west coast
-
మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా
సియోల్: ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. గురువారం సాయంత్రం 6.20గంటల సమయంలో పశ్చిమ తీర నగరం నంపో నుంచి స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించినట్లు గుర్తించామని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఆ మిస్సైల్ ఎంత దూరం ప్రయాణించిందో వెల్లడించలేదు. అణు సామర్థ్యం కలిగిన బీ–52 బాంబర్ పరీక్షలను అమెరికా, దక్షిణకొరియా చేపట్టడంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి, దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ మంగళవారం తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. -
మార్కెట్లు వీక్- పేపర్ షేర్లు గెలాప్
డీమార్ట్ స్టోర్ల ప్రమోటర్ కంపెనీ వాటా కొనుగోలు చేసిన వార్తలతో ఆంధ్రా పేపర్ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ ప్రమోటర్ కంపెనీలలో వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ ఒకటి కావడం గమనార్హం! వెరసి ఈ రెండు కౌంటర్లూ పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ ఓపెన్ మార్కెట్ ద్వారా వారాంతాన రాధాకిషన్ దమానీ కంపెనీ బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ 1.26 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. షేరుకి రూ. 206.23 సగటు ధరలో ఆంధ్రా పేపర్లో 5 లక్షల ఈక్విటీ షేర్లను బ్రైట్ స్టార్ సొంతం చేసుకుంది. నిమి ఎంటర్ప్రైజెస్ తదితర సంస్థలు వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఆంధ్రా పేపర్ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 42.5 ఎగసి రూ. 255 సమీపంలో ఫ్రీజయ్యింది. కాగా.. గత వారం ఆంధ్రా పేపర్ ప్రమోటర్ కంపెనీలలో ఒకటైన ఇంటర్నేషనల్ పేపర్ ఆఫర్ ఫర్ సేల్ విధానంలో 10 శాతం వాటాను విక్రయించింది. 2020 మార్చికల్లా ఆంధ్రా పేపర్లో 20 శాతం వాటాను ఇంటర్నేషనల్ పేపర్ కలిగి ఉంది. వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో వెస్ట్ కోస్ట్ పేపర్ నికర లాభం 157 శాతం జంప్‌చేసి రూ. 146 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 28 శాతం పెరిగి రూ. 743 కోట్లకు చేరింది. రూ. 48 కోట్లమేర పన్ను లాభం జమకావడం లాభదాయకతకు బలం చేకూర్చింది. గత (2018-19) క్యూ4లో రూ. 42 కోట్ల పన్ను వ్యయాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో వెస్ట్ కోస్ట్ పేపర్ షేరు 14 శాతం దూసుకెళ్లింది. రూ. 25 ఎగసి రూ. 205 సమీపంలో ట్రేడవుతోంది. ఇతర కౌంటర్లూ పేపర్ తయారీ కౌంటర్లలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో స్టార్ పేపర్ 12 శాతం దూసుకెళ్లి రూ. 118 వద్ద, శేష సాయి 6.3 శాతం జంప్‌చేసి రూ. 166 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఇమామీ పేపర్ దాదాపు 4 శాతం ఎగసి రూ. 84కు చేరగా.. జేకే పేపర్ 4 శాతం పెరిగి రూ. 105ను తాకింది. ఇక టీఎన్ పేపర్ 3.5 శాతం బలపడి రూ. 121 వద్ద, బాలకృష్ణ పేపర్ 5 శాతం పుంజుకుని రూ. 20 వద్ద, బల్లార్పూర్ 3.7 శాతం లాభంతో రూ. 1.40 వద్ద వద్ద ట్రేడవుతున్నాయి. -
వాళ్లు వేటకొస్తున్నారు...
సాక్షి, విశాఖపట్నం: చేపలవేటపై నిషేధం అమలులో తమిళనాడు ప్రభుత్వ వైఖరి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల్లో అలజడి రేపుతోంది. మత్స్యసంపద పునరుత్పత్తి, వృద్ధికి వీలుగా ఏటా ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకు (45 రోజులు) చేపలవేటపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. ఈ ఏడాది 45 రోజుల నిషేధాన్ని 61 రోజులకు పెంచింది. దీని ప్రకారం ఈస్ట్‌కోస్ట్ (తూర్పు తీరం) పరిధిలోకి వచ్చే పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, అండమాన్ నికోబార్ దీవుల మత్స్యకారులకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపలవేట నిషేధం అమలవుతోంది. అలాగే వెస్ట్‌కోస్ట్ (పశ్చిమ తీరం)లోకి వచ్చే కేరళ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, లక్షదీప్ ప్రాంతాల వారు జూన్ 1 నుంచి జులై 31 వరకు వేటాడటానికి వీల్లేదు. కాగా, నిషేధం విధించి 45 రోజులు పూర్తవుతున్న తరుణంలో పొరుగున ఉన్న తమిళనాడులో కొంతమంది మత్స్యకారులు చేపలవేటకు బయల్దేరారు. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి గతంలో మాదిరిగా 45 రోజుల నిషేధం సరిపోతుందని, ఇకపై తమను అనుమతించాలని కోరగా అందుకు అంగీకరించడంతో వేటకు ఉపక్రమించినట్టు ఆంధ్ర మత్స్యకార నాయకులు చెబుతున్నారు. తమిళనాడు మత్స్యకారులు పొరుగున్న ఉన్న ఆంధ్ర సముద్ర జలాల్లో వేటకు వస్తుంటారని, దీనివల్ల తమకు నష్టం వాటిల్లుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. తమిళ జాలర్లు 61 రోజుల నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిషింగ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐఎఫ్ఐ) కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ తదితర ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి నిషేధాన్ని పాటించకుండా చేపలవేట సాగించే బోట్లను సీజ్ చేయాలని, సంబంధిత మత్స్యకారులను అరెస్టు చేయాలని కోస్ట్‌గార్డ్‌కు ఆదేశాలిచ్చిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిషింగ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు డాక్టర్ వై.జి.కె.మూర్తి ‘సాక్షి’కి తెలిపారు. తమిళనాడు మత్స్యకారుల మాదిరిగానే పొరుగునే ఉన్న పాండిచ్చేరి మత్స్యకారులు కూడా మూడు రోజుల క్రితం నుంచి చేపలవే ట సాగిస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపై తాము రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు.