Weavers sector
-
'చంద్రబాబు అలా చేస్తే అది జగన్‌కే మంచిపేరు'
-
చంద్రబాబు అలా చేస్తే అది జగన్‌కే మంచిపేరు
సాక్షి, ధర్మవరం : చేనేత, ఇతర వృత్తి పనులు చేస్తూ జీవించే కూలీలకు 45 ఏళ్ల వయసు నుంచే పెన్షన్ అందిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. మోసకారి చంద్రబాబు పాలన మరొక్క ఏడాదిలో అంతమైపోయి, జనం కోసం ఏర్పాటయ్యే ప్రజాప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు. ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపేందుకుగానూ మంగళవారం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి వచ్చిన వైఎస్ జగన్.. అక్కడి జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే... చివరికి చనిపోయినా పట్టించుకోరా? : ‘‘పట్టువస్త్రాలు, చేనేతకు ఖ్యాతిగాంచిన ధర్మవరంలో గడిచిన 37 రోజులుగా నేతన్నలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఇక్కడ 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కనీసం చనిపోయినవారి కుటుంబాలకైనా ప్రభుత్వం సాయం చేయదా! చనిపోయింది 65 మందైదే, జగన్ వస్తున్నాడని ఏదో 11 మందికి, అది కూడా అరకొరగా డబ్బులిచ్చారు. మళ్లీ జగన్ వెళ్లిపోయాక వారిని ఎవరూ పట్టించుకోరు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు నేతన్నలకు పట్టు, నూలు మీద కనీసం రూ.600 ఖర్చులు వచ్చేవి. రెండేళ్ల కిందట చేనేత దినోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతూ రూ.600 సాయాన్ని రూ.1000కి పెంచుతామని హామీ ఇచ్చారు. మరి ఇన్ని నెలల్లో ఎన్ని వేలు ఆయన కార్మికులకు ఇచ్చారు? బాబు రావడానికి ముందు 13నెలల బకాయిలు రావాల్సి ఉంది. ఆయన వచ్చాక రెండు నెలపాటు రూ.1000 ఖర్చులిచ్చి ఆ తర్వాత మానేశారు. నిజమే, ఆయనకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీకాదు. ఎన్నికలప్పుడు రైతులు, మహిళలు, యువత, చివరికి కులవృత్తులు చేసుకునేవారికి సైతం మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కారు. చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేస్తా, రుణాలు కట్టొద్దు, నేనొస్తున్నాను.. అని ప్రచారం చేయించుకున్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక రూ. 390 కోట్ల రుణాలకుగానూ కేవలం రూ.70 కోట్లిచ్చి చేతులెత్తేశారు. నేత కార్మికులకు ఇల్లు కట్టించి, మగ్గం ఏర్పాటుచేస్తామని, ప్రత్యేక నిధి ద్వారా ఏటా రూ.1000 కోట్లు ఖర్చుచేస్తామని, జిల్లాకో చేనేత పార్కు.. అని మోసపూరిత వాగ్ధానాలు చేశారు. ఏడాది తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే : చేనేత కార్మికులు ఇన్ని అవస్థలు పడుతున్నా.. చంద్రబాబు దున్నపోతు మీద వానపడ్డ చందంగా వ్యవహరిస్తున్నారు. ఆ మోసకారి పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. ఒకే ఒక్క సంవత్సరం తర్వాత మనం కలుద్దాం. ఒక్కటిగా మన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకుందాం. దీక్షలు చేస్తోన్న చెల్లెమ్మలకు చెబుతున్నా.. ఒక మంచి అన్నయ్య ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు. ఇవాళ రూ.1000 కోసం టెంట్లు వేశారు.. కానీ ప్రతినెలా రూ.2000 వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నా. చేనేతలు పనిచేస్తే తప్ప కడుపునిండని పరిస్థితి. 