WGC Gold Demand Trends
-
బంగారం అమ్మకాలు పెరగాలి, ఏం చేయాలో చెప్పండి
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ఆభరణాల పరిశ్రమల మరింత పురోగమించడానికి తగిన చర్యలు లక్ష్యంగా ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ), రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. ఒప్పందం ప్రకారం... ఈ ఏడాది రెండు భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా భారీగా మల్టీ మీడియా మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభిస్తాయి. భారత వినియోగదారుల్లో ముఖ్యంగా యువతలో పసిడి ఆభరణాల, నాణ్యత, ధరల విధానం విషయంలో అవగాహన పెంచడం దీని లక్ష్యం. యల్లో మెటల్ భవిష్యత్ సంపదగా ఎలా ఉంటుందన్న అంశాన్ని మహిళల్లో అవగాహన కల్పిస్తారు. -
కరోనా కాలంలో పసిడికి భారీగా డిమాండ్
ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2021 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) 37 శాతం (2020 ఇదే కాలంతో పోల్చి)పెరిగింది. పరిమాణంలో ఇది 140 టన్నులు. కోవిడ్ సంబంధ ఆంక్షలు పూర్తిగా తొలగిపోవడం, అంతర్జాతీయంగా ధరలు దిగిరావడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. 2020 మొదటి త్రైమాసికంలో దేశ పసిడి డిమాండ్ 102 టన్నులు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) గురువారం ఈ మేరకు విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే.. విలువ రూపంలో చూస్తే, బంగారం డిమాండ్ 57 శాతం పెరిగి, రూ.37,580 కోట్ల నుంచి రూ.58,800 కోట్లకు చేరింది. ఆభరణాల డిమాండ్ 39 శాతం పెరిగింది. పరిమాణంలో ఇది 73.9 టన్నుల నుంచి 102.5 టన్నులకు ఎగసింది. విలువలో చూస్తే, 58 శాతం పెరిగి రూ.27,230 కోట్ల నుంచి రూ.43,100 కోట్లకు చేరింది. పెట్టుబడుల డిమాండ్ 34 శాతం పెరిగింది. పరిమాణంలో 28.1 టన్నుల నుంచి 37.5 టన్నులకు పెరిగింది. విలువలో 53 శాతం ఎగసి రూ.10,350 కోట్ల నుంచి రూ.15,780 కోట్లకు ఎగసింది. ఇక గోల్డ్ రీసైక్లింగ్ 20 శాతం పడిపోయింది. పరిమాణంలో 18.5 టన్నుల నుంచి 14.8 టన్నులకు చేరింది. మొదటి త్రైమాసికంలో నికర దిగుమతులు భారీగా 262 శాతం పెరిగి 83.1 టన్నుల నుంచి 301 టన్నులకు చేరాయి. కడ్డీలు, నాణేల డిమాండ్ భారీగా 34 శాతం పెరిగింది. 2015 తర్వాత ఈ స్థాయి పటిష్ట డిమాండ్ ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా 23 శాతం పతనం కాగా, అంతర్జాతీయంగా డిమాండ్ మార్చి త్రైమాసికంలో 23% పడిపోయింది. 2020 ఇదే కాలంతో పోల్చిచూస్తే పరిమాణం 1,059.9 టన్నుల నుంచి 815.7 టన్నులకు దిగింది. పసిడి ఈటీఎఫ్ నుంచి నిధులు బయటకు వెళ్లడం, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లు అంతంతమాత్రంగా ఉండడం దీనికి ప్రధాన కారణం. పెట్టుబడుల డిమాండ్ 71 శాతం పడిపోయి, 549.6 టన్నుల నుంచి 161.6 టన్నులకు దిగింది. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు 124.1 టన్నుల నుంచి 95 టన్నులకు తగ్గింది. కాగా ఆర్బీఐ కొనుగోళ్లు 18 టన్నుల నుంచి 18.7 టన్నులకు ఎగశాయి. నడుస్తున్న త్రైమాసికం కష్టమే... ధర తగ్గడం, కోవిడ్ ఆంక్షల సడలింపుతోపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావడం మార్చి త్రైమాసికంలో పసిడి సెంటిమెంట్‌ను సానుకూలమైంది. వార్షికంగా చూస్తే, త్రైమాసికంలో సగటున 10 గ్రాముల పసిడి ధర 14 శాతం పెరిగి రూ.47,131గా ఉంది. అయితే సమీక్షా కాలానికి ముందు త్రైమాసికం (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ధర 6 శాతం తగ్గింది. ధర గరిష్ట స్థాయిల్లో రూ.56,000 వద్ద ఉన్న ఆగస్టు 2020తో పోలి్చతే ధరల్లో తగ్గుదల ఏకంగా 