సాయం ఆయన ధ్యేయం
- ఆర్తులకు అండగా నిలవడమే లక్ష్యం
- సొంత ఖర్చులతో సంక్షేమం
- రూ. 2 లక్షలతో నీటి సరఫరా పథకం
- ఎందరికో విద్యా, ఆరోగ్య దానం
- సేవా కార్యక్రమాల్లో సంతానం ప్రమేయం
చింతపల్లి రూరల్/అనకాపల్లి, న్యూస్‌లైన్: చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు ఆ యన్ను సేవాపథంలోకి నడిపించా యి. జీవితం లో నేర్చుకున్న పాఠాలు సేవాస్ఫూర్తికి పునాది వేశాయి. ఆ అనుభవాలు, ఆ పాఠాలు మళ్ల లోకేశ్వరరావు చేత సమాజ సంక్షేమానికి సేవా కార్యక్రమాలు చేపట్టేలా పురిగొల్పాయి. సంతానానికి సైతం ఆ సేవా లక్షణాలే వారసత్వంలా వచ్చాయి. దాంతో సేవా కార్యక్రమాలకు ఆ కుటుంబం ప్రతీకగా మారింది. సాధ్యమైన రీతిలో ఆర్తులకు సహాయహస్తం అందిస్తోంది.
అనకాపల్లికి చెందిన మళ్ల లోకేశ్వర రా వు సేవాతత్పరతకు ప్రతీకగా నిలుస్తారు. ప్రస్తు తం చింతపల్లి సబ్ ట్రెజరీ అధికారిగా పని చేస్తు న్న ఆయన సాధ్యమైనన్ని విధాలుగా సమాజ సంక్షేమానికి కృషి చేస్తున్నారు. పాలకులే పట్టించుకోని ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు సేవ చేయాలని తపిస్తున్నారు. జీతంలో ప్రధాన భాగాన్ని సమాజ సేవకు వెచ్చించడమే కాదు.. తన కుమారుల చేత కూడా ఆపని చేయిస్తున్నారు. వైద్యులైన కొడుకు, కోడలు గిరిజనులకు సేవ చేసేలా దీక్ష వహిస్తున్నారు.
చల్లని సాయం
ఉద్యోగరీత్యా చింతపల్లికి వచ్చిన వెంటనే లోకేశ్వరరావు అక్కడ సేవా కార్యక్రమాలకు శ్రీకా రం చుట్టారు. స్థానిక పీహెచ్‌సీ వద్ద రోగులు పడుతున్న అవస్థలు చూసి, అక్కడ ముందుగా మంచినీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయిం చారు. రూ. 2 లక్షలు ఖర్చు చేసి ఆస్పత్రి ఆవరణలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పాత బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు కూ డా మంచినీటి సదుపాయం కల్పించాలన్న ప ట్టుదలతో ఉన్నారు.
సబ్ ట్రెజరీకి వచ్చిన వెంట నే సొంత నిధులు రూ. 70 వేలు వెచ్చించి చిం తపల్లి ట్రెజరీ కార్యాలయ పరిసరాలను అందం గా తీర్చిదిద్దారు. తన ఆదాయంలో కొంత మొత్తంతో పేద వృద్ధులు, వితంతువులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ఇద్దరు యువతులను చదివిస్తున్నారు. వారిలో ఓ యు వతి వివాహం చేయబోతున్నారు. వేములపూడికి చెందిన మరో యువతిని కూడా చదివిస్తున్నారు. తునిలో రైల్వేస్టేషన్‌లో కనిపించిన ఒక బాలుడిని హాస్టల్‌లో చేర్పించారు. ఏటా గాంధీ జయంతి రోజు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు.
వైద్యసాయం
లోకేశ్వరరావు కుమారుడు, బాలసాయినాథ్, కోడలు పావని ముంబయిలో వైద్యాధికారులు గా పని చేస్తున్నా గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబి రాలు నిర్వర్తిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో సీజనల్‌గా వ్యాపించే వ్యాధులను అదుపు చేసేందుకు మందులు సిద్ధం చేస్తున్నారు. మరో ఇద్దరు కుమారులు కూడా తమ ఆదాయంలో కొంత భాగాన్ని గిరిజన గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఖర్చు చేస్తున్నారు.
కష్టాలే జీవిత పాఠాలు
అనకాపల్లిలో గవరపాలెం నిదానం దొడ్డికి చెందిన లోకేశ్వరరావు చిన్నతనం ఆడుతూపాడుతూ సాగింది. తండ్రి బెల్లం వ్యాపారం చేసేవారు. కానీ వ్యాపారంలో వచ్చిన నష్టాలు కష్టాలు తెచ్చిపెట్టాయి.
ఆయన చదువుకు సైతం సమస్యలు ఎదురయ్యాయి. లోకేశ్వరరావు తండ్రి అనారోగ్యంతో బాధపడినా వైద్యం చేయించేందుకూ డబ్బు లేని పరిస్థితి ఎదురైంది. ఎవరికీ ఇటువంటి సమస్యలు రాకూడదని, అందుకు తాను ఆదాయంలో పదిశాతం సమాజ సంక్షేమానికి వినియోగించాలని లోకేశ్వరరావు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా కర్తవ్యాన్ని విస్మరించకుండా సేవా కార్యక్రమాలకు అంకితమయ్యారు. ‘బాల్యంలో సమస్యలు సేవా సంకల్పానికి ప్రేరణగా నిలిచాయి. ఆర్తులకు చేయూతనిచ్చేలా నన్ను తీర్చిదిద్దాయి. నా పిల్లలకూ దాన్నే అలవాటు చేశాను.’ అని లోకేశ్వరరావు చెప్పారు.