White House chief of staff
-
వైట్‌హౌస్ స్టాఫ్ చీఫ్‌గా సూజీ వైల్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు తొలి అధికారి నియామకాన్ని ప్రకటించారు. తన ప్రచార మేనేజర్ సూజీ వైల్స్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమిస్తున్నట్లు గురువారం వెల్లడించారు. 67 ఏళ్ల వైల్స్ అమెరికా చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. ‘అమెరికా చరిత్రలో గొప్ప రాజకీయ విజయాన్ని సాధించడానికి సూజీ వైల్స్ నాకు సాయపడ్డారు. 2016లో, 2020లో, ఇప్పుడు నా ప్రచారంలో అంతర్భాగంగా ఉన్నారు. ఆమె కఠినమైన, తెలివైన, సృజనాత్మకమైన వ్యక్తి. అమెరికా చరిత్రలో తొలి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూజీని నియమించడం గౌరవంగా భావిస్తున్న’ అని ట్రంప్ వెల్లడించారు. ఇది గొప్ప వార్తని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ప్రచారంలో కీలక పాత్ర పోషించిన సూజీ వైట్‌హౌస్‌లోనూ అంతే కీలకంగా పనిచేస్తారని తెలిపారు. ఎవరీ సూజీ వైల్స్?సూజీ వైల్స్.. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎ ఫ్ఎల్) ఆటగాడు, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ పాట్ సమ్మరల్ కుమార్తె. 1957 మే 14న జన్మించిన ఆమె.. న్యూయార్క్ రిపబ్లికన్ జాక్ కెంప్ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో వైట్‌హౌస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. 1980లలో రోనాల్డ్ రీగన్ అధ్యక్ష ప్రచార బృందంలో చేరారు. ఇది జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష ప్రమేయానికి నాంది పలికింది. రీగన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం తరువాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ఆమె ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ ఆమె ఇద్దరు జాక్సన్విల్లే మేయర్లకు సలహాదారుగా పనిచేశారు. వ్యాపారవేత్త అయిన రిక్ స్కాట్ గవర్నర్‌గా గెలిచేందుకు తోడ్పడ్డారు. 2012లో ఉటా గవర్నర్ జాన్ హంట్స్‌మన్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అదే ఆమెకు మరోమారి వైట్‌హౌస్‌కు బాటలు వేసింది. 2016లో డోనాల్డ్ ట్రంప్ ప్రచార బృందానికి నాయకత్వం వహించారు. ఆ తరువాత 2018లో ఫ్లోరిడా గవర్నర్‌గా రాన్ డిశాంటిస్ గెలుపులోనూ సూజీ కీలక పాత్ర పోషించారు. ఇదీ చదవండి: ముంచింది బైడెనే.. -
వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా క్లెయిన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పాలనా అధికారుల నియామకంపై గట్టి కసరత్తు చేస్తున్నారు. చాలా ఏళ్లుగా తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాన్ క్లెయిన్కు అత్యంత శక్తిమంతమైన పదవిని అప్పగించారు. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆయనను నియమిస్తూ బుధవారం బైడెన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అగ్రరాజ్య అధ్యక్షుడు రోజు వారీ కార్యక్రమాల్ని చూడాలి. ఆయనను అధ్యక్షుడి గేట్ కీపర్ అని పిలుస్తారు. ప్రభుత్వం ఎదుర్కోబోయే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే ఇతర సిబ్బంది నియామకంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ‘‘నేను, రాన్ గత ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేశాం. 2009లో అమెరికా చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించాం. 2014లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కూడా మేము కలిసి కట్టుగా అధిగమించాం. వైట్ హౌస్ పదవికి ఆయనను మించిన వారు లేరు’’ అని బైడెన్ ట్రాన్సిజన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాన్ క్లెయిన్కున్న అపారమైన అనుభవం, అత్యంత సమర్థతతో ఇద్దరం కలిసి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కిస్తామని బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్ల కంటే తక్కువగా ఉన్న వారికి పన్ను పెంచబోమని కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు. ధనవంతుల దగ్గర్నుంచి పన్ను వసూలు చేస్తామని ఒక ట్వీట్లో స్పష్టం చేశారు. అలాస్కాలో ట్రంప్ విజయం అమెరికా అధ్యక్ష పదవిని విడిచిపెట్టేది లేదని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ అలాస్కా రాష్ట్రంలో నెగ్గారు. దీంతో ఆయన ఖాతాలోకి మరో మూడు ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అలాస్కా విజయంతో ట్రంప్ ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 217కి చేరుకుంది. ట్రంప్‌కి 56.9శాతం ఓట్లు వస్తే, అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు 39.1శాతం ఓట్లు వచ్చాయి. 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు గాను బైడెన్‌కు ఇప్పటికే 279 ఓట్లు లభించాయి. అలాస్కా సెనేట్ స్థానంలో రిపబ్లికన్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. దీంతో 100 స్థానాలున్న సెనేట్‌లో ఆ పార్టీ బలం 50కి చేరుకుంది. బైడెన్‌కి తోడుగా ప్రపంచదేశాధినేతలు ఒకవైపు ట్రంప్ ఓటమిని అంగీకరించకుండా, అధికార బదలాయింపు ప్రక్రియ క్లిష్టరతమౌతోన్న వేళ, కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కి ప్రపంచ దేశాధినేతలు కరోనా మహమ్మారి, వాతావరణ మార్పు, ఇతర విషయాలపై సహకరిస్తామని మద్దతు తెలుపుతున్నారు. ఉత్తర కొరియాతో అణ్వాయుధ ఉద్రిక్తతలను తగ్గించడానికి, దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తానని జోబైడెన్ తెలిపినట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే –ఇన్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతని పెంపొందించడానికి దక్షిణ కొరియాతో భాగస్వాములమౌతామని బైడెన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య అణ్వాయుధ ఉద్రిక్తతల నివారణకు ట్రంప్ కాలంలో కృషి జరిగిందని, దాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని మూన్ అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా బైడెన్‌ని కోరినట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించినట్లు జపాన్ ప్రధాని యోషిహిడే సుగా తెలిపారు. -
ఆయన నా రియల్ స్టార్.. ట్రంప్ కీలక మార్పు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక మార్పు చేశారు. ఇప్పటి వరకు అమెరికా అంతర్గత వ్యవహారాలను పర్యవేక్షించిన కార్యదర్శి జనరల్ జాన్ కెల్లీని శ్వేతసౌద సిబ్బంది చీఫ్‌గా నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఈ విషయం చెప్పేందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడే నేను జనరల్/సెక్రటరీ జాన్ ఎఫ్ కెల్లీని వైట్ హౌస్ స్టాఫ్ చీఫ్‌గా ప్రకటించాను. ఆయన గొప్ప అమెరికన్. గొప్ప నాయకుడు. అంతర్గత వ్యవహారాల కార్యదర్శిగా ఆయన బృహత్తర విధులు నిర్వర్తించారు. నా పరిపాలన వర్గంలో ఆయన నిజమైన స్టార్' అంటూ ట్రంప్ పేర్కొన్నారు. కెల్లీ రెయిన్స్ ప్రీబస్ స్థానంలో పనిచేయనున్నారు.