45 ఏళ్లకే కీళ్లనొప్పులు మొదలవుతాయి. అందుకే మహానేత రాజశేఖర్‌రెడ్డి వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే.. చేనేతలు సహా వృత్తిపనులు చేసుకునే బడుగు కూలీలు అందరికీ 45 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేసుకుందాం. అదికూడా రూ.2000 ఇస్తాం. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే.. ‘అన్న ముఖ్యమంత్రి అవుతాడు’ అని దేవుణ్ని గట్టిగా ప్రార్థించండి. చంద్రబాబు అలా చేస్తే అది జగన్‌కే పేరు : మూడున్నరేళ్లుగా చంద్రబాబు మోసపూరిత పాలన చూశారు. కనీసం ఒక్క చేనేత కుటుంబానికి కూడా ఆయన ఇస్తానన్న రూ.1లక్ష రుణం ఇవ్వలేదు. మన ప్రభుత్వంలో మాత్రం ప్రతి కార్మికుడికి ఇంటింటికీ వెళ్లి రుణం అందేలా చూస్తాం. నేను నవరత్నాలను ప్రకటించినప్పుడు కొందరు నాతో అన్నారు.. అన్నా, మనల్ని చూసి చంద్రబాబు కూడా రూ.2000 పెన్షన్ అంటారేమో అని! అందుకు నేనన్నాను..అలా చేస్తే మంచిదేకదా, అవ్వలు, తాతలకు మేలు జరుగుతుంది కదా, పెన్షన్ పెరగడానికి కారణమైనందుకు మనకే పేరొస్తుంది కదా అన్నారు. మీ అందరికీ భరోసా ఇస్తున్నా.. ఇంకొక్క సంవత్సరం వరకు మనం కలిసికట్టుగా పోరాడుదాం. కడుపులో ఎంత బాధున్నా, చిక్కటి చిరునవ్వులు చిందిస్తున్న ప్రతిఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని వైఎస్ జగన్ ప్రసంగాన్ని ముగించారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలపై వైఎస్ జగన్ నిలదీత -
'చేనేత, వృత్తి పనుల కూలీలకు 45 ఏళ్లకే పెన్షన్'
-
ఆధారమేదీ..
చీరాల, న్యూస్‌లైన్ : దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్దది చేనేత రంగం. అంతటి చరిత్ర ఉన్న చేనేత రంగం నిర్వీర్యమవుతోంది. ‘చేనేత రంగానికి కాలం చెల్లింది. గుంట మగ్గాలు ఇంకెంతకాలం’ అన్న చంద్రబాబు మాటలు మాత్రం నిజం కాలేదు. నేటికీ చేనేత రంగం బతికే ఉంది. అందుకు చేయూతనిచ్చింది వైఎస్ ప్రభుత్వమేనని కచ్చితంగా చెప్పవచ్చు. చేనేతలకు చంద్రబాబు చేసిందేమిటి? చేనేత బతుకులను బుగ్గిచేసే పవర్‌లూమ్‌లను ప్రోత్సహించి 2003లో టెక్స్టైల్స్ పార్కులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు కావడంతో చేనేతలకు పనిలేకుండా పోయింది. చేనేతలకు ఆసరాగా ఉండే ఆప్కోకు నిధులు కేటాయించకపోవడంతో చేనేత బట్టకొనుగోలు చేసే దిక్కులేక, చేసేందుకు పనులు లేక అప్పులు, అనారోగ్యాల బారినపడిన కార్మికులు పిట్టల్లా రాలిపోయారు. చిలుపనూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించడంతో నూలు కొనుగోలు చేయడం నేతన్నకు భారంగా మారింది. ఫలితంగా నూలు కొనలేక మగ్గం నడిచే పరిస్థితి ఉండేది కాదు. దీనిపై చీరాలలో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రైల్‌రోకో చేశారు. ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో సైతం ఆందోళన చేపట్టారు. అయినా ఫలితం లేదు. చేనేతలకు వైఎస్ఆర్ చేసిందిదీ.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పోచంపల్లి, సిరిసిల్ల వంటి చేనేత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించిన మొట్టమొదటి సభలో చేనేత రంగానికి చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే వారికి ఆసరాగా నిలిచారు. - చేనేత రుణమాఫీ కింద జిల్లాలో 1520 మంది లబ్దిదారులకు * 3.23 కోట్ల రుణాలు రద్దు చేశారు. చంద్రబాబు హయాంలో... - 2003-04లో రూ.195.37 కోట్లు (చేనేత బడ్జెట్) - ఏఏవై పథకం లేదు - 65 ఏళ్లు నిండిన వారికే వృద్ధాప్య పింఛన్, సమష్ట అమ్మక కేంద్రాలు లేవు. - నూలుపై సబ్సిడీ లేదు, చిలపల నూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ - ఆప్కో అమ్మకాలు రూ.86.85 కోట్లు - పింఛన్ 75 రూపాయలు - జనతా పథకం రద్దు - నూలు మిల్లుల మూసివేత - చేనేత మహిళలకు ఒక్క పథకం కూడా లేదు. వైఎస్సార్ హయాంలో... - 2008-09లో రూ.325.32 కోట్లు (చేనేత బడ్జెట్) - 2005-06లో ఏఏవై పథకం అమలు - 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ - 2006-07 నుంచి క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం ప్రవేశపెట్టారు - 200 కోట్ల రూపాయల ఆప్కో అమ్మకాలు, చేనేత పార్కుల ఏర్పాటు - చేనేతలకు పావలా వడ్డీ రుణాలు - రూ.312 కోట్ల చేనేత రుణాల మాఫీ - రంగు, రసాయనాలు, చిలప నూలుపై 10 శాతం సబ్సిడీ - వీవర్స్ క్రెడిట్ కార్డు ద్వారా వడ్డీలేని రుణాలు - చిలప నూలుపై 9.2 శాతం ఎక్సైజ్ డ్యూటీ రద్దు మహానేత మరణం తరువాత... - చేనేతలకు ప్రత్యేకంగా పరపతి బ్యాంకు ఏర్పాటు చేస్తానన్న కిరణ్ సర్కారు హామీ నెరవేర్చలేదు. - నూలు డిపోల ఏర్పాటు హామీ కూడా కాగితాలకే పరిమితమైంది. - మూడేళ్లలో నూలు ధరలు 30 నుంచి 55 శాతం పెరిగాయి. దీంతో చాలా మంది కార్మికులు నూలు కొనుగోలు చేసే శక్తిలేక మగ్గాలను మూలనపెట్టారు. - వీవర్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకం కూడా అమలుకు నోచుకోలేదు. కార్మికులు నెలకు 80 చెల్లిస్తే ఈ పథకం వర్తిస్తుంది. క్లైంల విషయంలో అనేక ఆంక్షలు విధించడంతో కార్మికులు ఈ పథకానికి దూరంగా ఉన్నారు. - జిల్లాలో 70 వేల మందికిపైగా చేనేతలున్నప్పటికీ చేనేత క్రెడిట్ కార్డు పథకం కింద 5 వేల మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. - నూలు, రంగులు, రసాయనాలపై పది శాతం సబ్సిడీ వైఎస్ అమలు చేస్తే తరువాత వచ్చే పాలకులు మాత్రం ఆ ఊసే ప్రస్తావించకుండా చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా చేనేతలు అప్పుల్లో కూరుకుని అల్లాడుతున్నారు. ఆదరవునిచ్చే నేత కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చేనేతల కోసం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ప్రకటించిందిదీ.. - 50 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న * 200 పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచుతామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు. - చేనేత కార్మికులు తీసుకున్న రుణాలు రద్దు చేస్తామని చెప్పారు. - కిరణ్ సర్కారు రద్దు చేసిన హౌస్ కం వర్క్ షెడ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామని జగన్ ప్రకటించారు. - కోస్తా తీర ప్రాంతాల్లో ఏటా సంభవించే ప్రకృతి వైపరీత్యాలకు గుంటమగ్గాల్లో పనిచేసే చేనేత కార్మికులకు ఎక్కువ నష్టం జరుగుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు గుంటమగ్గాల స్థానంలో ‘ఫ్రేమ్ లూమ్స్’ను అందజేస్తామని హామీ ఇచ్చారు. - అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల యూనిఫాంలు, విద్యార్థుల యూనిఫాంలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసి చేనేతలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పారు. - అర్హులైన చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 1.50 లక్షలతో ఉచితంగా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.