కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనల సమీక్ష
న్యూఢిల్లీ: కంపెనీలు ఎగ్జిక్యూటివ్లకు అధిక వేతనాలు చెల్లించడం, స్వతంత్ర డెరైక్టర్లకు స్టాక్ ఆప్షన్స్ కేటాయించడం వంటి అంశాలకు ఇక చెక్ పడనుంది. ఇందుకు అనుగుణంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)కు సంబంధించిన నిబంధనలను పూర్తిగా సమీక్షించి తగిన మార్పులను చేపట్టింది.
తాజా నిబంధనలు ఈ ఏడాది అక్టోబర్ 1నుంచి అమలుకానున్నాయి. వీటితోపాటు మ్యూచువల్ ఫండ్లలో రూ. 2 లక్షల వరకూ పెట్టుబడులపై పన్ను మినహాయింపులపై కూడా దృష్టిపెట్టింది. తాజా నిబంధనలను సెబీ బోర్డు గురువారం సమావేశంలో ఆమోదించింది. పన్ను మినహాయింపు అంశాల ప్రతిపాదలను ప్రభుత్వానికి పంపనున్నట్లు సమావేశం అనంతరం సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు.