West Godavari Collector
-
అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
సాక్షి, ఏలూరు (పశ్చిమగోదావరి) : జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మంజూరు చేసే ప్రోత్సాహకాల విషయంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రేవు ముత్యాలరాజు హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అందించే ప్రోత్సాహకాలపై సమీక్షించారు. వచ్చిన దరఖాస్తులు, అందించిన రాయితీలపై ఆరా తీశారు. ఆయన అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలను పరిశీలనకు ఉంచాలని ఆదేశించారు. అవకతవకలు జరిగినట్టు రుజువైతే శాఖాపర చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశ్రమల స్థాపన అనుమతుల కోసం వచ్చిన 21 దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మురళీమోహన్, ఏసుదాసు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ మోహనరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీదేవి, పొల్యూషన్ కంట్రోల్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు ! జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో జిల్లాలో సంపూర్ణ ఆరోగ్యం, ప్లాస్టిక్ వినియోగం తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై ఆరా తీశారు. కొల్లేరు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశానికి మున్సిపల్ కమిషనర్లు హాజరు కాకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరి పాల్గొన్నారు. -
కలెక్టర్ సీరియస్
సాక్షి, పోడూరు(పశ్చిమ గోదావరి) : కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు మంగళవారం జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో సిబ్బంది హడలెత్తిపోయారు. పెనుమంట్ర మండలం నెగ్గిపూడిలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆ సమయంలో స్కూల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోయిన కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్(ఏబీసీడబ్ల్యూఓ)ను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్టేరు సమీపంలో ఉన్న నెగ్గిపూడి బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌ను నాలుగునెలల కిందటే ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి స్కూలు ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 12వ తేదీ నుంచే స్కూళ్లు తెరిచినా ఇప్పటివరకూ ఇక్కడ ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ పొందకపోవడంతో తరగతులు నిర్వహించడంలేదు. 11 హాస్టళ్ల నుంచి దాదాపు 219 మంది విద్యార్థులు నెగ్గిపూడిలోని రెసిడెన్షియల్ స్కూల్లో చేరాల్సి ఉంది. ఇంతవరకు ఒక్కరూ చేరలేదు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో ఆయన రికార్డులను పరిశీలించడంతో ఈ వైఫల్యాలన్నీ వెలుగుచూశాయి. ఎస్సీ బాలికల హాస్టల్ పరిశీలన కలెక్టర్ రేవు ముత్యాలరాజు మంగళవారం మద్యాహ్నం తణుకు పట్టణంలో అకస్మికంగా పర్యటించారు. మంగళవారం తణుకులోని ఇరగవరం కాలనీలో గల ఎస్సీ బాలికల హాస్టల్‌ను కలెక్టర్ ముత్యాలరాజు అకస్మికంగా తనిఖీ చేశారు. తను పరిశీలిస్తున్న విషయం కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్త పాటించారు. ముందుగా తణుకు మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే తణుకు పట్టణంలో గతంలో సేకరించిన రాజీవ్ స్వగృహ పథకంలో ఉద్యోగుల గృహ వసతి కోసం సేకరించిన 20.8 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఇరగవరం కాలనీలో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అందులో విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ ఎల్ శివకుమార్ ఉన్నారు. -
మరో వివాదంలో పశ్చిమ గోదావరి కలెక్టర్
-
కవర్లో వంద చూసి అవాక్కైన కలెక్టర్
-
వరదల పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
ఏలూరు: జిల్లా అధికారులతో వరదల పరిస్థితిని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ సమీక్షించారు. రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ పరిస్థితిలో అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలను కలెక్టర్ కోరారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను 600 మంది సిబ్బంది పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సేవల కోసం 50 పడవలను సిద్ధంగా ఉంచామని కలెక్టర్ తెలిపారు. పోలవరం మండలంలోని ముంపు గ్రామాలను రేపు కలెక్టర్ సందర్శించనున్నారు. వరద బాధితులకు 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.