడు? జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద రాష్ట్రంలో దాదాపు రూ. 2,185 కోట్లతో 62 తాగునీటి పథకాలు చేపట్టారు. అందులో 50 పథకాలు దాదాపు పూర్తయ్యాయి కూడా. కానీ, పరిస్థితిలో మార్పులేదు. పథకాలు పూర్తయిన పట్టణాల్లో ఆశించిన స్థాయిలో నీటి సరఫరా లేకపోగా... కొన్ని ప్రాజెక్టులు ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి.. - కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి తాగునీరు అందించే పథకానికి సంబంధించి 85 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, గాజులదిన్నె ప్రాజెక్టులో నీటి కోసం ఇన్‌టేక్ వెల్ నిర్మాణానికి, పైపులైను వేయడానికి రైతులు అడ్డు చెప్పడంతో నిలిచిపోయింది. - తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీకి సంబంధించి 68 శాతం పనిపూర్తయ్యాక కాంట్రాక్టరుకు, అధికారుల మధ్య తలెత్తిన విభేదాలు కోర్టుకెక్కాయి. ఇప్పుడా పథకం పూర్తి కావాలంటే అదనంగా 9.84 కోట్లు అవసరం. - తూర్పుగోదావరిలోని పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి కాంట్రాక్టరు గొడవతో పని నిలిచిపోయింది. దానిని పూర్తి చేయాలంటే అదనంగా 9.49 కోట్లు అవసరం. - ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ప్రాజెక్టు మొత్తం పూర్తయింది. కానీ, నీళ్లు లేవు. ఇందిరాసాగర్ (పోలవరం) బ్యాక్‌వాటర్‌తో బేతుపల్లి ట్యాంక్ నింపి అక్కడి నుంచి మున్సిపాలిటీకి సరఫరా చేయాలి. కానీ పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. - చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీలకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి నీరు తీసుకోవాలన్నది ప్రణాళిక. ఈ పథకం పూర్తయినా హంద్రీనీవా సుజల స్రవంతి పూర్తయితే తప్ప నీరు వచ్చే అవకాశం లేదు. - ఇక కొన్ని మంచినీటి ప్రాజెక్టులకు పైపులైను వేయడానికి అవసరమైన భూ సేకరణ, వివిధ విభాగాల అనుమతులతోపాటు కొద్దిపాటి నిధులు ఖర్చు చేస్తే పథకాలు పూర్తయ్యే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
సాయం ఆయన ధ్యేయం
ఆర్తులకు అండగా నిలవడమే లక్ష్యం సొంత ఖర్చులతో సంక్షేమం రూ. 2 లక్షలతో నీటి సరఫరా పథకం ఎందరికో విద్యా, ఆరోగ్య దానం సేవా కార్యక్రమాల్లో సంతానం ప్రమేయం చింతపల్లి రూరల్/అనకాపల్లి, న్యూస్‌లైన్: చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు ఆ యన్ను సేవాపథంలోకి నడిపించా యి. జీవితం లో నేర్చుకున్న పాఠాలు సేవాస్ఫూర్తికి పునాది వేశాయి. ఆ అనుభవాలు, ఆ పాఠాలు మళ్ల లోకేశ్వరరావు చేత సమాజ సంక్షేమానికి సేవా కార్యక్రమాలు చేపట్టేలా పురిగొల్పాయి. సంతానానికి సైతం ఆ సేవా లక్షణాలే వారసత్వంలా వచ్చాయి. దాంతో సేవా కార్యక్రమాలకు ఆ కుటుంబం ప్రతీకగా మారింది. సాధ్యమైన రీతిలో ఆర్తులకు సహాయహస్తం అందిస్తోంది. అనకాపల్లికి చెందిన మళ్ల లోకేశ్వర రా వు సేవాతత్పరతకు ప్రతీకగా నిలుస్తారు. ప్రస్తు తం చింతపల్లి సబ్ ట్రెజరీ అధికారిగా పని చేస్తు న్న ఆయన సాధ్యమైనన్ని విధాలుగా సమాజ సంక్షేమానికి కృషి చేస్తున్నారు. పాలకులే పట్టించుకోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు సేవ చేయాలని తపిస్తున్నారు. జీతంలో ప్రధాన భాగాన్ని సమాజ సేవకు వెచ్చించడమే కాదు.. తన కుమారుల చేత కూడా ఆపని చేయిస్తున్నారు. వైద్యులైన కొడుకు, కోడలు గిరిజనులకు సేవ చేసేలా దీక్ష వహిస్తున్నారు. చల్లని సాయం ఉద్యోగరీత్యా చింతపల్లికి వచ్చిన వెంటనే లోకేశ్వరరావు అక్కడ సేవా కార్యక్రమాలకు శ్రీకా రం చుట్టారు. స్థానిక పీహెచ్సీ వద్ద రోగులు పడుతున్న అవస్థలు చూసి, అక్కడ ముందుగా మంచినీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయిం చారు. రూ. 2 లక్షలు ఖర్చు చేసి ఆస్పత్రి ఆవరణలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు కూ డా మంచినీటి సదుపాయం కల్పించాలన్న ప ట్టుదలతో ఉన్నారు. సబ్ ట్రెజరీకి వచ్చిన వెంట నే సొంత నిధులు రూ. 70 వేలు వెచ్చించి చిం తపల్లి ట్రెజరీ కార్యాలయ పరిసరాలను అందం గా తీర్చిదిద్దారు. తన ఆదాయంలో కొంత మొత్తంతో పేద వృద్ధులు, వితంతువులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ఇద్దరు యువతులను చదివిస్తున్నారు. వారిలో ఓ యు వతి వివాహం చేయబోతున్నారు. వేములపూడికి చెందిన మరో యువతిని కూడా చదివిస్తున్నారు. తునిలో రైల్వేస్టేషన్లో కనిపించిన ఒక బాలుడిని హాస్టల్లో చేర్పించారు. ఏటా గాంధీ జయంతి రోజు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. వైద్యసాయం లోకేశ్వరరావు కుమారుడు, బాలసాయినాథ్, కోడలు పావని ముంబయిలో వైద్యాధికారులు గా పని చేస్తున్నా గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబి రాలు నిర్వర్తిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో సీజనల్‌గా వ్యాపించే వ్యాధులను అదుపు చేసేందుకు మందులు సిద్ధం చేస్తున్నారు. మరో ఇద్దరు కుమారులు కూడా తమ ఆదాయంలో కొంత భాగాన్ని గిరిజన గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఖర్చు చేస్తున్నారు. కష్టాలే జీవిత పాఠాలు అనకాపల్లిలో గవరపాలెం నిదానం దొడ్డికి చెందిన లోకేశ్వరరావు చిన్నతనం ఆడుతూపాడుతూ సాగింది. తండ్రి బెల్లం వ్యాపారం చేసేవారు. కానీ వ్యాపారంలో వచ్చిన నష్టాలు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఆయన చదువుకు సైతం సమస్యలు ఎదురయ్యాయి. లోకేశ్వరరావు తండ్రి అనారోగ్యంతో బాధపడినా వైద్యం చేయించేందుకూ డబ్బు లేని పరిస్థితి ఎదురైంది. ఎవరికీ ఇటువంటి సమస్యలు రాకూడదని, అందుకు తాను ఆదాయంలో పదిశాతం సమాజ సంక్షేమానికి వినియోగించాలని లోకేశ్వరరావు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కర్తవ్యాన్ని విస్మరించకుండా సేవా కార్యక్రమాలకు అంకితమయ్యారు. ‘బాల్యంలో సమస్యలు సేవా సంకల్పానికి ప్రేరణగా నిలిచాయి. ఆర్తులకు చేయూతనిచ్చేలా నన్ను తీర్చిదిద్దాయి. నా పిల్లలకూ దాన్నే అలవాటు చేశాను.’ అని లోకేశ్వరరావు చెప్పారు.