చంద్రబాబు తీవ్ర విచారం
విజయవాడ: బిహార్లోని కైముర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు యాత్రికులు మృతిచెందిన విషాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతదేహాలు స్వగ్రామాలకు తరించే ఏర్పాట్లు చేయాలని అన్నారు.