west indies-A
-
రెచ్చిపోయిన యువీ: ట్వంటీ 20లో భారత్ ‘ఎ’ గెలుపు
బెంగళూరు: డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (35 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారానికి తోడు రాహుల్ శర్మ (5/23) స్పిన్ మ్యాజిక్ పని చేయడంతో వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన ఏకైక టి20లో భారత్ ‘ఎ’ జట్టు 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఉతప్ప (21 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఉన్ముక్త్ చాంద్ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అపరాజిత్ (3) విఫలమైనా... యువరాజ్, కేదార్ జాదవ్ (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 19వ ఓవర్లో రస్సెల్ తొలి నాలుగు బంతులకు జాదవ్, యువరాజ్, నమన్ ఓజా (0), యూసుఫ్ పఠాన్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కట్టడి చేశాడు. చివర్లో నర్వాల్ (7 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) చెలరేగడంతో భారత్‌కు భారీ స్కోరు ఖాయమైంది. రస్సెల్ 4, నర్స్ 2 వికెట్లు తీశారు. -
ఆ ఒక్క'టీ' భారత్-ఎదే
వెస్టిండీస్-ఎతో వన్డే సిరీస్‌ను భారత్-ఎ ఓడిపోయినా ఏకైక అనధికారిక టి-20 మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. యువరాజ్ సింగ్ (35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52; 2/24) ) ఆల్‌రౌండ్ షోతో పాటు రాహుల్ శర్మ (5/23) సూపర్ స్పెల్‌తో విజృంభించడంతో భారత్-ఎ 93 పరుగులతో విండీస్‌ను చిత్తుచేసింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ను భారత బౌలర్లు 16.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూల్చారు. విండీస్ జట్టులో ఆండ్రీ ఫ్లెచర్ (32) టాప్ స్కోరర్. భారత యువ బౌలర్ రాహుల్ అద్భుతంగా బౌలింగ్ చేయగా, వినయ్ కుమార్, యువరాజ్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువీతో పాటు ఉన్ముక్త్ చంద్ (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47), కేదార్ జాదవ్ (21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 42), రాబిన్ ఊతప్ప (21 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 35) దూకుడుగా ఆడారు. ఓపెనర్లు ఊతప్ప, చంద్ 40 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టకు శుభారంభం అందించారు. ఈ జోడీ వెనుదిరిగాక యువీ, జాదవ్ అదే జోరు కొనసాగించారు. కాగా అపరాజిత్ (3), యూసుఫ్ (0), నమన్ ఓజా (0) నిరాశపరిచినా చివర్లో సుమీత్ నర్వాల్ (7 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 18 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు 200 దాటింది.