16 శాతంగా ఉంది. రూ.50,000 దిగువకు పసిడి దిగిరావడంతో కొనుగోళ్లకు సంబంధించి వినియోగదారు సంసిద్ధత సానుకూలంగా మారింది. పెళ్లిళ్లు, పండుగల వంటి కార్యక్రమాలు డిమాండ్‌కు తోడయ్యాయి. ఇక పెట్టుబడులకు సంబంధించి పసిడి డిమాండ్ మెరుగుపడ్డం ఇది వరుసగా మూడవ త్రైమాసికం. పసిడిపై సుంకాల తగ్గింపు, రూపాయి బలోపేతం కావడం పసిడికి సానుకూల అంశాలుగా మారాయి. అయితే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇంత మంచి ఫలితాలు ఉంటాయన్న విషయం అనుమానమే. కోవిడ్-19 సెకండ్‌వేవ్ పెరుగుదల, రాష్ట్రాల్లో స్థానికంగా లాక్డౌన్లు, వినియోగ డిమాండ్ పడిపోవడం వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయా అంశాల నేపథ్యంలో పెళ్లిళ్లకు బంగారం డిమాండ్ పడిపోయే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతం అయ్యేంత వరకూ డిమాండ్‌పై అనిశ్చితి కొనసాగే వీలుంది. ఆయా పరిస్థితుల్లో 2021 సంవత్సరం మొత్తంగా డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందన్న అంశం చెప్పడం కష్టమే. - పీఆర్ సోమసుందరం, డబ్ల్యూజీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా చదవండి: సామాన్యులకు ఊరట.. జీఎస్టీ తొలగింపు! -
పుత్తడికి అంత డిమాండ్ ఎందుకు?
సెంట్రల్ బ్యాంకుల వ్యూహాత్మక కొనుగోళ్లు పసిడి డిమాండ్‌కు ఊతమిచ్చాయి. దీంతో అంతర్జాతీయంగా 2019 మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ 7 శాతం పెరగడానికి దోహద పడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) గురువారం వెల్లడించింది. దేశీయంగా బంగారు ఆభరణాల డిమాండ్ ఏకంగా నాలుగేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే చైనాలో మాత్రం బంగారు ఆభరణాల డిమాండ్ 2 శాతం క్షీణించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ దాదాపు 7శాతం పెరిగి 1,053.3 టన్నులకు చేరుకుంది. సెంట్రల్ బ్యాంకులు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఇప్పటికే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ట్రెండ్ మరింత పెరగొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మార్కెట్ ఇంటిలిజెన్స్ హెడ్ అలిస్టైర్ హెవిట్ తెలిపారు. సెంట్రల్ బ్యాంకులు ఇప్పటికే సుమారు 145.5 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. 2013 నుండి పోలిస్తే.. ఈ తొలి త్రైమాసికంలో ఇదే అత్యధికం. ఇన్వెస్టర్ల చూపు మనీ మార్కెట్ల మీద నుండి ఇతర మార్గాలకు మళ్ళడం, బంగారం మీద పెట్టుబడులు సురక్షిత పెట్టుబడులుగా భావించడం, లిక్విడ్ ఆస్తుల కోనుగోళ్లు వంటివి బంగారం డిమాండ్ పెరగడానికి కారణంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భావిస్తోంది. ఇక దేశీయంగా 2019 ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసికంలో దేశీయంగా పసిడి డిమాండ్ అత్యధికంగా పెరిగి 125.4 టన్నులుగా ఉంది. ఇది 4 ఏళ్ళ గరిష్టమని డబ్ల్యుజిసి తెలిపింది. భారత దేశంలో బంగారు ఆభరణాల డిమాండ్ వల్ల గ్లోబల్ డిమాండ్ 1శాతం పెరిగి 530.3 టన్నులకు చేరింది. చైనాలో బంగారు ఆభరణాల డిమాండ్ 184.1 టన్నులుగా ఉంది. ముఖ్యంగా దేశంలో స్వార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్, సరియైన పత్రాలు లేకుండా రూ. 50వేలకు నగదుకు తీసుకెళ్ల కూడదనే నిబంధన కూడా దేశీయ డిమాండ్‌కు తోడ్పడిందని సంస్థ తెలిపింది. అలాగే 2018 పోలిస్తే 2019 సంవత్సరం తొలి త్రైమాసికంలో అధికంగా సుమారు 21 శుభ ముహూర్తాలున్నాయని పేర్కొంది. రెండవ త్రైమాసికంలో రానున్న అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్‌కు తోడు గత ఏడాదితో పోలిస్తే పెరిగిన పంటల ధరలతో పుత్తడి డిమాండ్ మరింత పుంజుకుంటుందని వ్యాఖ్యానించింది. 2019 తొలి త్రైమాసికంలో ఇండియాలో గోల్డ్ బార్స్ , కాయిన్స్ మీద 4శాతం డిమాండ్ పెరిగి 33.6 టన్నులుగా ఉంది. గత ఆర్ధిక సంవత్సరం ఇది 32.3 టన్నులుగా ఉండేది. అమెరికన్ మార్కెట్ల మందగమనం, ఫెడరల్ రిజర్వ్ యొక్క బదిలీ వైఖరి కారణంగా తొలి క్వార్టర్లో పెట్టుబడి దారులు బంగారం వైపు చూస్తున్నారు. అమెరికన్ మార్కెట్లలో తటస్థ వైఖరి కారణంగా బంగారం-ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పసిడి కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. 2015 నుండి పోలిస్తే... ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో 5శాతం వృద్ధితో ఈ తొలి క్వార్టర్లో బంగారం డిమాండ్ 125.4 టన్నులుగా ఉందని గోల్డ్ కౌన్సిల్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి చూస్తే రానున్న కాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 35వేల మార్కును దాటొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. -
బంగారానికి తగ్గిన డిమాండ్
2014 జనవరి-మార్చి మధ్య 190 టన్నులు గతేడాది ఇదే కాలంలో 257 టన్నులు డబ్ల్యూజీసీ తాజా నివేదిక ముంబై: భారత్ బంగారం డిమాండ్ 2014 మొదటి క్వార్టర్ జనవరి- మార్చి నెలల మధ్య 2013 ఇదే కాలంతో పోల్చితే 26 శాతం పడిపోయింది. ఈ కాలాల మధ్య బంగారం డిమాండ్ 257.5 టన్నుల నుంచి 190.3 టన్నులకు తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక ఒకటి మంగళవారం పేర్కొంది. కరెంట్ అకౌంట్ కట్టడి(సీఏడీ)లో భాగంగా ప్రభుత్వం పసిడి దిగుమతిపై విధించిన అధిక దిగుమతి సుంకాలు, సరఫరాల్లో కట్టడి అంశాలు దీనికి కారణమని నివేదిక పేర్కొంది. డబ్ల్యూజీసీ గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ పేరుతో ఆవిష్కరించిన నివేదిక ముఖ్యాంశాలను సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ (ఇండియా) సోమసుందరం ఇక్కడ తెలిపారు. విలువ రూపంలో చూస్తే, మొదటి త్రైమాసికాల్లో బంగారం డిమాండ్ విలువ 33 శాతం పడిపోయింది. ఇది రూ.73,184 కోట్ల నుంచి రూ. 48,853 కోట్లకు తగ్గింది. దేశీయంగా భారీ సుంకాల వల్ల అంతర్జాతీయ మార్కెట్ రేటుతో పోల్చితే దేశీయంగా ధర దాదాపు 3 వేల వరకూ అధికంగా ఉంది. దీన్ని సొమ్ము చేసుకోవడానికి భారత్‌లోకి బంగారం అక్రమ రవాణా భారీగా కొనసాగింది. దేశంలో బంగారంపై ఆంక్షల వల్ల ఈ పరిశ్రమపై కొంత ప్రతికూల ప్రభావం కనబడుతోంది. దేశీయంగా ధరల తీవ్రత వల్ల భారతీయులు యూఏఈలో బంగారం కొనుగోళ్లు జరిపి, దేశానికి తీసుకురావడం అధికమైంది. దీనితో యూఏఈలో బంగారం డిమాండ్ 13 శాతం పెరిగింది. క్యూ1లో ఆభరణాల డిమాండ్ విషయానికి వస్తే, ఈ పరిమాణం 9 శాతం తగ్గి 159.5 టన్నుల నుంచి 145.6 టన్నులకు క్షీణించింది. విలువ రూపంలో ఇది 18% పడిపోయి రూ.45,331.2 కోట్ల నుంచి రూ.37,377.8 కోట్లకు తగ్గింది. ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 54% తగ్గి 98 టన్నుల నుంచి 44.7 టన్నులకు చేరింది. విలువ రూపంలో రూ.27,852 కోట్ల నుంచి 11,475 కోట్లకు పడింది. మోడీ-బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. బంగారం దిగుమతులపై స్వల్పకాలిక ఆంక్షలు తొలగించే అవకాశం ఉంది. ఇదే జరిగితే డిమాండ్ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. 2014లో బంగారం డిమాండ్ 900 నుంచి 1000 టన్నుల వరకూ నమోదవుతుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా... కాగా ప్రపంచ వ్యాప్తంగా 2014 మొదటి క్వార్టర్లో బంగారం డిమాండ్ దాదాపు స్థిరంగా 1,074.5 టన్నులుగా కొనసాగింది. 2013 ఇదే క్వార్టర్లో ఈ పరిమాణం 1,077.2 టన్నులు.